హోమం

Tuesday, November 15, 2022

  


27 జులై, 2022   

రంజనికి ఫోన్ చేసాను ఫలానా తారీఖున ఫలానా వాళ్ళింట్లో అబ్బాయికి ఒడుగుట. ఇద్దరు వడుగు అయిన అబ్బాయిలు కావాలిట. మీ అబ్బాయికి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు  ఒడుగు చేసారు కదా, ఏమైనా కుదురుతుందా" అని. "తప్పకుండా తీసుకొస్తా అండీ" అంది. ఒడుగు 6.30 కానీ పొద్దున్న 4.30కల్లా ఆ అబ్బాయిని తెమ్మని చెప్పారుట. ఆ పిల్లాడు ఒకటే గొడవ. అబ్బా అంత పొద్దున్న అయితే రాను పో అని. తల్లి ఒప్పించి తీసుకొచ్చింది. చాలా సేపు పట్టింది అంతా అయ్యేసరికి. "ఇంకాసేపు ఉండండి భోజనం చేసాక బాబుకి తాంబూలం ఇవ్వాలని బ్రహ్మ గారు చెప్పారు. అది తీసుకుని వెళ్ళండి" అంటూ ఉంచేసారు. అక్కడ ఇంక పిల్లలెవరూ లేరు. ఆ పిల్లాడు అమ్మ చెయ్యి పట్టుకుని పోదాం పోదాం అని ఒకటే బతిమాలాడు. తల్లికి అటూ ఇటూ చెప్పలేని ఇబ్బంది. అయ్యో అనిపించింది. " వచ్చే నెల మళ్ళీ పూర్తి బిజీ అండీ. ఒకటవ జంధ్యాల పూర్ణిమ కాబట్టి హోమాలు అవీ చెయ్యాలని పంతులు గారు చెప్పారు ఆ హడావిడి" అంది. "అదేమిటి జంధ్యాల పూర్ణిమ రోజు జందెం మార్చుకుని గాయత్రి జపం చేసుకుంటారు కానీ హోమాలు అవీ ఎప్పుడూ వినలేదే" అన్నాను నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో. "అంటే ..మాలో అలా చేస్తారుట అండి.  మా వారి చిన్నప్పుడు కూడా చేసేవారుట, అందుకే చేయిస్తున్నాము" అంది. నేను చుట్టు పక్కల చూసిన చోట ఎక్కడా పెద్ద ఎత్తున హోమాలు చెయ్యడం వినలేదు, అదే మాట అన్నాను. తను " కాదండీ ఇది పురాతన పద్ధటేట, తండ్రి దగ్గరుండి హోమాలు చేయించాలిట " అని చెప్పింది. హోమం చెయ్యడానికి నేను వ్యతిరేకిని కాదు, నాకు చాలా ఇష్టం కూడా,.. కానీ ఈ మధ్య ఎందుకో అన్నీ కూడా పూర్తి వ్యాపారాత్మకంగా అయిపోయాయి అని మాత్రం అనిపించి " ఒడుగు చేసాక వటువుని గురుకులం పంపిచేవారు కదా పాత కాలంలో ? మరి తండ్రి ఎలా చేయించి ఉంటారు? గురువు చేయించేవారేమో" అన్నాను. "కాదండీ తండ్రే అని పంతులు గారు చెప్పారు" అంది . "ఏమోలే అన్నీ కొద్దిగా ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు పెద్ద హోమాలు అవీ గుడిలో మాత్రం జరిగేవి, దేవతార్చన చాలా సింపుల్ గా జరిగేది ఇళ్ళలో. బాగా నిష్టాగరిష్టులైన బ్రాహ్మలైనా, ఇళ్ళలో ఎడాపెడా హోమాలూ అవీ చేసిన గురుతు లేదు. ఏవో నోములు చేసినా ఆకు వక్క పువ్వు పండూ తప్ప ఆర్భాటాలు అంబరాన్ని అంటే సీన్ లేదు. అప్పడప్పుడు పసుపు కుంకుమ పంచేవారు గుడి దగ్గర" అన్నాను. "ఓహో అవునా.. నాకు అంతలా తెలియదు అండీ. మా పంతులు గారు ఏం చెపితే అదే" అంది. " అవునులే. మనకేం తెలుసుస్తుంది. వాళ్ళు చెప్తే వినడమే కానీ.. మరి వాళ్ళు ఏవీ కూడా సింపుల్ గా తేల్చట్లేదుగా! ఉదాహరణకి ఇంటి గృహప్రవేశం రోజు సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారు కదా.. ఆయన ఒక్కడూ రాడు కదా? సాంగం సాయుధం సపరివారం మాత్రమే కాకుండా వెంట నవగ్రహాలని, అష్ట దిక్పాలకులని, ఇంకా ఎవరో తనకి ఇష్టులైన వాళ్ళని తెచ్చుకుంటాడు? వాళ్ళందరికీ తగిన రీతిలో ఆసనాలు నైవేద్యాలు ఇచ్చి సత్కరించి పూజించుకుంటాము కదా? మరి మళ్ళీ నవగ్రహ హోమం అవసరం ఉందో లేదో కానీ ఈ మధ్య అందరూ నవగ్రహ హోమం, సుదర్శన హోమం, గణపతి హోమం వగైరా వగైరా నాలుగైదు చేసి పారేస్తున్నారు. మరి ఇదంతా నాకు కొంచెం ఎగస్ట్రా  అనిపిస్తోంది" అన్నాను. తను కాసేపు మాట్లాడలేదు.  "నిన్ను విమర్శించట్లేదు అమ్మలూ, కానీ చండీ హోమాలు అవీ ఇళ్ళల్లో చేసేవి కావు అనేవారు మా పక్కింటి తాతగారు. వారు చాలా నిష్టతో పూజ చేసేవారు ఇంట్లోనూ, గుడిలోనూ. వారికి పౌరోహిత్యం ఉందన్నమాట.  కానీ కొన్ని గుడికి  పరిమితం, అక్కడ చెయ్యడం వల్ల ఊరికి మంచిది. కొన్ని హోమాలు ఊరి కోసం చెయ్యాలి ఒక్కరి ఇంటికోసం కాదు అనేవారు. అలాగే ఇది కూడా" అన్నాను. "అవును అండీ బాబు కూడా అంత సేపు కూచోగలడా అని చూస్తున్నా, ఒక్కొక్కసారి విసిగించినా, ప్రస్తుతానికి వింటున్నాడు. రెండు పూట్లా సంధ్యావందనం చేస్తున్నాడు" అంది.  


పిల్లవాడికి ఇంకా 8 ఏళ్ళు. పొద్దున్న నించీ సాయంత్రం వరకూ ఊపిరి తీసుకోకుండా సంగీతం, ఫ్లూటు, తెలుగుబడి, బాస్కెట్ బాల్, సాకర్ అంటూ అన్నిటికీ తిప్పినా, ఇంకా సంధ్యావందనం ఖచ్చితంగా చేస్తున్నాడు. అదే చాలు. ఇప్పుడు గంటలు గంటలు ఇలాంటివి పెడితే ఆసక్తి పోదా అని చిన్న ప్రశ్న నా మదిలో మెదిలింది కానీ ఇంక పెద్దగా చెప్పాలనిపించలేదు. "ఏమోనండీ మా అత్తగారు చేయించమన్నారు అందుకే .." అంది ఇబ్బందిగా. " అయ్యో! అన్నీ  కుదిరి చేయిస్తే మంచిదే..ఏదో లోకాభిరామాయణంగా మాట్లాడాను అంతే" అన్నాను తనని ఇబ్బంది పెడుతున్నానేమో అని మొహమాటపడుతూ.  " సుధా వాళ్ళు చండీ హోమం చేస్తున్నారు వచ్చేవారం మీరు వస్తున్నారా" అంది మాట మారుస్తూ. 


నా అభిప్రాయం మీకు నచ్చదేమో కానీ అన్ని సందర్భాలకీ నాలుగైదు హోమాలు, పెద్ద ఎత్తున పూజలు చేసేస్తూ, పక్కింటి వాళ్ళు చేసారు కాబట్టి మనం చెయ్యకపోతే ఎలా అని డబ్బు ఇబ్బంది ఉన్నా అప్పులు చేసి యాగాలు చేసిన వారున్నారు మాకు తెలిసున్న వాళ్ళలో. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. మరి మీకు

0 వ్యాఖ్యలు: