పాఠోళి ఒక ఒరియా వంటకం(ట) మన దగ్గరికి ఎలా వచ్చిందో కానీ, కూరలు లేవురా దేవుడా అనుకున్న టయింలో నేనున్నాగా అంటుంది. ఇంట్లో కూరలు లేనప్పుడు చక చకా చేసేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
శెనగ పప్పు 1కప్పు
పెసర పప్పు 1 కప్పు
ఎండుమిరప కాయలు 12 ( మీ ఇష్టం మరి 3 నించి ఎన్నయినా వేసుకోవచ్చు)
జీల కర్ర
కరివేపాకు
ఉప్పు (సరిపడా)
నూనే పెద్ద గరిటెడు (ఇక్కడ హెల్త్ కాన్షియస్ అన్నారంటే మాత్రం దేవుడే మిమ్మల్ని కాపాడాలి) !
ఇంగువ చిటికెడు (ఇష్టమైతేనే)
శెనగ పప్పు, పెసరపప్పు కడిగేసి నీళ్ళల్లో నానబెట్టాలి.
మిరపకాయలు కూడా కడిగేసి వాటితో నానబెట్టాలి.
2 గంటల తరవాత, యీ మూడింటిని ఉప్పు వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి.
పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. నూనె మిశ్రమం మొత్తానికి అంటేలా కలిపి, సిం లో పెట్టి మూత పెట్టాలి. ప్రతి 5 నిమిషాల కొక సారి కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. అరగంట పైగా పడుతుందనుకోండీ, కొచెం ఓపిక కావాలి మరి !
బాగా మగ్గిందనిపించాక గిన్నె లోకి తీసుకుని గరిటతో ఒక సారి మెదపాలి. పక్కన చారు/రసం పెట్టుకుంటే అన్నం లోకి చాలా బాగుంటుంది.
(కొంతమంది మెంతి ఆకులు కూడా వేస్తారుట, నేనెప్పుడూ వెయ్యలేదు.)
ఎప్పుడైనా నాన బెట్టిన శెనగలు ఉండి అవి పాడైపోతాయనుకుంటే, వాటితో కూడా ఇదే పద్దతిలో పాటోలీ/
పాఠోళి చేసుకోవచ్చు. కొంచెం రుచి తేడా తో అది కూడా చాలా బాగుంటుంది.
ఈ సారి అనేక కారణాల వల్ల పుట్టిన రోజు జరుపుకోవట్లేదు నేను, అందుకని వనభోజనాల్లో భోజనం చేసేసి, నన్నో సారి శతమానం భవతి అని దీవించెయ్యండి మరి! (ఇలా అనుకుంటా కానీ సంవత్సరానికి పట్టుమని పది టపాలైనా వ్రాయట్లేదు, అందుకే మరి మీ దీవెనలత్యవసరం, దీవించేస్తారుగా!)

11 వ్యాఖ్యలు:
అబ్బా ఎంతబావుంటుందో
Maa baamma chestaru,naaku chala estam,thanks for patoli,
HAPPY BIRTHDAY ENNELA
Maa bamma chestaru,so yummy.thanks for patoli
HAPPY BIRTHDAY DAY ENNELA
HAPPY birthday ennela
ఈ పాఠోళి ఒరియా వంటకమా. కృష్ణా జిల్లాలో విరివిగా చేసుకునే పచ్చడి కాని పచ్చడి, వేపుడు అనుకోవచ్చు.
ఈ కార్థీక పౌర్ణమి సందర్భంగా, మీ బ్లాగులో మీరు వారానికి ఒక్కటైనా మంచి నిడివిగల, ఉపయోగకరమైన వ్యాసాలు వ్రాయుదురు గాక అని ఆశీర్వదిస్తున్నాను.
పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎన్నెలమ్మా!
happy birth day
ఎన్నెల గారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మరియు శతమానం భవతి.
పాఠోళి బాగుంది.
belated wishes :)
కష్టేఫలి గారు ధన్యవాదాలండీ..అవును భలే బాగుంటుంది.
శోభా ధన్యవాదాలు. అవునా, యీ సారి బామ్మ ని చేసి పెట్టమను మరి!
శివరామ ప్రసాద్ గారూ మీ ఆశీర్వచనాలకి బోల్డు ధన్యవాదాలండీ..నిజం చెయ్యడానికి ప్రయత్నిస్తా. అవునండీ, ఒక ఒరియా అమ్మాయి చెప్పింది ఇది వాళ్ళ వంటకమని, తరవాత ఇంటర్నెట్ లో కూడా ఎక్కడో చదివా. నాకు మొదటి నుంచీ అనుమానం గానే ఉంటుంది, ఇది తెలుగు పేరు లా లేదే అని. కానీ మునగ కాయలు వేస్తారుట వాళ్ళు.
సిరి సిరి మువ్వల గలగలలకి ఎన్నెలమ్మ ధన్యవాదాలు.
ANRD గారూ మీ శుభాశీస్సులకి ధన్యవాదాలండీ...తొందరగా 100 టపాలు వ్రాసేయాలని ఉంది.
పరుచూరి వంశీ గారూ, ధన్యవాదాలండీ, బిలేటెడ్ కాదు, మీరు కామెంటే టయిముకు మాకింకా ఇక్కడ సాయంత్రం అయ్యిందంతే. మీరు సరయిన సమయం లోనే విష్ చేసారు. మరొక్కసారి ధన్యవాదాలు
Post a Comment