ఎండాకాలం సెలవల్లో సాయంత్రం అందరం బయట అరుగు మీద కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంటి ముందు లారీ ఆగింది . అందరం అటువైపు చూసాము. ఇంటి ముందర ఉన్న ఖాళీ ఇంట్లోకి ఎవరో వస్తున్నట్టున్నారు. ఇద్దరు మగ వాళ్ళు దిగారు. ఇంటి వైపు వస్తూ,
" కాశీకర్ గారితో మాట్లాడామండీ తాళాలు మీ ఇంట్లో తీసుకోమన్నారు" అని చెప్పారు ఒకాయన. "రండి రండి" అని లోపలికి పిలిచారు నాన్న. అమ్మ తాగడానికి నీళ్ళు తెచ్చింది . ఈ లోపు పిల్లలూ ఆడవాళ్ళు దిగి అక్కడే నించున్నారు. "రండమ్మా నీళ్ళు తాగుదురుగానీ " అని పిలిచింది అమ్మ. "మేము ఇద్దరం అన్నదమ్ములమండీ మిలటరీ లో పని చేస్తున్నాము. బరేలి నించి ఇద్దరికీ ఇక్కడ ఎం సి ఈ ఎం ఈ కి వేసారు. స్నేహితుడొకడు చూపించాడు ఈ ఇల్లు. మా స్వస్థలం రాయలసీమ" అని చెప్పారు పెద్ద రెడ్డి గారు. అందరూ అరుగు మీద కూర్చున్నారు. అయిదుగురు పిల్లలు. రాజ్య లక్ష్మి, భాగ్య లక్ష్మి, నరసింహా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డీ అని గబా గబా పేర్లు చెప్పుకున్నారు మొదటి నలుగురు. పెద్దాయనకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు, చిన్నాయనకి ఇద్దరు మగ పిల్లలు అని చెప్పారు. అందరిలోకీ చంటాడు రెండేళ్ళవాడు . మూతి సున్నాలా పెట్టి అదోరకం చప్పుడు చేస్తున్నాడు. అమ్మ పిల్లలకి మురుకులు పెట్టింది . నీ పేరేంటీ అని అడిగాన్నేను. అదే పనిగా చప్పుడు చేస్తున్నాడు. "బుడ్డోడా" అని పిలిచారు నాన్న . ఠక్కున చూసాడు. అప్పటి నించీ వాడికి అదే పేరు. అసలు పేరు రాజశేఖర్ రెడ్డి (ఏమో ఇప్పటికీ నాకు సరిగ్గా తెలీదు) అయ్యుండొచ్చు.
నరసింహ , బుడ్డోడు ఒకే పోలికతో ఉండడం మూలాన ఇద్దరు చిన్న రెడ్డి గారి పిల్లలని మేము అనేసుకున్నాము, చాలా రోజులకి గానీ తెలీలేదు చందూ , బుడ్డోడు సొంత అన్నదమ్ములని. వచ్చీ రావడం తోనే కాలనీలో రెడ్డి సహోదరులు తెగ ఫేమస్ అయిపోయారు. అన్నదమ్ములిద్దరికీ ఇంకో స్నేహితుడు అక్కర్లేదు. ఇంటికొస్తూనే ఇద్దరూ మేడ మీద కూర్చుని చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. పెద్దావిడ క్రోషా అల్లుతారు. దానికి కావలసిన దారం టోకున కొనుక్కొచ్చి అన్నదమ్ములిద్దరూ ఖాళీ సమయాల్లో చిక్కులు పడకుండా దారాన్ని కండెలకి చుట్టి పెడతారు. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అవడం వల్ల కావచ్చు చాలా సరదాగా గడిపేస్తారు. పిల్లలకి కూడా ఇంకోళ్ళ ఇంటికెళ్ళే పని లేదు. వాళ్ళకి వాళ్ళు చాలు. భయ భక్తులతో ఎక్కువ అల్లరి చేయకుండా ఆడుకుంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలైనా బావగారికి, మరదలికీ జరుగుతాయి తప్ప ఇంక ఇంట్లో ఎవ్వరూ మాట్లాడరు. మళ్ళీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వదినా మరుదులు మాత్రం ఏమీ కానట్టే ఉంటారు. మగ వాళ్ళు ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాక, అక్క చెల్లెళ్ళు బుడ్డోడిని తీసుకొచ్చి మా ఇంట్లో కూచుని అమ్మతో కబుర్లు చెప్పేవారు. నాన్న ఏవో ఆధ్యాత్మిక విషయాలు చెప్తుంటే వినడం వాళ్ళకి ఇష్టం . బుడ్డోడు మాత్రం మా అందరికీ తెగ అలవాటయ్యాడు. పై నలుగురూ పరిగెత్తే ఆటలాడుకుంటుంటే, బుడ్డోడు మాత్రం మా ఇంట్ళొకొచ్చి టీవీ పెట్టమని నాన్నని అడిగి దాని ముందు అలా సెట్టిల్ అయ్యేవాడు. చీకట్లో కళ్ళు మెరిపిస్తూ టీవీ చూస్తూ అలానే నిద్రపోయేవాడు. అందరం బాగా ముద్దు చేసేవాళ్ళం . ఇంట్లో ఏం చేసినా బుడ్డోడికి పెట్టావా అని అడిగేవారు నాన్న.
రెడ్డిగారింటికి ఎవరో చుట్టాలొచ్చారు రెండు రోజులుగా ఎవరూ ఇటువైపు రాలేదు. కాలేజీ నించి నేను ఇంటికొచ్చేటప్పటికి అమ్మ చెల్లితో "పొద్దున్న మన మేడ మీద స్థలం సరిపోక , రెడ్డి గారింటి మేడ మీద కూడా వడియాలు పెట్టాను. మన మేడ మీదవి నేను తెస్తా ,మబ్బు పట్టేట్టుంది అక్కా నువ్వూ వెళ్లి రెడ్డి గారి మేడ మీద వడియాలు పట్టుకొచ్చెయండి" అంది . సరే అని పైకి వెళ్లి వడియాలు తీసాము. ఈ లోపు బాగా నల్ల మబ్బు పట్టింది. ఏ నిమిషాన అయినా వాన రావచ్చు. పైన ఒక పక్క రెడ్డి గారి భార్య బొంతలు, రగ్గులు ఎండకి వేసి మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు బిజీగా ఉన్నారుగా. మడత పెట్టి కింద పెట్టేస్తే తీరిక అయ్యాక తీసుకెళతారులే అని నేను చెల్లి అన్నీ మడత పెట్టేస్తున్నాము .(అప్పట్లో గుడ్ గాళ్ల్స్ అని పేరు తెచ్చుకోడానికి ఇలాంటివి చెయ్యక తప్పేవి కావు మరి!) ఇంతలో రెడ్డి గారు ఇంట్లోంచి పెద్దగా" అమ్మా బుడ్డోడున్నాడా ఆడ" అని అరిచారు. "లేడంకుల్ ఇక్కడ" అన్నాను నేను.
"ఏంటి అంకుల్ బుడ్డోడు ఇంటివైపు రాలేదసలు "అన్నాన్నేను. "నాన్న కూడా అడిగారు ఇవాళ రాలేదేంటని "అంది చెల్లి . "చాలా సేపటి నుంచీ కనిపించట్లేదమ్మా. అక్కా వాళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో కొంచెం చూస్తారా" అన్నారాయన. వడియాలూ , మడత పెట్టినంత వరకూ బట్టలూ తీసుకుని కిందకి పరిగెత్తాము. అందరం తలో వైపూ వెతుకుతున్నాము . చాలా సేపు కనిపించకపోతే మా ఇంట్లో ఉండి ఉంటాడులే అనుకున్నారుట. పెద్ద రెడ్డి గారు మాత్రం అరుస్తున్నారు. పిల్లోడు ఎక్కడున్నాడో చూసుకోవక్కరలేదా అని. నాన్న మాత్రం ఖంగారు పడకండి రెడ్డి గారూ ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు అన్నారు. ఇంటి వెనక చెరువు ఉంది. అటు కొందరు వెతికి వచ్చారు. కొత్తగా ఇళ్ళు కడుతూ ఉండడంతో చాలా వరకూ నీళ్ళ బావులు తవ్వుతూ వదిలేసి ఉన్నాయి.
చెరువు నీళ్ళు పారే చోట లోయలా ఏర్పడింది. అది కాక వెనక అంతా ఖాళీ ప్రదేశం. ఇవన్నీ కాక ఆ మధ్యే పిల్లలని ఎత్తుకుపోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. చిన్న రెడ్డి గారు మాత్రం బావుల దగ్గరికెళ్ళి పెద్దగా వాడిని పిలుస్తూ తొంగి చూస్తున్నారు. అందరం తలో వైపూ పరిగెత్తి మళ్ళీ ఇంటి దగ్గరికొస్తున్నాం ఏమైనా తెలిసిందేమోనని. చాలా మంది రెడ్డి గారి ఇంటి ముందు నిలబడ్డారు. పోలిస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చారు . ఎవరికీ వాళ్ళు ఫలం, పుష్పం,తోయం,ఉపవాసం, కొబ్బరికాయలు, ప్రదక్షిణలు, వడమాలలు మొక్కేసుకున్నారు వారి వారికి ఇష్టమైన దేవుళ్ళకి. చీకటి పడింది. ఇంకొక్కసారి మళ్ళీ వెతికిన చోటే వెతికి రమ్మని నాన్న అందరికీ చెప్పబోయారు. చిన్న రెడ్డి గారొచ్చి, " వద్దు నాయనా, ఇంకెందుకు అందరికీ కష్టం, వాడు ఇంక మనకి లేడు, పొద్దున్నే కిష్టయ్యని పిలిచి బావిలల్ల వెతికిద్దాం కనీసం చివరి చూపు చూసుకోవచ్చ"ని అన్నారు. ఈ మిలటరీ వాళ్ళు బంగారంగాను ఇంత మాటనేసినాడు! అక్కడున్న వాళ్ళన్దరూ బోరుమని ఏడ్చారు. బాగా చీకటయ్యక ఎవరింటికి వారు వెళ్ళారు కానీ ఎవరికీ తిండీ నిద్రా ధ్యాస లేదు. అలా కూర్చుని వాడి కబుర్లే చెప్పుకుంటున్నాము.
ఇంతలో వాన మొదలయ్యేట్టుంది , జల్లు లోపలికి రాకుండా తలుపు దగ్గరికి వేసాము. అసలే దుఃఖం పైగా ఆకాశం కూడా ఏడవడానికి సిధ్ధపడుతున్నట్టుంది . నాన్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వాళ్ళు తట్టుకునేట్టు చూడమని. ఈ లోపు బయట కలకలం వినిపించింది. పోలీసులొచ్చినట్టున్నారు. అందరం బయటికొచ్చాము. పోలీసులు ప్రశ్నలడుగుతున్నారు. బుడ్డోడి ఫొటో ఇమ్మన్నారు. ఇల్లు వెనకా ముందూ అంతా చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వర్షం మొదలయ్యింది. "మే బట్టలున్నయేమొ మిద్దె మీన " అంది వాళ్ళ చుట్టాలావిడ. "అన్నీ తెచ్చేసామాంటీ ఒక్క దుప్పటి మాత్రం మిగిలింది తెస్తా ఉండండి" అని చెల్లి పైకి పరిగెత్తింది. 2 నిమిషాల్లో చెల్లి పెద్దగా అరిచింది. రెడ్డి గారు పైకి పరిగెత్తారు. రెడ్డి గారు అందరినీ పిలుస్తున్నారు పిల్లోడు దొరికాడని . ఒక్క సారిగా అందరం ఆనందంతో అరిచాము. ఎక్కడ దొరికాడు అని ! "మీన దుప్పట్లు ఎండేసినారుగా ఆటి కింద నిదురబోయినా డేమో, చినుకు పడంగల్నె ఏడుపు ఎత్తుకున్నాడు " పెద్ద రెడ్డిగారు ఆనందం పట్టలేక పోతున్నారు. "అదేన్దబ్బా పిల్లోల్లు మీనకేంచి బొంతలు తెస్తిరిగా "అన్నది వాళ్ళ చుట్టాలావిడ. "అవునండీ కానీ ఒకటే దుప్పటి మిగిలి పోయింది. అదొక్కటీ తీసే లోపు పెద్దంకుల్ బుడ్డోడు కనిపించట్లేదని చెప్పారు. అయినా ఆ దుప్పటి కింద వాడు ఉన్నట్టు అసలు తెలీలేదు, కదా" అని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ చెల్లీ, నేను సంజాయిషీ ఇచ్చుకున్నాము. అసలింత గోల జరుగుతున్నా వాడికి మెళకువ రాకపోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది . "ఎండకు సొమ్మసిల్లి ఉంటాడు మే, సన్న పిల్లోడు గదా "అన్నది చుట్టాల్లో పెద్దావిడ." ముందర అన్నం పెట్టండమ్మా " అన్నారెవరో. "చిన్నమ్మా ఉండు వాడికి దిష్టి తీస్తా అందరి కళ్ళళ్ళొ పడ్డాడు చిన్ని తండ్రి" అంది అమ్మ. అందరం తెగ ఆనంద పడి ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకున్నాము. అంతే కాకుండా దుప్పట్లో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వెతికారట అనే సామేత మళ్ళీ ఋజువయ్యిందని మర్నాడు ఊర్లో అందరూ చెప్పుకుని నవ్వుకున్నారు.
మొన్న ఆదివారం ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తియ్యలేదు ఇంట్లో . కొంచెం భయపడి మళ్ళీ మళ్ళీ చేసా. మర్నాడు ఉదయం అక్క తీసింది ఫోను. "ఏంటీ ఫోన్ తియ్యరూ, నాన్న ఎలా ఉన్నారో అని ఎంత ఖంగారు వేసిందో ఎక్కడికి పోయారందరూ "అని విసుక్కున్నా. "అదేంటే, బుడ్డోడి పెళ్లి కదా అందరం వెళ్ళాము నీకు చెప్పమని మరీ మరీ చెప్పారు, అక్క చెప్పలేదా అంది". వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుని కొంచెం దూరం గా ఉన్న మూలాన ఈ 25 యేళ్ళుగా నేను వాడిని కలవలేదు. దేనికో మధ్యలో ఒకసారి వాళ్ళింటికి వెళ్ళా కానీ బుడ్డోడు లేడు ఇంట్లో. "అంత పెద్దాడయ్యేడావే " అన్నా ఆశ్చర్యంగా ."గుర్తుందా నీకు వాడి చిన్నప్పుడు "అని మొదలెట్టింది.
" అబ్బా!అది మర్చిపోయే విషయమా తల్లీ కళ్ళకు కట్టినట్టుంది" అన్నాన్నేను. "మరింకేం వ్రాసి పెట్టు వాడికి చూపిస్తా "అంది అక్క. అందుకని మొదలెట్టేసినానబ్బా. మీరూ మా బుడ్డోడిని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని దీవించెయ్యండి మరి !

16 వ్యాఖ్యలు:
Hhaa hhaa:-):-):-)very nice ennala gaatu:-):-):-):-):-)
:-)nachchindi
మీరుపెట్టిన బొమ్మలవీ చూసి ఏదయినా ప్రమాదం జరిగిందేమో అని భయపడ్డాను. భలేగా ఉంది బుడ్డోడి కథ.
ఎన్నాళ్ళకెఎన్నాళ్ళకు... చివరకు బుడ్డోడు వేలు పట్టుకుని ఇటు నడిపించాడన్నమాట. నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు బుడ్డోడా..
దుప్పట్లో బుడ్డోడు.... బాగుంది. పెళ్లి శుభాకాంక్షలు అందజేయ్యండి ఎన్నెల గారూ !
' దుప్పట్లో బుడ్డోడు '.... బాగుంది ఎన్నెల గారూ ! మా పెళ్లి శుభాకాంక్షలు కూడా అందజేయ్యండి.
బావుందండీ మీ బుడ్డోడి కథ. మధ్యలో కొంచెం టెన్షన్ పెట్టారు.
hahaha.... baagundandi buddodi katha
ఇవాళ మీ బుడ్డోడు పోస్ట్ చూసి మొత్తం మీ బ్లాగ్ చదివాను. నాకు చాలా నచ్చాయి మీ కబుర్లు. మీ కథ అయితే చాలా చాలా బావుంది. నాకు ఆ మాండలికం కొత్త అయినా కష్టం అనిపింఛలేదు. ఇన్నాళ్ళూ ఎలా మిస్ అయ్యానో మీ బ్లాగు. మీ పేరు కామెంట్లలో చూసిన గుర్తు. నా బ్లాగ్ naarathalu.blogspot.com. వీలున్నప్పుడు చూడండీ....
బావుంది
pinniii..soooper..chala chala rojula tarvatha :)
Happy Married life and Best wishes Buddoda.. :)
హమ్మో బుడ్డోడికి ఏమైందో అనుకున్నానండి .బాగుంది .నా తరపున పెద్దోడైన మీ బుడ్డోడికి శుభాకాంక్షలండి (రాధిక నాని)
ఎగిసే అలలు గారూ మీ చిరునవ్వులకి ధన్యవాదాలండీ
పద్మార్పిత గారు, మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు
దంతులూరి కిషోర్ వర్మ గారూ ప్రమాదం అని భయపడ్డాం కానీ చివరికి ప్రమోదమేనండీ, ధన్యవాదాలు.
జ్యోతిర్మయి అవునండీ..అలా ఎవరో ఒకరు సప్పోర్ట్ ఇస్తేనే కానీ ఇక్కడికి రావడం కష్టం గానే ఉంటోంది, ధన్యవాదాలు
నాసీ గారు ధన్యవాదాలండీ.
రావు గారు ధన్యవాదాలండీ.మీ శుభాకాంక్షలు తప్పకుండా తెలియచేస్తానండీ బుడ్డోడికి!
స్ఫురిత గారూ, ధన్యవాదాలండీ, మీ బ్లాగ్ నాకు బాగా పరిచయమేనండీ. కథ నచ్చినందుకు ధ్యనవాదాలు.
స్వాతీ, నీకు బుడ్డోడి కథ నచ్చినందుకు సంతోషం గా ఉంది. ధన్యవాదాలు
కష్టేఫలి గారు ధన్యవాదాలండీ.
కిరన్ థ్యాంకూలు.నీ విషెస్ బుడ్డోడికి అందచేస్తా!
రాధిక గారూ, ధన్యవాదాలండీ..అయ్యో ఖంగారు పడ్డారా??!!
oh wow, chaala baagundi, madhyalo adaragottesaaru, entha bhayamesindo!! happy married life to your buddodu!!
Post a Comment