ఎర్రటి ఎండ..చెమటలు కక్కుతూ నడుస్తున్నా..ఒక్కడైనా దొరక్కపోతాడా
అని ఆశ! సందు చివర చెట్టు కింద టెంట్ కింద చల్లటి నీడలో ఉన్నాడు వాడు.. అమ్మయ్య అనుకుని
దగ్గరగా వెళ్ళాను. అమ్మా పండ్లు ఎన్ని తూకమెయ్యాల అని అడిగాడు. పళ్ళ సంగతి తరవాత నీకు
పెళ్ళయ్యిందా అని అడిగా..
పెద్ద పెద్ద ఆఫీసర్లకే పిల్లలు దొరుకుతల్లేరు, నన్నెవరు చేసుకుంటరు
తల్లీ అన్నాడు. నీకెందుకు నేను చూపిస్తాగా అన్నా...పళ్ళు ఎన్ని కావాలీ
అన్నాడు. చెప్తారా బాబూ కానీ ఒక నిమిషం
నన్ను మాట్లాడనీయి. పెళ్ళంటూ చేస్తే నీ లాంటి వాడికే చెయ్యాలి నీకు ఎలాంటి పిల్ల కావాలి అని అడిగా. వెటకారం అనుకున్నాడేమో నువ్వు ఎవరిని చూపిచ్చినా సరే అన్నాడు. అబ్బా నువ్వెంత మంచోడివో, అందుకే నీతో
కానీ ఖర్చు కూడా పెట్టించను పెళ్లి ఖర్చు కూడా
నాదే. మీ అమ్మా నాన్నతో కూడా మాట్లాడతా .నిజం..నీ
పెళ్ళి చేసే పూచీ నాదీ అన్నా. చిన్నగా నవ్వాడు. ఖాళీగా ఉన్నాడు కాబట్టి వాడిని మాటల్లో
దింపి రోజుకి ఎంత సంపాదిస్తాడు , అమ్మా నాన్నా
ఎక్కడుంటారు , అన్నదమ్ములు ఎందరు అక్క చెల్లెళ్లు
ఎందరు ఇల్లెక్కడ అన్నీ కనుక్కున్నా. ఎవల కోసమమ్మా
, పిల్ల బాగుంటదా , పిల్లని ఎప్పుడు చూపిస్తవ్ అన్నాడు. .
ఇంకో బేరం రావడంతో సరే కానీ పళ్ళెన్ని కావాలమ్మా అని అడిగి కిలొ పళ్ళు తూకమేసి ఒక రూపాయి తక్కువే
ఇయ్యమ్మా..యీ దిన్నాల్ల అమ్మా అయ్యలకే పడతల్లేదు..నువ్వు పెండ్లి చేస్తా అంటున్నవు..నీ
కాల్మొక్కుత అన్నాడు..సర్లె నువ్వు డబ్బులు తగ్గించాలని కాదు..నీ పెళ్ళి చెయ్యడమే నాకు
ముఖ్యం అని పూర్తి డబ్బులు చేతిలో పెట్టి పళ్ళు తీసుకుని, "నేనొచ్చేలోగా దొరికారని
ఎవర్నో ఒకర్ని చేసుకోకురోయ్ మంచి పిల్లని తెస్తా" అన్నా... నవ్వుతూ తలూపాడు వచ్చిన
వాళ్ళకి ధర చెపుతూ. వీడు సరదాగా తీసుకుంటున్నాడు. నా సంగతి వీడికి తెలియదు. తలచుకుంటే
ఒక్క పెళ్ళేంటీ వంద చేస్తా
అమ్మయ్యా పిల్లాడు దొరికాడు, అమ్మో ఇప్పటికి ఎంత మందిని అడిగాను
పెళ్ళి చేస్తారా బాబూ అని...చివరికి ఒక్కడు ఒప్పుకున్నాడు . సగం పని అయినట్టే . ఇంక మగ పిల్లల కోసం వెతకక్కరలేదు. మొత్తం టయిమ్
అమ్మాయిని వెతకడానికే పెట్టచ్చు. చక్కని పిల్ల దొరికితే బాగుణ్ణు. పిల్ల దొరికి
యీ పెళ్ళి జరిగితే ఉండ్రాళ్ళు పోస్తానని వినాయకుడికి
మొక్కు కున్నా ..
ఇంక పిల్లని వెతకడమే పని. ఏ పిల్లని చూసినా మా వాడికి ఈడు జోడు
అనుకోవటం..ఆ పిల్ల తలితండ్రులని కలవటం.ఆ పిల్లాడు నాకేమవుతాడు, అసలు యీ పెళ్ళి చెయ్యడం
లో నాకెందుకు ఆసక్తి లాంటి దిక్కుమాలిన ప్రశ్నలన్నీ అడగడమే తప్ప..అయ్యో పని మానుకుని
ఒక పెళ్ళి చెయ్యాలనుకుంటోంది అని అనుకున్నవాడే దొరకట్లేదు .
బొల్లారం బజార్ లో నడుస్తూ
ఉండగా ఒక ముసలతను మావిడి పళ్ళ బండి పక్కన కనిపించాడు. ఆగుదామా వద్దా అనుకునేంతలో ఇరవయ్యేళ్ళ
పిల్ల బండి వెనక నించి బయటకొచ్చి" నాయిన నువ్వు బువ్వ దిను...బండి కాడ
నేనుంటా" అని అంటొంది..చూద్దును కదా పిల్ల అతిలోక సుందరి..మా జగదేక వీరుడికి చక్కని
జోడీ. కుదిరితే బాగుణ్ణు అనుకుంటూ ఎంతకిస్తావు అని మాట కలిపా...కిలొ అయితే
డెభ్భయమ్మా రెండు తీస్కుంటె అర్వైఐదు ..మూడయితే
అర్వై మూడు అంది..అబ్బో వ్యాపారం బానే
వచ్చు నీకు అన్నా. బోల్డు సంబర పడిపోయింది
.నీకు పెళ్ళయ్యిందా అని అడిగా ...లేదు సిగ్గు పడింది. అక్క చెల్లెళ్ళు
ఉన్నారా అన్నా. అక్కకు పెండ్లయ్యింది. ఒక తమ్ముడు అంది. సరే గానీ మా వాడొకడు ఎర్రగా
బుర్రగా బాగుంటాడు చేసుకుంటావా అని అడిగా..ఏం చేస్తడు అంది..మీ లాగే మావిడి పళ్ళ వ్యాపారం,
లాల్ బజార్ చౌరాస్తా లోనే. ఇద్దరిదీ అదే వ్యాపారం కాబట్టి భలే ఉంటుంది..నువ్వు చక్కగా అక్కడ బస్సెక్కి ఇక్కడ దిగచ్చు, ఇక్కడ బస్సెక్కి
అక్కడ దిగచ్చు. నాన్నకి కూడా దగ్గర. చిలకా గోరింకల్లా చక్కగా ఉండచ్చు అన్నా..నన్ను
ఎగా దిగా చూసి , అసొంటోల్లు మా కాడికి దునియ వచ్చి పోతరు.అసొంటోడు సాలంటె పదారేల్లకే
చేసుకోకపోదునా..మొన్ననే గవర్నమెంటు కొలువున్నోడు వొస్తెనే వొద్దన్న. యీ బండి బాబులకు
తక్కువయిందా అంది. అబ్బో పిల్ల తెగ మాటకారే అని అది కాదు తల్లీ మా పిల్లాడు రోజుకి
2000 పైన సంపాదిస్తాడు , పువ్వుల్లో పెట్టి
చూసుకుంటాడు అన్నా. .
అమ్మా పండ్లు కొంటవా కొనవా..నా టైము ఖరాబ్ చెయ్యకు అంది..నేను
ఖంగు తిని అహ అది కాదు పెళ్లి ఖర్చంతా నేనే పెడతా మీ నాన్నని పిలువు మాట్లాడతా అన్నా.
నాయనా యీమె చూడే . నాకు ఎవడో పిలగాడ్ని తెస్తదంట
అంది.. ఆ మాటలో ఆ పెద్దాయనకి ఏం అర్థం ధ్వనించిందో..ఎవరే అది అంటూ గబా గబా వచ్చి ఎందమ్మా ఏమ్మాట్లాడుతున్నవ్
అని మీదకొచ్చాడు..ఎందుకయ్యా బాబూ అలా మీదకొస్తున్నావు..నేనేమీ
కాని మాట అనలేదు..తెలిసున్న పిల్లాడొకడున్నాడు పెళ్ళికి ఒప్పిద్దామని మాట్లాడుతుంటేనూ
అన్నా. పిల్లతోని మాటలేన్ది పండ్లు కొనుక్కుంటే
కొనుక్కో లేకుంటే లేదు అన్నాడు. మంచి పిల్లాడయ్యా బాబూ నిదానంగా ఉండు వివరాలు చెప్తా అన్నా. వివరాలు
ఒద్దు ఏమొద్దు , పిల్లకు ఇప్పుడే పెండ్లి చెయ్య అన్నాడు. మంచి సంబంధమని చెప్తున్నాగా పైగా పెళ్లి
ఖర్చంతా నాదే అయినా పెళ్ళీడుకొచ్చిన పిల్లని
ఎన్నాళ్ళిలా నీ దగ్గరే పెట్టుకుంటావూ అన్నా..అతనికి పిచ్చి కోపమొచ్చినట్టుంది..నా పిల్లని
నా దగ్గరే పెట్టుకుంటానో, అమ్ముకుంటానో, చంపుకుంటానో
నీకెందు నా బిడ్డ నా ఇష్టం నువ్వెవరు చెప్పనీకి అని అరిచాడు..ఈ అరుపులకి చుట్టు పక్క
బళ్ళ వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టినంత పని చేసారు. ఈమెతోని మాటలేందన్న పోలీస్ టేషన్ల చెప్పుపో బుద్దొస్తది అని ఒక బండి తాలూకా మనిషి అరిచింది..బాబోయ్
ఇదెక్కడ న్యాయం..పిలిచి పిల్లనిస్తానంటే అలిగి చెట్టెక్కాడన్నట్టు...కానీ ఖర్చు లేకుండా
పెళ్ళి చేస్తానంటే ఇదెక్కడ గోల అయినా ప్రపంచం
లో ఈ పిల్ల ఒకతే ఉందా ,ఈ పిల్ల కాకపోతే ఇంకొకతి.. మీ బాబు లాంటి సమ్మంధం తేకపోతే చూడండి అని ఆయాస పడిపోయా..
ఈ లోపు ఎవరో పోలీస్
ని పిలుచుకొచ్చారు. ఆయన అక్కడున్న వాళ్ళని
ప్రశ్నలడుగుతున్నాడు. అదృష్టం బాగుండి మా లల్లీ అటువైపొచ్చింది. వాళ్ళ ఆయనకి
ఇక్కడ రాజకీయ పార్టీలో పలుకుబడి ఉంది లెండి..తనని చూడగానే పోలీసతను నమస్తే మేడమ్ అన్నాడు.
ఏంటండీ , ఏమయింది అంది. ఏమో అమ్మా, ఈమెవలో మా ఆడ పిల్లలకి పోరగాల్లని తెస్తా అని పరేషాన్
చేస్తుంది అని అన్నారెవరో . లల్లీ పోలీస్ వైపు తిరిగి అదేంటండీ ఈమెని గుర్తు పట్టలేదా మన భాస్కరన్న వాళ్ళ చెల్లి అంది . అయ్యో గుర్తుపట్టలేదు మేడమ్ , బాగా
చిన్నప్పుడు చూసా అమెరికా లోనా ఉంటున్నది అన్నాడు. కాదులెండి కెనడాలో , సరే మరి ఉంటాం అని చెప్పి చెయ్యి
పట్టుకుని లాక్కొచ్చింది నన్ను.
ఇక్కడేంచేస్తున్నావే అంది ఇంటి వైపు తీసికెళుతూ . నీకు తెలుసుగా
మావిడి పళ్ళ వాడి పెళ్ళీ అన్నా. నాకు పూర్తిగా తెలీదు కానీ అందరూ
చెప్పుకుంటున్నారు. యీ మధ్య మావిడి పళ్ళ బళ్ళ
చుట్టూ తిరుగుతూ అవసరం ఉన్నా లేకపోయినా మావిడి పళ్ళు కొంటున్నావట..ఏంటీ కథ అంది...నేనూ
మార్గరెట్ థాచర్ అంతదాన్ని అవాలని ..అంటూ గొణిగా.
ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలని సంఘము, సంస్కరణ అవీ ఇవీ అంటూ గుంపులతో
కలిసి తిరుగుతావన్నది పాత కథే కానీ మధ్యలో ఈ మార్గరెట్ ఎవరూ అంది లల్లీ..
అదేంటీ నీకు మార్గరెట్ థాచర్ తెలీదా ఆవిడ మాజీ బ్రిటిష్ ప్రధాన
మంత్రి పైగా ఉక్కు మహిళ బిరుదాంకితురాలు అని
చెప్పా.. అయితే! అంది...అయితే ఏంటి ,ఆవిడలా పేరు తెచ్చుకోవాలి నిశ్చయంగా అన్నా..అంత
గొప్ప వ్యక్తితో పోలికేంటే నీకు అంది..నాకు
ఇందాక అరి కాలి లో మొదలై పోలీసుని చూసి అక్కడక్కడే తిరుగుతున్న మంట గబుక్కున నెత్తికెక్కింది.
పెద్ద వాళ్ళయితే వాళ్ళలాగా మనమూ పేరు తెచ్చుకోకూడదని రూలు ఉందా అని ఆవేశ పడ్డా. సరే
తెచ్చుకోవచ్చనుకో, కానీ అలా పేరు తెచ్చుకోడానికీ, నువ్వు కెనడా నించి ఇంత దూరం రావడానికీ,
ఇలా ఎండా కొండా లేకుండా రోడ్డెంట తిరగడానికీ , ఈ
మావిడి పళ్ళకీ సంబంధమేంటీ అని నడుస్తున్నంత
సేపూ కొచ్చన్ల మీద కొచ్చన్లు అడిగి పారేసింది.
ఇంట్లోకెళ్ళగానే లల్లీ ఇచ్చిన మాజా
చల్లబరిచిందేమో చెప్పలేను గానీ, గొంతు
తగ్గించి సున్నితమైన స్వరంలోకి మారా.
ఇన్ని రోజులూ నేనూ నీలాగే ఆవిడ గురించి పెద్దగా పట్టించుకోలేదే
. అసలావిడ ఎవరో కూడా మొన్న మొన్నటి దాకా తెలీదు. ముందే తెలిసుంటే ఆ పని ఇక్కడున్నప్పుడే చేద్దును..అయినా ఇంత చిన్న
పనికే అంత పెద్ద పేరా అనుకున్నా గానీ, యీ పని చాలా కష్టమేనే అన్నా ..నువ్వు కొంచెం
తెలుగులో మాట్లాడతావా అంది లల్లీ. ఏం నేను మాట్లాడేది ఆంగ్లమా వెటకారంగా అన్నాను. మరి!
చెప్పేదేదో సరిగ్గా చెప్పి ఏడువు. వచ్చి రెండు వారాలయిందిట , నేనే రెండు సార్లు ఇంటికొచ్చా.
తమరు లేరు . అయ్యో ఒక సారి చూసి పోదామనైనా అనుకున్నావా. అదృష్టం కొద్దీ పనుండి ఈ వైపొచ్చాను.
లేకపోతే ఈ పాటికి దేవకీ దేవి ఒడిలో పడుకుని ఉందువు అంది..ఆ మరే,ఆ లెక్కనన్నా చిన్ని
కృష్ణుడి ట్విన్ సోదరినయ్యి పెద్ద పేరు తెచ్చుకొందును అన్నా..యీ పేరు తెచ్చుకునే గోల
నేను భరించలేను గాని తల్లోయ్, నన్నొదిలెయ్ అంది లల్లీ..అదేంటే, నీకు కాస్త పలుకుబడి
ఉందిగా..ఒక్క మావిడి పళ్ళ పిల్లని కుదర్చవే నీ ఋణం యీ జన్మలో తీర్చుకోలేను అన్నా..
ముందు నువ్వు నాకు అర్థమయ్యేట్టు తెలుగులో చెప్పు ఆ తర్వాత చూద్దాం అంది.
సరే పెద్దగా చెప్పటానికేమీ లేదు.. మార్గరెట్ థాచర్ పేరు వినడమే
గానీ అంత గొప్ప ఆవిడ ఎలా అయిందో నాకు తెలీదు.
మొన్న ఏప్రిల్ 8వ తేదీన ఆవిడ చనిపోయారు. ఆ రోజు ఉందయం ఆఫీసుకి వెళుతూ కార్ లో
1650 ఎ ఎం రేడియో ఆన్ చేసా..సీనా రేడియో న్యూస్ రీడరు ఖుర్షీద్ అక్రం గారు హిందీలో వార్తలు చదువుతున్నారు.
వార్తలు విన్నాక నాకు మతిపోయింది . ఆయన చెప్పడం ఏంటంటే ఈవిడ గారు మావిడి పళ్ళ వాళ్ళకి పెళ్ళి చెయ్యడానికే జీవితమంతా ధారపోసిందిట. దాని వల్లే ఆవిడకి అంత గొప్ప పేరు వచ్చిందిట . అది విన్నప్పటి నుంచీ నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు..ఆఫీసుకి
వెళుతూనే నెల రోజుల వెకేషన్ పడేసి ఇటొచ్చేసా..సెలవలయ్యే లోపు కనీసం
ఒక్కడికైనా చెయ్యాలి పెళ్ళి. అది గనక సక్సెస్ అయ్యి మంచి పేరొచ్చిందంటే, జాబ్ వదిలి
ఇక్కడకొచ్చేస్తా..ఇంక జీవితమంతా మార్గరెట్ లాగే మావిడి పళ్ళ వాళ్ళ పెళ్ళీకే ధారపోస్తా..నేను
తన్మయంగా చెప్తోంటే మా లల్లీ నమ్మనట్టుగా చూసింది. సరే గానీ గుర్తుంటే ఒక సారి ఆ వార్తని
కుర్షీద్ అక్రం గారి మాటల్లో చెప్పు అంది.
ब्रिटन के आइरन लेडी मार्गरेट थाचर की कल लन्डन में निधन हुई l प्रेसिडेंट हार्पर ने कहा कि दुनियां एक अच्छी लीडर को खो गयी l मर्गरेट इतनी मशूर बनने का कारण यही है कि जीवन भर उन्हों ने आम आदमी के कल्या्ण के लिए मेहनत करती रहीं l
(బ్రిటన్ కే అయిరన్ లేడీ మార్గరెట్ థాచర్ కీ కల్ లండన్ మే నిధన్
హుయీ. ప్రెసిడెంట్ హార్పర్ నే కహా కె దునియా ఏక్ అచ్చీ లీడర్ కో ఖో గయీ. మార్గరెట్
ఇత్నీ మశూర్ బన్ నే కా కారణ్ యెహ్ హై కీ జీవన్ భర్ ఉన్ హో నే ఆం ఆద్మీ కే కల్యాణ్ కే
లియే మెహనత్ కర్తీ రహీ.)
లల్లీకి ఎండలోంచి వచ్చిన మూలాన కళ్ళు తిరిగాయో, తలనెప్పి వచ్చిందో
కానీ చేతులు నుదుటి మీద రుద్దుకుంటూ కూచుండి
పోయింది . ఏమయిందే అని అడుగుదామనుకున్నా ...యీ లోపు మామిడి పండ్లమ్మా మామిడి పండ్లూ
అంటూ ఒక కుర్రదాని కేక వినిపించింది . ఇంక నేను ఏమీ ఆలోచించకుండా ఇంట్లోంచి బయటికి
పరిగెత్తా, ఈ పిల్లనైనా ఒప్పిద్దామని. అబ్బా
మావిడి పళ్ళ గంప తెగ బరువుగా ఉంది . దింపడానికి మీరూ ఒక చెయ్యేద్దురూ!
45 వ్యాఖ్యలు:
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఎన్నెల తిరిగొచ్చె బ్లాగిళ్ళకు. చివరదాకా నాకూ లైట్ వెలగలేదు.:)). కొంపతీసి మీరు ఆ పని మీద ఇండియా రాలేదు కదా!
ఆహా.. ఇన్నాళ్ళకి మీకు బ్లాగుందని గుర్తొచ్చిందండీ ఎన్నెలమ్మ గారూ..
మావిడిపళ్ళ అమ్మాయిని వెతికే పనిలో మీరుండండి.. చాన్నాళ్ళ తర్వాత మీ కీబోర్డ్ కదిలించిన పుణ్యానికి మార్గరెట్ థాచర్ కి మేం థాంక్స్ చెప్పుకుంటాం.. :)
ఏంటీ.. మీరు చేయబోయే మావిడిపళ్ళ అబ్బాయి పెళ్ళికి రావాలంటారా? అలాగలాగే లెండి.. ముహూర్తాలు పెట్టుకున్నాక చెప్పండి.. వెంటనే వాలిపోతాం.. :)))))
Interesting
మామిడి పళ్ళ బుట్ట దూదిపింజ౦త తేలిగ్గా ఉందేమిటి? ఎన్నెల మహత్యం కాబోలు.
చాలా బాగుంది. ముగింపు చదివాక నవ్వు ఆపుకోలేకపోయానండి.
భలే రాసారు!! ఇంకా ఇలాంటివి బోలెడు రాయండి.
చాలా బాగుంది. ముగింపు చదివాక నవ్వు ఆపుకోలేకపోయానండి.
భలే రాసారు!! ఇంకా ఇలాంటివి బోలెడు రాయండి.
తప్పకుండా మామిడి పళ్ళవాడి పెళ్ళి చేసి ఘనకీర్తి సంపాదించుకుంటారులెండి. ఇప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు చేసారు:) ఈ పళ్ళవాడి మూలంగా మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాం.
ముందుగా మీ లల్లీగారికి థాంక్సండీ అక్రంగారి మాటల్లో చెప్పమన్నందుకు లేకుంటే మాటర్ అర్ధంకాక బుర్ర చీకేసిన మావిడిటెంక అయ్యేలా జుట్టు పీక్కుని ఉందును :)
చాన్నాళ్ళకి వచ్చినా మంచి టపాతో వచ్చారు వెల్కంబాక్ :)
సందుచివర చెట్టుకింద టెంట్లో కూర్చునిఉన్న అబ్బాయికీ, బిజీరోడ్డులో బండిలాగించే అమ్మాయికీ ఎలా కుదురుతుందీ?? రివర్సు లో ప్రయత్నించాల :)
:)
:) :)
:-) nice to see you..keep blogging.
ఎన్నెలమ్మా ఎన్నాళ్ళకెన్నాళ్ళకొచ్చారు . తొందరగా పెళ్ళి కుదిరించండి వచ్చేస్తాము .
సిరిసిరి మువ్వ గారూ ఆ పని మీదే వచ్చానండీ, కానీ మా లల్లీ నెత్తి మీద ఒకటిచ్చి వెనక్కి పంపేసింది..మీ వెల్కం సాంగ్ మాత్రం అద్దిరింది..రొజంతా అదే పాట పాడుకున్నా భలేగా
మధురా, నేను కూడా మార్గరెట్ కి బోల్డు సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా, ఖుర్షీద్ అక్రం గారికి కూడా..మన వాళ్ళ పెళ్ళికి రాకపోవటమేంటమ్మాయ్! ఇంటబ్బాయి తో కలిసి బంధుమిత్రులందరినీ తీసుకుని మరీ రావాలి. డేట్స్ చెబుతాగా!
కష్టేఫలే గారూ ధన్యవాదాలండీ
జ్యోతీ నాతో పాటు అప్పుడే పదముగ్గురు చేతులేసారు గంప దింపడానికి...అందుకే తేలిగ్గా ఉంది..అయినా తప్పదమ్మా..ఇంకొంచెం బరువు మీరు తీసుకోవాల్సిందే..పక్కపక్కనున్నందుకు ఆ మాత్రం సహాయం చెయ్యాలి కదా ..అసలే మన వాళ్ళ పెళ్ళి!
జలతారు వెన్నెల గారూ ధన్యవాదాలండీ...మీ పేరు చూడగానే ద హా
జయగారూ, ఈ పెళ్ళి పుణ్యమాని మళ్ళీ మనవాళ్ళందరినీ కలవచ్చని మాస్టర్ ప్లాన్ చేసానండీ..మొదటి అడుగే కదలట్లే..అక్కడున్నారు కాబట్టి..బెత్తం పట్టుకుని మా లల్లీ ని ఒక సారి అదిలించండి మేడం...మరీ అడుగు పడనియ్యట్లేదసలు!
మిమ్మల్ని ఇంత తొందరగా చూస్తాననుకోలేదు.కష్టపడితే గానీ మీ తలుపు తెరుచుకోదుగా..మీ దీవెనకి బోల్డు ధన్యవాదాలు
వెణూ గారో, మీ కామెంట్ మన వాడి పెళ్ళి కథకి తెగ సింక్రనయిజ్ అయిపోయిందంటే నమ్మండి! మీ బుర్ర కి అంత ప్రమాదం రానిస్తారా ఎవరైనా! మీకు లల్లీ లాంటి అభిమానులు కోకొల్లలు.ఎవరో ఒకరు కేర్ తీసుకుంటారని నా ధీమా...ధన్యవాదాలండీ..
మౌళి గారూ, నేను నడుస్తున్న వైపు నుండి సందు కనిపిస్తుంది కానీ, అచ్చంగా చౌరాస్తా బస్ స్టాప్ లోనేనండీ వాడి బండి..పైగా పిల్లదానిది చెట్టుకింద బండి అయితే, మనోడిది టెంట్ తో పాష్ గా ఉంటుంది మరి! ఆ పిల్లకి అదృష్టం లేదు లెండి..మీ ఇలాకాలో ఎవరన్నా ఉంటే మాత్రం చెప్పడం మర్చిపోకండే!..రివర్సులో అయినా నేనేమీ అనుకోను..!
కామెంటినందుకు బోల్డు ధన్యవాదాలండీ.
శిశిర దరహాసానికి, వనజా వనమాలి గారి పెనుహాసానికీ ఎన్నెల చిరుహాస మాలికలు..
తృష్ణా, హిందీ టయిపో లు సరి చేసినందుకు ఎన్ని మావిడి పళ్ళిచ్చినా ఋణం తీరదు..!పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలి ఓకే!
మాలా గారూ మళ్ళీ వ్రాయమని చెప్పి ప్రొత్సహించే మీ లాంటి స్నేహితులుండడం నిజంగా అదృష్టమండీ. అసలు మీరు రాకుండా పెళ్ళేంటీ. దగ్గరుండి అన్నీ చూడాల్సింది మీరేగా..Thanks for everything Mala garu
जीवन भर उन्हों ने आम आदमी के कल्या्ण के लिए मेहनत करती रहीं
ఎంత బాగా అర్ధం చేసుకున్నారు
మీరు గొప్పవారు ఎన్నెల గారు గొప్పవారు
కళ్ళు తుడుచుకుంటూ శైలు ...
అవునవును. మావిడిపళ్ళవాడికి పెళ్ళయితేనే లోకకళ్యాణం! :) బైదవే, బ్రేంప్టన్ వచ్చినప్పుడల్లా నేను కూడా 100.3 FM వింటూ ఉంటా. భలే సరదాగా ఉంటుంది.
ఆమ్ ఔరత్ కో ఆమ్ ఆద్మీ నచ్చటం లే! ఏం చేద్దాం !
జిలేబి
ఆహా... ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ఎన్నెలమ్మా బ్లాగువైపు చూసింది, అదీ ఓ శుభకార్యం కోసం. చాలా బాగుంది :)
అయినా ఇక్కడికి రావడం జరిగాక మీకు తెలిసిన నాలాంటి బోలెడుమంది బ్లాగు आम् आदमी, आम् प्रेमी లము ఇంత మంది ఉన్నామే, ఫొటోలకు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నామే... మా కోసం ఒక్క సమ్మందమైనా చుడలేదా :(
టపా మత్రాం సూపర్ :)
:)
అబ్బా... ఇన్నాళ్ళూ ఎలా మిస్సయ్యానండీ?
మీరు ఇలా పెళ్ళిళ్ళు చేయించడానికి ఇనప కంకణం కట్టుకున్నారని తెలీక మిమ్మల్ని తప్ప అందర్నీ అడుగుతున్నా కదా..!!
నా రిక్వయిర్మెంట్ పెళ్ళి..
మీ రిక్వయిర్మెంట్ మామిడి పళ్ళోడి పెళ్ళీ.
రేపట్నించి నేను శనాదివారాలు మామిడిపళ్ళమ్ముకుంటా.. మీకోసం ఎదురు చూస్తా...
మీకు బంపరాఫర్లు...
పెళ్ళి ఖర్చు మీది కాదు నాది.
కట్నం నాది కాదు మీది.
పిల్ల పండులా ఉండక్కర్లేదు.. కాయలా ఉన్నా పర్లేదు కోవ పెట్టి పండించుకుంటా...
ఇక మీదే ఆలస్యం...
ముందస్తుగా ధన్యవాదములు.
శైలూ, కళ్ళు తుడుచుకోమ్మా, కొన్ని సార్లంతే భాషా మనల్ని అర్థం చేసుకోడు..అయ్యొ మళ్ళీ తప్పు కొట్టా, భాష మనల్ని అర్థం చేసుకోదు..!!
నాసీ గారూ కృతజ్ఞతలండీ అర్థం చేసుకున్నందుకు,అందుకేగా కష్టానికోర్చి అక్కడికెళ్ళిందీ..
మీరు యీ సారి 1650 ఏ ఎం వినండి..చక్కగా కుర్షీద్ అక్రం గారిని వినొచ్చు. చిన్నప్పుడు కందుకూరి సూర్యనారాయణ గారి వార్తలు విన్నాక ఇప్పటి వరకూ ఎవ్వరు చదివినా పెద్దగా నచ్చలే, కానీ ఇప్పుడు నేను అక్రం గారి వీరాభిమానిని, మీకూ నచ్చుతుంది సీనా రేడియో.
జిలేబీ గారూ అవునండీ గవర్నమెంటు కొలువోళ్ళు కూదా వద్దంట, నిజం చెప్పాలంటే, ఆ పిల్ల అతిలోక సుందరి, జగదేక వీరుడు ఎక్కడున్నాడొ! కామెంటుకి ధన్యవాదాలండీ.
నాగ్ బాబూ, నువ్వు మావిడి పళ్ళ అబ్బాయివని ఎప్పుడైనా చెప్పావా? దేనికైనా క్లారిటీ ఉండాలా వద్దా.రాజ్ చూడు ఎంత క్లియర్ గా చెప్పాడో. శని వారాలు ఆదివారాలు అమ్ముతానని!.ఇప్పుడికైనా చెప్పావు గాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు గుర్తు కూడా వచ్చేది కాదు...పనిలో పని నా పర్సనల్ మెయిల్ అయిడీ కి కూడా ఒక ఫొటొ అప్లోడ్ చెయ్.అన్నట్టు మావిడి పళ్ళ మీద రోజుకి ఎంత సంపాదిస్తావో కూడా చెప్పాలబ్బయా, ప్రోఫయిలు మొత్తం పెట్టు.రేపు పొద్దున్న లేవగానే మొట్ట మొదట దొరికిన మావిడి పళ్ళ పిల్ల నీకే!
రహ్మానుద్దీన్ గారూ ..ఏంటో మీరేమీ మాట్లాడకుండా దరహాసాలు చిందిస్తున్నారు. రాజ్ కీ నాగ్ కీ పోటీగా మావిడి పళ్ళు అమ్మక్కరలేదనా!!
అక్కడ ప్రిన్స్ బాబూ, నాగ్ బాబూ నా కోసం ఇంతలా ఎదురు చూస్తూ ఉన్నారని అస్సలు తట్టలేదు సుమీ!
అయినా ప్రిన్స్ అయ్యుండీ మావిడి పళ్ళు అమ్ముకోడానికి సిధ్ధమవుతున్న నీ త్యాగం ఎవరు గుర్తిస్తారు నాయనా! ఎవరు గుర్తిస్తారు!(ముక్కు చీదుతూ మరీ కళ్ళు తుడుచుకుంటున్నా)
బాధగా ఉన్నా ,నీ క్లారిటీ నాకు నచ్చిందయా.
నీ బిజినెస్సు సెన్సు కూడా నచ్చింది..ఏంటీ ఖర్చు నీది, కట్నం నాది అంటావా! ధర్మ పెబువులు, మీకు సాటి ఎవరొస్తారు చెప్పండి!?
ఐనా ఆ పిల్ల ఎదురు చూస్తున్న రాజకుమారుడివి నువ్వేనేమో అని అనుమానంగా ఉంది...ఉండు అడిగొస్తా..నేనొచ్చేదాకా ఇక్కడే ఉండే..అబ్బే మనలో మనకి ధన్యవాదాలెందుకయా బాబూ, రేపు నేనూ పక్కనే బండి పట్టుకోనూ,...మనం మనం కావల్సిన వాళ్ళం.అవన్నీ పట్టించుకోమాక!
నీకిక్కడ జవాబు పెడుతుంటే ఏంటో కిచ్చ కిచా మని చప్పుడు అయ్యింది. ఏంటా అని చూస్తే ""పిల్ల పండులా ఉండక్కర్లేదు.. కాయలా ఉన్నా పర్లేదు కోవ పెట్టి పండించుకుంటా"..నీ కామెంటులో యీ ముక్క చదివి సీతయ్య భరించలేక చేస్తున్న చప్పుళ్ళవి! తప్పేట్లు లేదు, నీ పక్కన ఈనతో ఒక బండి పెట్టించాలిసిందే!
వామ్మో ఎన్నెల గారు ఎన్నాళ్ళకి ? వచ్చారు పో ఈ మామిడి పండ్ల హంగామా ఏంటి ? హ హ భలే రాసారు ఐరన్ లేడి , మంగో గర్ల్ వరకు మీకు తిరుగులేదు :-))))))
చాలా సంతోషం గా ఉంది మిమ్మల్ని చూడడం తరుచూ రాయాలని కోరుకుంటూ
శ్రావ్యా, ఆ ఐరన్ లేడీ పుణ్యమాని ఈ మాంగో గర్ల్ తగిలింది. మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు. ఇక్కడ మిమ్మల్ని కలవటం మరింత ఆనందంగా ఉంది..
chaala rojulaki raasaru meeru kooda..hmmm maamidi pandlu bale bagunaai:...naaku kooda chala santhoshangaa undi meeru malle raavatam elage raastu undandi
:))))
హిలేరియస్, ఎన్నెలమ్మా......
నేనూ మిగతావాళ్ళలానే.. చదువుతున్నంతసేపూ మామిడిపళ్ళవాడి పెళ్ళికీ, మార్గరేట్ థాచర్కీ సంబంధం ఏవిటా అని ఆలోచించుతూనే ఉన్నా!
అశోక్ ధన్యవాదాలు..నువ్వు కూడా కనిపించట్లేదుగా ఈ మధ్య! కవితలు రాలట్లేదు నీ కలం నుంచి!నీ కామెంట్ చూసి మస్త్ ఖుష్ అయిన!
నిషీ..హహహహ..నచ్చినందుకు ధన్యవాదాలు.
katha chaala bagundi....suspense, sarcasism, sandesaathamkamga
kooda undi
nedunuri ananth rao
hha..hha..superb superb:-):-):-):-)
నేదునూరి వారికి ధన్యవాదాలు
ఎగిసే అలలకి ఎన్నెల ధన్యవాదాలు
Post a Comment