బ్లాగ్ ప్రవేశ మహోత్సవము -కథా ప్రారంభము

Monday, December 6, 2010

వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

పూర్వము టొరంటొ యను నొక పట్టణము ఉండెను
ఆ పట్టణము మిక్కిలి పెద్దవగు భవనముల తోడను, ఆపిల్, పియర్ ,లిచి మొదలగు ఫల భరితములైన వ్రుక్షముల తొడను, మేపుల్ సిరప్ వంటి అమ్రుత తుల్యమైన ద్రావకముల తోడనూ అలరారుచుండె.
ఆ పట్టణమున పున్నమి అను వెలది ఉండెను. ఆమె తెలుపు నలుపు గోధుమ అను బేధము లేక అందరితొ కలసిమెలసి ఉండెడిది. ఆమెకు ఒక రాత్రి సరస్వతీ  దేవి ప్రత్యక్షమై "భక్తురాలా నువ్వు 5 సంవస్తరములు నన్ను భక్తిగా కొలచినట్లైన ధనము సౌఖ్యము ప్రసాదించెదనని" పలికినది.
అంత నా పడతి నిదుర యందె 'తల్లీ నిన్ను తలంచి పుస్తకము చేతన్ బూనితిన్" అని ప్రార్దించి వెంటనే మేల్కాంచి తన స్వప్న వ్రిత్తాంతమును పతి దేవునికినీ పిల్లలకును వివరించె. ఒకానొక శుభ దినంబున మొదలు పెట్టిన వ్రతము నిర్విఘ్నముగ కొనసాగుటకై స్నేహితులును బంధువులును కంకణము కట్టుకొనిరి. అంత నా వ్రతము ప్రారంభమయ్యే.
 ఆ నాతి పార్టీలు పబ్బములనక ,ఇండియా యనక ఆంధ్రా యనక అతి భక్తిగా దేవిని ఆరాధించుచుండ
కొంత కాలము గడచినది.
ఒక శుభ దినమున వ్రతము సంపూర్ణమయ్యెను. ఆహా దేవత చెప్పిన దినమిదే కదా యని అందరును మిక్కుల ముదమునందిరి. ఆ దేవి అనుగ్రహము వలన పున్నమికి ఒక ఇంటర్వ్యూ వచ్చెను.  బాసు పున్నమి యందు గల సరస్వతీ కటాక్షమునకు మిక్కిలి సంత్రుప్తి చెంది 'ఉద్యోగ ప్రాప్తి రస్తు ' అని దీవించినది. ఇది చూసి దేవి యొక్క అత్తగారైన లక్ష్మీ మాతకు ఆగ్రహము కలిగెను. హమ్మా, నన్ను పూజించకుండ నా కోడల్ని పూజించేస్తే
నేనొప్పుకోనంతే యని బాసు గారి యందు ప్రవేశించెను. 
సరస్వతి పున్నమియందు ప్రవేశించి, చక చక పనులు చెయ్యసాగె. బాసు గారియందున్న లక్ష్మీ దేవి మిగుల సంతసించి యెమి కావలెనొ కోరుకొమ్మనె. పున్నమి మిక్కిలి అణుకువగా ఒక 100కె చాలునని తెలిపె. లక్ష్మీ దేవి ఒప్పుకొనినందున పున్నమి మిగుల సంతసించి విషయమును బంధువులకు మిత్రులకు తెలియజెప్పె. కథ సుఖాంతమయ్యెనను సమయమున బాసుగారినందున్న అత్తకు హటాత్తుగా మెలకువ వచ్చి "నేనెమిచేయుచుంటిని, నేనేమి కోడలికి వత్తాసు పలుకుట యెమి, ఇప్పుడేమి దారియని" ఆలోచించ సాగె.
ఆమెకు వచ్చిన విద్యలు సునాయాసముగను, రాని విద్యలు 'కలిసుందాం రా' 'క్యూంకి సాస్ భి బహూ థీ' లోని అత్తగార్ల వద్ద కొంత ఆయాసపడి నేర్చుకొనియును పున్నమి పయి ప్రయొగించి ఆమెను అస్ట కస్టముల పాలు జేసెను. రాయ బోగ పెన్ను లొ ఇంకు అయిపోవును, పెన్సిలు ముక్కు చెక్కుకు పొవును. షాప్మరలు కానరావు. టైపు చేయుదమన్న కీ బొర్డు పనిచెయ్యదు. కంప్యూటరు నందు వైరస్ అయి అడ్డుపదును. సభలయందు మాటాడు సమయమున మైకు పనిచెయ్యకుండునట్లును ఒక వేళ అది బాగున్ననూ అన్నీ మరచి మరచిపోవునట్లును చేసి, య తల్లి ఆడుకొన  సాగినది.
సరస్వతియునూ పెన్నులో సిరాయై , పెన్సిలుకు షాప్మరయై, వైరస్ కు ఫైర్వాలయి , మైకుకు సౌండయి ,మెదడులో జ్ఞనాగ్నియై పున్నమిని కాపాడసాగె. ఇక లక్ష్మి తన నిజ స్వరూపమును వీడి "సూర్యకాంతము" రూపము ధరించె. సరస్వతియును దిక్కు కానక 'చాయా దేవీ' రూపమును ధరించి అనుక్షణమును పున్నమిని వెన్నంటి నిలచె. ఒక నాడు లక్ష్మి పున్నమిని గాంచి మిక్కిలి ఆగ్రహము చెంది 'నీవు నీ పని వారిని చెప్పుచేతలలో ఉంచుకొనుట లేదనియు, వారి చెప్పులు నువ్వు మోయుచుంటివనియు అపవాదు జేసెను. అంత పున్నమి విసిగి...తన యందు గల సరస్వతిని నిందించి తనను విడిచి వెళ్ళమని కోరెను. సరస్వతి 'బిడ్డా నీకు మేలుచేయ ప్రయత్నించుచుంటిననీ పలికెను.
నీవు చేసిన ఉపకారము చాలును ఇంక నాలొ నువ్వున్నచో నా బిడ్డల మీద ప్రమాణమని పున్నమి కన్నీటితొ పలుక, సరస్వతి యేమియును చేయజాలక ఆమెను విడిచి  వెళ్ళెను. లక్ష్మియును బాసును విడిచి సరస్వతి యున్న నెలవులను వెతుకుచు వెళ్ళెను. అంత పున్నమి ధైర్యము వీడక ఫాక్టరీలకు,మెక్దొనాల్ద్నకు పోయి ఉద్యోగమును చేయుచూ, మేడలును, కారును, బంగారమును భూములును కొని  సుఖముగానుండి అంత్యమున లక్ష్మివాసమునకరిగినది.
సరస్వతి  ఫలము చెడ్డా వ్రతము దక్కిందన్న సంత్రుప్తి చెంది తన దీవెన యేదో విధముగా నజమయ్యెనని సంతొషించె. ఇవ్విధముగా దేవి తానోడి పున్నమిని గెలిపించినది.
ఇతి బ్లాగ్పురాణే రేవా ఖండే లక్ష్మీ  సరస్వతీ సంవాదే  ప్రథమొధ్యాయహ సమాప్తహ.
యీ కథను రాసిన వారికిని చదివిన వారికినీ లక్ష్మీ సరస్వతీ కటాక్షము ఒక్కసారిగా కలుగునని పరమేశ్వరుడు
పార్వతీ దేవికి వివరించెను.
ఓం శాంతి శాంతి శాంతిః

19 వ్యాఖ్యలు:

ఇందు said...

అద్భుతమైన బ్లాగ్ ప్రవేశము.ముందు కొంచెము హాస్యభరితముగాయున్నదని అనుకొంటిని.కానీ రెండు పంక్తుల పఠనము గావించిన యెడల మీ తెలివితేటలకి అచ్చెరువొంది...మిక్కిలి ఆసక్తితో మీ వ్రతకధా పఠనము కొనసాగించితిని.ఇంతకీ ఈ వ్రతమును మీ ద్వారా పఠనం గావించితిని గనుక నా కోరికలన్ని మీ కథలోయున్న లక్ష్మీసరస్వతులు నెరవేర్చెదరని ఆశించుచుంటిని.మా మిత్రులందరికీ కూడా మీయొక్క ఈ బ్లాగ్ ప్రవేశ మహొత్సవానికి రమ్మన్ని జెప్పితిని.కానీ...వ్రతము చేసినా మాకు ప్రసాదం ఏల ప్రాప్తించలేదు? తీర్ధప్రసాదం స్వీకరిచిన కదా వ్రతఫలితం దక్కెడిది? కావున మా అందరికీ తీర్ధప్రసాదములు ప్రసాదించవలెనని మనవి :))

ఇందు said...

అలాగే...కామెంట్ సెషన్లో...'వర్డ్ వెరిఫికేషన్ ' తీసివేయమని మనవి.ఇంకనూ....మీరు 'కామెంట్ మోడరేషన్' పెట్టుకొనుట చాలా ఉత్తమము.లేనియెడల...ఎవరెవరో..మీ బ్లాగులో పిచ్చి కామెంట్లు పెట్టెదరు.అది చూచి మనసును నొప్పించుటకంటే... 'కామెంట్ మోడరేషన్' పెట్టుకొనుట ఉత్తమము :) ఇక తదుపరి మీ ఇష్టము :)

ఇందు said...

అలాగే...మీ బ్లాగును నలుగురూ చదవవలెనన్న...కొన్ని సంకలినిలు ఉన్నవి.వాటిలో మీ బ్లాగుని జతచేయుటవలన చాలా మంది మీ బ్లాగును చదివే వీలు ఉండును. ఆ సంకలినులు....

1.హారం
2.మాలిక
3.కూడలి
4.జల్లెడ.
5.సమూహము.

వీటిలో మీ బ్లాగును జత చేయండి..బ్లాగ్లోకంలో మీ బ్లాగు అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను :)

Shaila said...

Hi Lakshmi,

Great Start! Keep up the good work. We enjoy reading your stories.

Love,
Shaila

Lakshmi D said...

Oh Lakshmi garu!

that story was awesome! soooo cute! Mee latent talent bayataki vasthondi.

I will be watching for more interesting stuff from you. You have set the bar really high for yourself!

I can read telugu but very slowly - so took me a while to read it but thoroughly enjoyed it.

Thanks so much for sharing!!
Cheers
Lakshmi Dasika

Ennela said...

ఇందు గారు, మీరు నా మొదటి బ్లాగ్గురువు. గురుభ్యోనమహ.
ప్రసాదం తీర్థం సంగతి అస్సలు గుర్తు రాలేదండీ, ఇంటికొస్తే చేసి పెడతాను.
అన్ని మంచి సలహాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు

శైలా, చదివిన వెంటనే ఫోను చేసి శుభాకాంక్షలు చెప్పినందుకు చాల కృతజ్ఞతలు. మీరు ఫొనులొ మాట్లాడినప్పుడు నేను కాసేపు ఆకాశంలో విహరించి కిందకొచ్చాను. ప్రకాష్ గారికి కృతజ్ఞతలు.
లక్ష్మి గారూ, మీ కామెంట్స్ చూస్తే బోల్డు రాసెయ్యాలనిపిస్తొంది .కృతజ్ఞతలు.

శివరంజని said...

ఎన్నెల గారు.. మీరు పంపిన invitation చూడగానే ముందుగా బ్లాగ్ లోకానికి మిమ్మల్ని మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుదామనుకున్నాను..... కాని కొంచెం బిజీ ... sorry

ఇకపోతే మీ రైటింగ్ స్తైల్ చాలా బాగుంది ...

నన్ను ఈ బ్లాగ్ లోకం లో సారీ లు అడుగుతున్నారు తప్ప సలహాలు ఎవ్వరు అడగడం లేదు ..మీకన్న కొన్ని సలహాలు చెబుదామంటే ఆ చాన్స్ ఇందు గారు కొట్టేసారు ..

రోజు మీ పోస్ట్ ల తో మమ్మల్ని ఎన్నెల లోకంలో తిప్పి తీసుకురావాలి ..ఏమంటారు

జ్యోతి said...

బ్లాగ్లోకానికి సుస్వాగతం.. చిన్న సలహా. నలుపు మీద తెలుపు అక్షరాలు చదవడం కష్టంగా ఉంది. టెంప్లేట్ మార్చి చూడండి..

వేణూశ్రీకాంత్ said...

హ హ సరదాగా బాగుందండి, బాగారాశారు.

Ennela said...

శివరంజని గారూ కృతజ్ఞతలు. ఇంకా చాలా సలహాలు కావాలి నాకు. మీకు తప్పకుండా చాన్స్ ఇస్తాను. నో సారీస్ అండీ వీలైతే స్యారీస్ ఓకే.

జ్యొతి గారూ కృతజ్ఞతలు. తప్పకుండా మారుస్తాను.

వేణు గారూ కృతజ్ఞతలు.

ఇందు said...

అబ్బా అబ్బా! మీ కామెంటుతో ఇప్పుడే మునగచెట్టు ఎక్కి వచ్చా :D ఈ బ్లాగ్లోకం లో 'జ్యోతీ' గారు బ్లాగ్ గురువు :) వారివద్ద బ్లాగ్ గురించి బోలెడు సంగతులు ఉంటాయి.వారి బ్లాగ్స్ లొ 'బ్లాగ్ గురువ' అనె బ్లాగ్ కూడా ఉంది. మీరు అవి చూసి ఫాలో ఐపోండంతే...వ్రతం చేసిన చోటనే తీర్ధప్రసాదాలుంటాయండీ...ఇంటికి రమ్మంటే ఎలా??:D

Ennela said...

అవునా? గురువు గారికి గురువు గారన్న మాట జ్యోతి గారు... గుగ్గురువులకు ప్రణామములు.ఇందు గారూ చక్కగా టొరంటొ పట్టణము చూడొచ్చ్చు ,ప్రసాదము తినొచ్చ్చు మరియు నయాగర సొగసులు చూసెయ్యొచ్చు....మంచి తరుణము ...ఆలసించిన ఆశా భంగము కాదనకుండ వచ్చెయ్యడం బెటర్.

ఫణి గారూ మీకూ ఉమకి కృతజ్ఞతలు.

Pranav Ainavolu said...

Haha... Chala bagundi! :)
Hearty Welcome!

Ennela said...

ప్రణవ్ గారూ కృతజ్ఞతలు

జేబి - JB said...

ఈ కథయందు మీరు సూక్ష్మంగా చెప్పిన, నేను గ్రహించిన నీతియేమనగా, నాలాంటివారు లక్ష్మీ కటాక్షంకోసం తపిస్తూ కష్టపడి సంపాదించుకున్న సరస్వతీ వరముని దూరము చేసుకొనుచుంటిమని.

బాగా రాశారు.

Ennela said...

జేబీ గారూ కృతజ్ఞతలు. మరి సరస్వతీ లక్ష్మి ఒక్కచోట ఉండమని మారాం చేస్తే ఏం చేస్తాం చెప్పండి

తృష్ణ said...

though late, బ్లాగ్లోకానికి స్వాగతం.very nice writeup.wishing many more sweet posts from you.

sivaprasad said...

welcome to blog world

స్నిగ్ధ said...

ఎన్నెల గారు,బహు బాగుగా ఉన్నది మీ బ్లాగ్ ప్రవేశ కథ.ఇన్ని రోజులు మీ బ్లాగ్ మిస్సయ్యినందుకు కడు విచారముగా ఉన్నది. తక్కిన టపాలు చదివి కామెంటెదను..
:)