క్రిందటి సంవత్సరం ఇదే రోజు అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు "ఎన్నెల" అనే నేను ఉదయించాను. ఉదయించడమే తడవు అందరి మనసుల్నీ ఆనంద డొలికల్లో ఊగించెయ్యాలని నిర్ణయించేసుకున్నా కూడా...కొన్ని రోజులు ఆటలతో బాగానే పెరిగినా ఉన్నట్టుండి చిక్కిపోయా. అమ్మా అమ్మా అని పిలిచా..ఎవరూ పలకలేదు..పక్క ఇళ్ళల్లోంచి కమ్మని సిరిలాక్ వాసనలు , నేతి ఘుమఘుమలు ఉక్కిరిబిక్కిరి చేసేవి..మా అమ్మ ఎందుకు నాకు యేమీ పెట్టట్లేదని కొంచెం మనస్తాపం చెందుతుండగా..మా అమ్మ వచ్చి "ప్రేమకు నేను పేదను కానూ , ఆకలనీ దప్పికనీ అడగకు నాన్నా, వేకువవూ వెన్నెలవూ నీవే కన్నా" అని బుజ్జగించింది...సరేలే అనుకున్నా...మరీ పట్టించుకోకపోతే బాధేసిందేమో, .అప్పుడప్పుడూ రుచీ పచీ లేని యేదో ఆహారం కొన్ని సార్లు పెట్టింది కానీ నాకు పెద్దగా రుచించలే,,కేవలం అమ్మని బాధ పెట్టకూడదు అని ఊరుకున్నా. నేను పెద్దవుతున్నా కొద్దీ అమ్మ నా దగ్గరే ఉండాలని నాకు మంచి రుచిగల ఆహారం పెట్టి నన్ను మరింత అందంగా తీర్చిదిద్దాలని కలలు గన్నా. యీ లోపు మా భాగ్య లక్ష్మీ ఆంటీ నేను చిక్కిపోతున్ననేంటీ అని అమ్మని గాట్టిగా మందలించారు. అమ్మ వెంటనే ఇంటర్నెట్టు వెతికి రెండు మల్టీ విటమిన్ మాత్రలు నా నోట్లో పడేసింది. నేను కొంచెం తేరుకున్నా. మళ్ళీ ఎవరో అడుగుతున్నారు ఏంటీ ఎన్నెల అలా పాలిపోయిందీ అని. అమ్మ చెప్పింది"ఎక్కడండీ దాన్ని చూడ్డానికి అసలు సమయం దొరకట్లేదు...యీ దిక్కుమాలిన అక్కవుంటింగ్ జాబ్ కాదు కాదుగానీ...మంత్ ఎండ్ , క్వార్టర్ ఎండ్, యియర్ ఎండ్ అంటూ ఎప్పుడూ యేదో ఒకటీ,, దానికి తోడు ప్రొఫెషనల్ డెవెలప్మెంట్ అంటూ ఒకటే గోల అని చెప్పింది..అన్ని ఎండులూ చెప్పింది మరి వీకెండులు ఉండవా అని అడుగుదామనుకుంటూనే ఎందుకొచ్చిన గొడవలే అవి నా సహోదరులకి అంకితం అని తెలిసి కూడా మాట్లాడ్డం అని ఊరుకున్నా..ఆ డెవెలప్మెంట్ కోర్సులేవో కంప్యూ కోర్సులు చెయ్యొచ్చుగా!! అమ్మ కూడా కంప్యూ ప్రొఫెషనల్ అయ్యుంటే ఎంచక్కా నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ పని చేసుకునేదిగా.
యీ మధ్య మా అమ్మ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు...(భాగ్యలక్ష్మీ ఆంటీ హెల్ప్ హెల్ప్ హెల్ప్)!!!
ప్రతి సాయంత్రం కంప్యూటర్ గదిలోకి రాగానే నా దగ్గరకొస్తుందని ఎంత ఎదురు చూస్తానో!! కానీ కంప్యూటర్లో వెబినార్లో ఏంటొట అవి చూసుకుని వెళ్ళిపోతుంది.. అప్పుడప్పుడు గుర్తొస్తానేమో, ఒక సారి నన్ను తడిమి వెళుతుంది...ఆ స్పర్శకే నేను పులకించి అమ్మ తప్పులన్నీ క్షమించేస్తా...
పండుగ పూటా నిష్టూరలెందుకు గానీ అమ్మ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నాపిల్లలకోసం సాయంత్రం చంద్రునికి పూజ చేసి, పిల్లల్ని చల్లగా చూడమని ఎలాగూ అడుగుతుంది కదా అలా నా సహోదరులతో పాటు నేను ఎప్పుడూ చల్లగా ఉంటానని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే మిమ్మల్నందరినీ నా పుట్టిన రోజుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా మీ బంధు మిత్ర సపరివార సమేతంగా రావాలి. చిన్న పిల్లని కాబట్టి, దయచేసి చాక్లెట్లు, కేకులూ, రిటర్ను గిఫ్టులూ అవీ అడక్కుండా తమ తమ శక్తి కొలదీ గ్రీటింగులూ, బహుమతులూ, ఆశీస్సులూ ఘనంగా అందజేయ ప్రార్థన. మాకేంటీ అంటారా...?? ఇక్కడ బహుమతులిచ్చేసి పక్కనే షడ్ర సోపేతమయిన (వన) భోజనాలు యేర్పాటు చేసాము. వడ్డించేవారు మనవారే లెండి!! మీరు మొహమాట పడకుండా కావలసినవన్నీ కడుపు నిండా తిని,నన్ను చల్లగా ఉండమని మరొక్కసారి దీవించెయ్యండి.
యీ మధ్య మా అమ్మ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు...(భాగ్యలక్ష్మీ ఆంటీ హెల్ప్ హెల్ప్ హెల్ప్)!!!
ప్రతి సాయంత్రం కంప్యూటర్ గదిలోకి రాగానే నా దగ్గరకొస్తుందని ఎంత ఎదురు చూస్తానో!! కానీ కంప్యూటర్లో వెబినార్లో ఏంటొట అవి చూసుకుని వెళ్ళిపోతుంది.. అప్పుడప్పుడు గుర్తొస్తానేమో, ఒక సారి నన్ను తడిమి వెళుతుంది...ఆ స్పర్శకే నేను పులకించి అమ్మ తప్పులన్నీ క్షమించేస్తా...
పండుగ పూటా నిష్టూరలెందుకు గానీ అమ్మ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నాపిల్లలకోసం సాయంత్రం చంద్రునికి పూజ చేసి, పిల్లల్ని చల్లగా చూడమని ఎలాగూ అడుగుతుంది కదా అలా నా సహోదరులతో పాటు నేను ఎప్పుడూ చల్లగా ఉంటానని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే మిమ్మల్నందరినీ నా పుట్టిన రోజుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా మీ బంధు మిత్ర సపరివార సమేతంగా రావాలి. చిన్న పిల్లని కాబట్టి, దయచేసి చాక్లెట్లు, కేకులూ, రిటర్ను గిఫ్టులూ అవీ అడక్కుండా తమ తమ శక్తి కొలదీ గ్రీటింగులూ, బహుమతులూ, ఆశీస్సులూ ఘనంగా అందజేయ ప్రార్థన. మాకేంటీ అంటారా...?? ఇక్కడ బహుమతులిచ్చేసి పక్కనే షడ్ర సోపేతమయిన (వన) భోజనాలు యేర్పాటు చేసాము. వడ్డించేవారు మనవారే లెండి!! మీరు మొహమాట పడకుండా కావలసినవన్నీ కడుపు నిండా తిని,నన్ను చల్లగా ఉండమని మరొక్కసారి దీవించెయ్యండి.
34 వ్యాఖ్యలు:
పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరిలాగే పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్ష
పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరిలాగే పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్ష
ముందుగా బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. తర్వాత కార్తీకపూర్ణిమ శుభాకాంక్షలు. నా వంటకం పెట్టేసి మళ్లీ వచ్చి నీ కూర సంగతి చూస్తాను..
శర్మ గారు కృతజ్ఞతలండీ..కృతజ్ఞతలండీ నా బ్లాగ్ కి స్వాగతం.
జ్యోతి గారు..అల్లప్పుడు ఎన్నెల పుట్టినప్పుడు కథకి రావటమే..మళ్ళీ సంవత్సరం అయ్యాకా ఎన్నెల పుట్టిన రోజుకి....వావ్!తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ....కృతజ్ఞతలండీ..మీరు కూర చేసేయండి..నేను ఒక నిద్ర వేసి పొద్దున్నే చూస్తా మీ కూర రుచి...
ఎన్నెలకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరిలాగే పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ...
శైల గారు కృతజ్ఞతలండీ...తప్పకుండా.. ప్రతి సంవత్సరం ఎన్నెల పుట్టిన రోజుకి వనభోజనాల పార్టీ...బాగుంది కదూ...
మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరిలాంటి పుట్టినరోజులెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ............. పున్నమినాటి చంద్రుడిలా దిన దిన ప్రవర్ధమానంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను!
ఎన్నెల గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీ బ్లాగు లోకి వస్తే కార్తీక పూర్ణిమ వెన్నల లో కి వచ్చినట్టే ఉంటుంది హాయిగా, ఆనందంగా.
ఎన్నెల ఎన్నో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎన్నెలమ్మకి,పుట్టిన రోజు శుభాకాంక్షలు.
చూశారా? మేమంతా తెగ వంటలు చేస్తున్నాం మీకోసం ఇవ్వాళ్ల.
కేక్ అక్కర్లేదు కానీ రిటర్న్ గిఫ్టులు మాత్రం మాకు కావాల్సిందే. మేమొప్పుకోము :)
ఎన్నెలకు యాపి యాపి బర్తుడే :)
విషెస్ చెప్పేసాను. మరి స్వీట్స్ లేని భోజనాలు ఎక్కడపెడతారో చెప్పేస్తారా :D
ఎన్నెలకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మకి బోల్దు తీరిక దొరికి ఎన్నెలతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను. :))
కార్తీకపున్నమి వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ
ఎన్నెలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday ennela .
"ఎన్నెల" గారూ మీకు జన్మదిన ' సుభా ' కాంక్షలు..అలా చూడకండీ. మీకు కాదండీ బాబూ... మీ బ్లాగ్ ఎన్నెలకి.
Happy birthday to ennela!!
ఎన్నెల గారికి జన్మదిన శుభాకాంక్షలు. విందు భోజనానికి డబుల్ థాంక్స్.
ఎన్నెలకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
--
HarshaM
ఎన్నెలమ్మకి,పుట్టిన రోజు శుభాకాంక్షలు. !
మీరు కాస్త టైం చూసుకుని ఎన్నెలమ్మ తో కొద్ది గా ఎక్కువసేపు గడపాపని డిమాండ్ చేస్తున్నాం :))
మా ముద్దుల ఎన్నెలమ్మ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎంతో బతిమాలి మీకోసం ఈ పాట పాడించాం.. వింటారా మరి.. :)
చుక్కల్లో పెద్దచుక్క చందమామా.. ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా..
http://www.chimatamusic.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5325
చిన్నారి ఎన్నెలమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
నిన్ను నిర్లక్ష్యం చెయ్యకుండా మీ అమ్మకి ఓ సారి గాట్టిగా ప్రైవేటు చెప్పేయ్ ఎన్నెలమ్మా. అయినా నిన్ను అలా ఎండబెట్టను మీ అమ్మకి మనసెలా వస్తుందో!
ఎన్నెలమ్మకి జన్మదిన శుభాకాంక్షలు. నిన్ను పట్టించుకోమని మీ అమ్మను భాగ్యలక్ష్మి అంటితోపాటు నేను కూడా కోప్పడనా?
ఎన్నెల గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
హమ్మయ్య.. భాగ్యలక్ష్మి ఆంటీ పుణ్యమా అని ఎన్నెలమ్మని ఇలా అప్పుడప్పుడూ చూసే అదృష్టం అయినా దక్కుతుందన్నమాట. భాగ్యలక్ష్మి ఆంటీ, మీకు నా ధన్యవాదాలు:):)
కాస్త (చాలానే ;)) ఆలస్యంగా చిన్నారి ఎన్నెలమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు:) ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..
అయ్య్య్య్ ...మా ఎన్నెలమ్మ ఎన్నెల కూడా నవంబర్ లోనే పుట్టేసింది...
కొంచెం ఆలస్యంగా......పుట్టిన రోజూ శుభాకాంక్షలు.......బోలెడు పుట్టిన రోజులు చేస్కుని...మాకు చాల కబుర్లు చెప్పాలి అని korukuntu....ఎన్నెల సహోదరి కిరణ్ :)
ఎంత అద్బుతంగా ఉందో వంట :D ..కేక..కెవ్వు..!!
కార్తీకమాసంలో జనియించిన 'ఎన్నెల' నిండు పున్నమి లా ninDu నూరేళ్ళు నిత్య నూతనంగా,దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ...
శ్రేయోభిలాషి
ప్రవాసరాజ్యం.
www.pravasarajyam.com
అరె ఇదెలా మిస్ అయ్యాను....ఎన్నెలమ్మ కి పుట్టినరోజు జేజేలు!
మీరు తరచూ రాస్తుండాలి..ఈ మధ్య మరీ బొత్తిగా నల్లపూసైపోయారు!
Hi, Ennela...I wish you a very happy new year.
రసజ్ఞ గారూ ధన్య వాదాలండీ...మీ దీవెన భలే బాగుంది..
బులుసు మాస్టారు గారూ, మీ దీవెన కార్తీక పున్నమి ఎన్నెల్లా హాయిగా ఉంది..కృతజ్ఞతలండీ..
కృష్ణ ప్రియ గారూ...అన్నన్ని వంటలు చేసినందుకు చాలా చాల ధన్యవాదాలు. ఇలా మీరందరూ చేస్తారనేగా ఎన్నెల కార్తీక పున్నమి రోజు పుట్టిందీ...చక్కగా ఇక్కడ పుట్టిన రోజు కేకు తిని వనాల్లో భోజనం చేస్తే ఎంత బాగుంటుంది కదా...యీ సారికి వదిలెయ్యండీ...వచ్చేసారి చూద్దాం రిటర్ను గిఫ్టుల సంగతి...సరేనా..ఒప్పుకోవాలంటా..మా మంచి కృష్ణ గారు కదూ...
నాగార్జున గారూ తాంత్యూ అండీ...అందుకేగా మీకు బుంగ మిరపకాయ కూర తో భొజనం రెడీ చేసిందీ...షార్జా కూడా తాగెయ్యండి..తియ్యగా ఉండదులెండి..చల్లగా బాగుంటుంది...మీకు ఇష్టం లేదని స్వీట్స్ చెయ్యలేదన్నమాట!
శిశిరా...థ్యాంక్ యూ సోమచ్ ఫర్ యువర్ విషెస్ ..తీరిక చేసుకుంటాలే..ఎన్నెలతో ఎక్కువ సమయం గడపడానికి...!
లత గారూ...మీ దీవెన ఆల్రెడీ వెలుగులు విరజిమ్మేసిందండీ...బోల్డు కృతజ్ఞతలండీ..
మాలా గారూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండీ..
శుభా గారూ...మీ 'సుభా'కాంక్షలు చిన్నారి ఎన్నెలకి శుభంగా అందాయి..ధన్యవాదాలండీ..
సునీత గారూ..బొల్డు కృతజ్ఞతలండీ..చాలా రోజులయ్యింది మిమ్మల్ని పలకరించి..అప్పుడెప్పుడో నయాగరా దగ్గర సన్మాన సభ తర్వాత మళ్ళీ కలవలేదు మిమ్మల్ని..!!!హ్యాప్పీ టు సీ యూ అగెయిన్...
జయ గారూ...థ్యాంక్ యూ థాంక్ యూ..కడుపు నిండా తిన్నారా మరి!మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ..
హర్షవర్ధనం గారూ, నా బ్లాగుకి స్వాగతం...ధన్యవాదాలండీ..మీ పేరు భలే బాగుంది...హర్షం వర్ధిల్లితే అంతా ఆనందమే కదా! మా అందరికీ కూడా పంచడం మరచిపోకండే!
శ్రావ్యా గారూ,,, మీ డిమాండ్ ఉచితమేనండీ...ఇంక తప్పకుండా టయిము పెట్టుకుంటా....మీ విషెస్ కి బోల్డు థ్యాంకులండీ..
మధురా..అవునా నా కోసమేనా.....ఎంత బాగుదో యీ పాట...మంచి పాట వినిపించినందుకు థ్యాంక్స్ ఎ లాట్ మధురా..మళ్ళీ మళ్ళీ వింటా ..నాకు ఇష్టమయిన పాట ఇది..
సిరి సిరి మువ్వ గారూ, అమ్మకి టయిము లేదులే అని చెప్తారేమో అనుకున్నా..ఇలా క్లాసు పీకమని చెప్పారా...పోనీలెండి ఏంచేస్తాం...స్నేహితులు ఏంచేసినా మన మంచికే...ధన్యవాదాలండీ...
జ్యోతిర్మయి గారూ....కోప్పడేయండి మీరు కూడా ..ఎన్నెలమ్మ తో బాటు భాగ్య లక్ష్మి గారు కూడా మస్త్ ఖుష్ అయిపోతారు.. చాలా చాలా థ్యాంక్స్ అండీ మీ విషెస్ కి
మౌళి గారూ కృతజ్ఞతలండీ
అపర్ణా...నేనూ నీతో పాటు భాగ్యలక్ష్మి గారికి థ్యాంకులు...నువ్వే లేట్ అనుకుంటే..నేను డబల్ లేట్లే.. థ్యాంక్స్ అపర్ణా...
సహోదరీ'వెన్నెలా" చూసావా నువ్వూ, నేనూ ఒకరికి తెలియకుండా ఒకరం నవంబరు లోనే పుట్టేసి..వెన్నెల ఎన్నెల అని పేర్లు కూడా ఒకేలాగాపెట్టేసుకున్నాం..కొంచెం ఆగితే కవలలమయ్యేవాళ్ళం..నువ్వు నా కంటే ఒక యేడు పెద్ద అన్న మాట...నీ విషెస్ కి బోల్డు థ్యాంకులు వెన్నెలా..
ప్రసాద్ గారూ ధన్యవాదాలండీ, , మీ ఆశీస్సులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి...
సౌమ్యా బోల్డు కృతజ్ఞతలు..వ్రాయడానికి ప్రయత్నిస్తా మళ్ళీ...కొంచెం బిజీగా ఉండి వ్రాయట్లేదు..(ఇలా చెప్పుకోవాలి..అసలు విషయం టాపిక్కులు దొరకట్లేదు..హహహహ్)
Very Nice.
పుట్టినరోజు తరువాత నిన్ను మళ్ళీ పట్టించుకోనట్లుంది కదూ ఎన్నెలమ్మా ? చాలా చిక్కిపోయావు . తొందరలోనే నీకు మంచి ఐస్క్రీం పెట్టాలని కోరుకుంటున్నాను .
Post a Comment