బ్లాగ్వన భోజనం...

Wednesday, November 9, 2011

ఇంత మందిని భోజనానికి పిలిచేసానా మరి నా వంతు ఏంచేద్దామా అని ఆలోచిస్తుండగా...ఇంట్లో రెడీగా చిన్న చిన్న బుంగ మిరపకాయలు కనిపించాయి..నేను ఎప్పుడూ చేసే అందరి మెప్పూ పొందే బుంగ మిరపకాయల కూర కి డిసయిడ్ అయిపోయా..ఆఫీసులో కొందరు.." వీ ఆర్ ఆన్ ద ఫయర్ , బట్ వీ కెన్ నాట్ మిస్ ద ఫయర్,.ప్లీస్ గివ్ మీ సం మోర్ అండ్ బ్రింగ్ ద ఫయర్ అగెయిన్ అండ్ అగెయిన్ " అంటారు. ఆ మంట మనం వేసే కారం మంట అన్నమాట. మీరూ రుచి చూడండి..తప్పకుండా నచ్చుతుంది..
కావలసిన వస్తువులు:
బుంగ మిరపకాయలు (చిన్నవి)8
చింతపండు (కొంచెం)
శెనగ పిండి (100 గ్రాములు)
జీల కర్ర 1 స్పూను
ఉప్పు కారం సరిపడా (మీకు..నన్ను చెప్పమంటే..లెక్క నషాళానికంటుతుంది)
నూనె 100 గ్రాములు
ముందుగా మిరపకాయల్ని నాలుగు భాగాలుగా కొయాలి(గుత్తి వంకాయలొ వంకాయ కోసినట్టు)
వీటిని చింత పండు రసం లో 10 నిముషాలు ఉడికించాలి
మైక్రో వోవెన్ లో కూడా పెట్టచ్చు.
ఆవి ఉడికే లోపు శెనగ పిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఒక స్పూను నూనె వేసి కలిపి ఉంచుకోవాలి.
తరువాత కాయల్లో నీళ్ళని పిండేసి (చాలా సుకుమారంగా పిడాలండొయ్!)
ఇందాకా కలిపి పెట్టుకున్న శెనగ పిండి మిక్స్ ని యీ కాయల్లో కూరి, కాగుతున్న నూనెలో వేసి మూతపెట్టాలి...మూత మీద కాసిని నీళ్ళు పోస్తే ఆవిరికి కూర మీద చిన్నగా నీళ్ళ చుక్కలు పడి కూర మాడకుండా ఉంటుంది....10 నిముషాలకొకసారి జాగర్తగా కలిపి మళ్ళీ మూత పెట్టెయ్యాలి...కాయలు బాగా వేగినట్టు అనిపించాక మీరైతే వెంటనే తినెయ్యొచ్చు వేడి వేడి అన్నంలో...మరి నేను వనాలకి తెస్తానని ప్రామిస్ చేసా కాబట్టి రుచీ అదీ చూడాలని టెంప్టు అవకుండా జాగర్తగా సర్ది తెచ్చేస్తున్నా....
సీతయ్య స్పెషల్....షార్జా...కూల్ కూల్
మేము మాల్దీవులకి వెళుతూ ట్రివేండ్రం వెళ్ళినప్పుడల్లా హోటెల్ పక్కన ఉన్న చిన్న ఫ్రూట్ జూస్ కొట్లో మా పిల్లలు షార్జా అని యేదో జూస్ తాగేవాళ్ళు. మొన్న సడెన్ గా మా వారు పిల్లల కోసం ఫ్రూట్ ప్యూరీ చేస్తే అది అచ్చు ఆ షార్జా టేస్టుతో వచ్చింది...దాని కథా కమామీషు

అరటి పండ్లు...కొంచెం ముగ్గినవి 2
స్ట్రాబెరీ పండ్లు 8
హార్లిక్స్/మైలో/బోర్నవిట 2 స్పూన్లు
పంచదార...మీ ఓపిక...(మాకయితే 2 స్పూన్లు)
పాలు 2 కప్పులు
ఇంకా చూస్తారేంటండీ...అన్నీ కలిపి మిక్సీలో గర్రుమని తిప్పేసి.....జుర్రుకుని తాగేయటమే...ఇదిగో ఇక్కడ సర్వ్ చేసా....తాగేయండి...
మా వారిని ఇది ఎందుకు చెయ్యమన్నానో తెలుసా...పైన నేను చేసిన కూర కారమని కంప్లయింట్ చెయ్యకుండా..తియ్య తియ్య తియ్యగా చల్ల చల్లగా షార్జా....కూల్ కూల్....ఎలా ఉంది?

7 వ్యాఖ్యలు:

మాలా కుమార్ said...

మీ పార్జా తియ్య తియ్యగా చల్ల చల్లగా బాగుందండి .

కృష్ణప్రియ said...

చాలా బాగుంది. అయితే మరి పేస్ట్ లా కాప్సికం లో కి ఎలా వచ్చింది? సెనగపిండి మసాలా లో నీళ్లు కాస్త కలిపారా?

శిశిర said...

చాలా తొందరగా, తేలిగ్గా చేసుకోగలిగేలా రెండూ కూడా బాగున్నాయి.

లత said...

ఎన్నెల గారూ,నాకు కూల్ కూల్ చాలా నచ్చిందండీ

Padmarpita said...

Its cool and yummy:)

Ennela said...

లేట్ గా స్పందిస్తున్నందుకు అందరూ నన్ను క్షమించెయ్యండి..
మాలా గారూ తాగుతూ ఉండండి మరి చల్ల చల్లని షార్జా...తియ్యగా చల్లగా హాయిగా...చల్ల చల్లని షార్జా...
కృష్ణప్రియ గారూ, నేను శెనగ పిండి లో ఉప్పూ, కారం, జీల కర్ర కలిపేటప్పుడు కాస్త నూనె వేస్తానండీ...అదీ గాక మూకుడు మీద మూత పెట్టిన ప్లేట్ లో నీళ్ళు పోస్తాం కదా అందులోంచి ఆవిరి చుక్కలు చుక్కలుగా పడి శెనగ పిండి దగ్గరగా ఉండేలా చేస్తుంది...
శిశిరా, లత గారూ, పద్మార్పిత గారూ...మీరు కూడా తాగెయ్యండి..తియ్యనీ కమ్మనీ, చల్లనీ, షార్జా..చెసారా మరి?

Ramakrishna said...

బ్లాగ్వన భోజనం చలా రుచి గా ఉందండి...చాల కలర్ఫుల్ గా ఉందండి మీ బ్లొగ్ :)