నా భారత దేశ యాత్ర
Tuesday, September 13, 2011
మా ఇద్దరికీ కలిపి ఒకే సెట్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు.. నాన్న ఎండలకి బాగా నీరసపడి ఓపిక తగ్గిపోయి ఫోన్ లో కూడా మాట్లాడలేక పోతున్నారు. పైగా మనము అడిగే ప్రశ్నలేవీ ఆయనకి వినిపించట్లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన చెప్పాల్సిన నాలుగు మాటాలూ గబ గబా చెప్పేస్తున్నారు..చంటి పిల్లాడు జానీ జానీ యెస్ పాపా చెప్పినట్టు.."నేను బానే ఉన్నానమ్మా, నా ఆరోగ్యం బానే ఉంది, మీరు బెంగ పెట్టుకోకండి..నేను 24 గంటలూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, మీరు చల్లగా ఉండాలని. మీరు పిల్లలు జాగరత, ఇక్కడ విషయాల గురించి యేమీ ఆలోచించద్దు. ఇక్కడ అందరం సంతోషంగా ఉన్నాము...ఉంటా మరి."ఇవీ ఆయన చెప్పల్సిన నాలుగు మాటలూ. విషయం ఏంటంటే, నాన్నకి వినికిడి , కంటి చూపు తగ్గాయి.అత్తయ్య ఆరోగ్యం కూడా అంత బాగోట్లేదనీ చాలా బెంగ పెట్టుకున్నారని ఒక్కరైనా వచ్చి చూసి వెళితే బాగుంటుందనీ దగ్గర బంధువు ఒకావిడ తరచూ అంటూ ఉన్నారు యీ మధ్య. మేమిద్దరం ఇంటికి వెళ్ళడానికి సహకరించని పరిస్థితులని తలచుకుని చాలా బాధ ,బెంగ పడుతున్నాము. అందరం పెట్టుకుంటే అవదు, యీ కాంట్రాక్టు అవగానే నువ్వు వెళ్ళిరా, నేను తరవాత వెళతా అన్నారు మా సీతయ్య. మాటల్లో కాంట్రాక్టు అయిపోగానే ఇండియా వెళ్లాలనుందని మా బాసు గారితో అన్నా. మా మనసున్న మంచి బాసుగారు "అప్పటిదాకా ఎందుకు ఇప్పుడు వెళ్ళొచ్చెయ్ ..కాంట్రాక్టు పొడిగిద్దాం"అనేసారు. ..చెంగు చెంగు మని నేను ఇంటికి ఫోను కొట్టి విషయం చెప్పా..వెంట వెంటనే వీసా కి అప్లయి చెయ్యడం, గబ గబా టికెట్టు బ్లాక్ చెయ్యడం జరిగిపోయాయి.. ఆరేళ్ళ తర్వాత ఇండియా వెళ్ళడం..కలా నిజమా అని గిల్లి గిల్లి చూసుకున్నా...రేపు వెళుతున్నాననగా కూడా ఇంకా నమ్మకంగా లేదు...ఎక్సైటుమెంటూ లేదు...టెన్షనూ లేదు...అలా ఆనందాలకూ బాధలకూ ఒకేలా స్పందిచే యోగినిలా విమానమెక్కాను.
కూడిక గుర్తులు (పాసిటివ్ మార్క్స్)(+):
1. నాన్న అత్తయ్యలతో సహా బంధువుల్లో పెద్దలందరినీ చూసి ఆశీర్వాదాలు తీసుకోవడం..
2. ఉమ్మడి కుటుంబంలో వదిలి వచ్చిన ప్రాణాతిప్రాణమైన చిన్ని చిన్ని పిల్లలతో కలిసి ఉండడం..(కొంచెం పెద్దయి పోయారనుకోండి..అయిన్న ఇంకా ఒళ్ళో పడుకోవడం..కౌగిలించుకోవడం, అన్నం ముద్దలు కలిపి పెట్టించుకోవడం మర్చిపోలేదంటే...చిన్నగా ఉన్నట్టేగా..)
3. మా ఆల్వాల్ వెంకన్నని, సికందరాబాదు బుజ్జి గణేషుడ్ని కలిసి హెల్లొ బాగున్నావా అని పలకరించడం.
4. బోనాలపండుగ రోజున తోట్లో ఎల్లమ్మని , బూలచుమమ్మనీ ఖుషీ చేయ్యడం..
బోనస్ గా ....బొల్లారం జాతర, రంగం జరిగేటప్పుడు వెళ్ళే అవకాశం..
5. చాలా యేళ్ళ తరువాత ఒక సీమంతం పండుగకు హాజరవడం.(పెళ్ళిళ్ళు, పేరంటాలు చూసి దాదాపు 12 యేళ్ళు అయింది మరి!!! )
6. చిట్టి, అపరంజి, దీపు,హర్షులతో కలిసి రోడ్డు మీద చాట్, పానీ పూరీ తినడం ..(ఒకేసారి లెండి..అయినా అపురూపమే కదా!!.)
7. అరగంట టైం లో చిన్ననాటి స్నేహితుల్ని అనుకోకుండా కలవడం.(అలా అరేంజ్ చేసిన మా లల్లీకి కృతజ్ఞతలతో)
8. నాకు కొత్తగా దొరికిన సోదరుణ్ణి సతీ సమేతంగా కలవడం
తీసివేతలు (నెగటివ్ మార్క్స్)(-):
1. మా అల్వాల్ గుడి ని పాత ముద్ర ఒక్కటి కూడా లేకుండా మొత్తం కొత్తగా కెట్టెయ్యడం...(ఇక్కడ 100 సంవత్సరాలు దాటిన యే భవనాన్నయినా ముట్టుకోనీయదు ప్రభుత్వం..అలాంటిది 400 యేళ్ళ చరిత్ర కలిగిన ఆ గుడి మచ్చుకి ఒక్కటంటే ఒక్క గుర్తు కూడా లేకుండా మార్చేసారు...కారణాలు తెసుసుకునే ఆసక్తి కలగలేదు..వెంకన్న విగ్రహం మార్చలేదు..అంతే చాలు అనుకుని తృప్తి పడాల్సి వచ్చింది అంతే...కానీ మనసులో ఎంత బాధ కలిగిందంటే, ఆ విషయం ఇంట్లో వాళ్ళతో ప్రస్తావించడానికి కూడా ఇష్టం లేనంతగా.....
2. ఉన్న మూడు వారాల్లో దాదాపు అన్ని రోజులూ బందులే...
3. ఎవ్వరికీ ఏమీ మనస్పూర్తిగా కొనియ్యలేకపోవడం (ఎందుకూ అంటారా...చెప్తాగా తొందరెందుకు?)
4. నేను కలవాలనుకున్న బ్లాగ్ మిత్రుల్లో ఒక్కళ్ళని కూడా కలవలేకపోవడం
5. మూడు వారాల్లో 333 చోట్లకి ప్రయిం మినిస్టర్ తిరిగినట్లు తిరిగి అందరికీ తలొక అర నిమిషం కేటాయించి తిట్టించుకోవడం..
6. ముందు సూచన లేకుండా శమ్షా బాద్ విమానాశ్రయంలో 1500 రూపాయలు టోల్ ఫీసో ఏంటో సరిగా వివరాలు కూడ చెప్పకుండా కట్టించుకోవడం.. (మీ టికెట్ ఏజెంట్ ని అడుక్కో వివరాలు అన్నారు. పాపం మా ఇంట్లో వాళ్ళందరూ నేను వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నారు కదా ఆ హడావిడిలో పెద్దగా పట్టించుకొలేదు నేను కూడా..."పోతే పోనీ పోతే పోనీ" అనుకున్నా..).
తీసివేతలు ఇంకా ఉన్నాయి కానండీ...కూడికలని ఎక్కువ చూపించుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుదన్నమాట...అందుకని ఇంక వ్రాయట్లేదు.
ఇది కూడికా తీసివేతా..మీరే చెప్పండి..(+/-) :
సమయానికి నగదు సర్దుబాటు కుదరక నేను వెళ్ళిన రెండో రోజు మా కృష్ణుల వారు వెస్టర్న్ యూనియన్ ద్వారా మనీ ట్రాన్స్ఫెర్ చేసారు. దీన్ని బ్యాంకులో డ్రా చెయ్యొచ్చని నాకు తెలియదు...వెస్టర్న్ మనీ వెతుక్కుంటూ వెళితే, వాళ్ళు చెక్కు ఇచ్చారు ..దాన్ని తీసుకెళ్ళి బాంకులో వెయ్యడానికి బందులు అడ్డమొచ్చాయి. ఒకసారి వెళితే బ్యాంకు మూసి ఉంది..రెండవసారి తెరిచి ఉందని కంఫర్మ్ చేసుకుని వెళితే, సరిగ్గా అప్పుడే మూసేయిస్తున్నారు. చాలా సేపు చూసి పక్కనున్న దుకాణంలో షాపింగు చేసి ఇంటికెళ్ళిపోయాము. బ్యాంకు తెరిచున్న సమయం చూసుకుని చచ్చీ చెడీ...వెళ్ళి డిపాసిట్ చేద్దామంటే, కవుంటర్లో చెక్కులు తీసుకోవట్లేదుట యీ మధ్య!!! అన్ని గంటలు లయిన్లో నిలబడ్డాక కవుంటర్ లో ఆవిడ విసుగులు...ఇక్కడికెందుకొచ్చావ్..అక్కడ డ్రాప్ బాక్స్ లో వెయ్యిపో (ఏక వచనం..పోనీలే ఆంగ్ల పద్దతిలో.."యూ" అంటున్నారులే అని సరిపెట్టుకుని..ఎప్పుడు రావాలండీ అని అడిగా..ఎగాదిగా చూసి 4 రోజుల తర్వాత రమ్మన్నారు. తీరా వేసిన చెక్కు 4 రోజుల తర్వాత చూసుకుంటే క్రెడిట్ అవలేదు. నా పాత అకవుంటు నంబర్ మారిందిట అందుకని వెనక్కి పంపించేసారుట (ఔరా...కొత్త ఫోన్ నంబర్ వచ్చాక పాత నంబరుకి డయల్ చేస్తే ఇది మారినది అని చెప్తారు కదా...బ్యాంకీ ఉద్యోగులకి యీ పాత నంబరుకి ఇది కొత్త నంబరు అని తెలియదా..అకటా హెంత అమాయకులు పాపం ఎవరు నియమించారో వీళ్ళని అని ఒక సారి కళ్ళు తుడుచుకుని మ్యానేజరు గారి కాళ్ళా వేళ్ళా పడి 4 విసుగులూ 8 కసుగులూ భరించి బతిమాలుతుండగా... అదిగో ప్రత్యక్షమయింది....ఎవలాలూ అంటారా... . సమయాభావం వల్ల ఇంటి దగ్గర కలవడానికి వీల్లేక బ్యాంకు దగ్గర ఉన్నానని తెలిసి అక్కడ కలవడానికొచ్చిన నా స్నేహితురాలు హెన్నాగ్లోరీ . దగ్గరకొచ్చి..."నువ్వు ఎన్నేండ్లయినా ఇట్లనే ఉంటవానే !మెత్తగ మాట్లాడితే పనులు గానీకి ఇది కెనడా గాదు..రా నేను మాట్లాడతా "అని బ్యాంకులో అందరినీ దడదడలాడించి , లాయర్ లా ప్రశ్నలడిగి "సరే తల్లీ డబ్బులు తిరిగి తెప్పిస్తాము 4 రోజులాగి రండి "అని వరమిప్పుంచుకుని .."యీ సారి మీరు రాకండి డబ్బులు తీసుకోడానికి ఆవిడొక్కరూ వస్తే చాలు "అనిపిచేంత గోల చేసింది. అప్పుడు నాతో ఉన్న మా కజిను " అక్కా యీవిణ్ణి మొదటి రోజునే తీసుకెళ్ళాల్సింది కదే బ్యాంకుకి..అనవసరంగా రెండు వారాల్నించీ తిరుగుతున్నాము..ఈవిడ వచ్చి ఉంటే రెండో రోజు డబ్బులొచ్చేసేవి చక్కగా..ఆ బ్యాంకు వాళ్ళు కొంచెం ఎక్కువేసి మరీ ఇచ్చేవారేమో అని..తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది కూడా!!
యీ లోగా ఇంటి దగ్గర పెద్ద వాళ్ళ బాంకులకి, జేబులకీ కన్నాలు పడడంతో పాటు, ఇటు వైపు అటువైపు చిన్న పిల్లల గల్లా కుండలూ, పిగ్గీ బాంకులూ కొబ్బరికాయలు పగిలినట్లు పగిలాయి..పిన్నీ నా దాగ్గర తీసుకొ, అత్తా ఇదిగో నా గల్లా, పెద్దమ్మ రా నా అకవుంటులో తెచ్చుకుందాం , అమ్మా ఇదిగో నా దగ్గరున్నడబ్బులు అని పిల్లలందరూ ఏడు కొండలవాడికిచినట్టు వాళ్ళ పొదుపుల్ని నిలువు దోపిడీ ఇచ్చేసారు..కాదేదీ ఖర్చు కనర్హం అని నేను ప్రతి పైసా అపురూపంగా అప్పు తీసుకున్నా. ...అయ్యో పాపం మా ఎన్నెలకి ఎంత కష్టమొచ్చిందీ డబ్బులు లేవని అస్సలు ఖర్చుపెట్టలేదు అన్నీ మిగులే అని ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నారు కదా ? అయ్యయ్యో మీరు అంత అమాయకులేంటండీ!!! మీ లాగే పాపం పసి పిల్లలు అప్పులిచ్చేసి అదేదో పుణ్యకార్యం చేసినట్టు సంతృప్తి ఫీల్ అయితే, పెద్దలు మాత్రం...అసలు ఎందుకొచ్చినట్టురా బాబూ అనుకున్నట్టు చూచాయగా అనిపించింది..కానీ నేను పెద్దగా పట్టించుకునే మూడ్ లో లేనన్నమాట...ఏమయితేనేం...మా హెన్నా గ్లోరీ పుణ్యమాని ..తిరుగు ప్రయాణం రోజున డబ్బులు చేజిక్కించుకున్నా. హమ్మయ్యా అందరి అప్పులు తీర్చేసా. అదృష్టం చివరి రోజు డబ్బులు చేతికొచ్చాయి..లేకపోతే యీ పాటికి అప్పుల అప్పమ్మ లా మిగిలి ఉండేదాన్ని.
(కథ వ్రాసినప్పుడు ఉంది కానీ 2021 లో హన్నా గ్లోరీ చనిపోయింది. ఈ కథ లోనూ, నా మనసులోనూ తను బతికుంటుంది ఎల్లకాలం.)
వ్యాఖ్యలు
మేరా భారత్ మహాన్
Subscribe to:
Post Comments (Atom)
32 వ్యాఖ్యలు:
నమస్తే ఎన్నెలమ్మా, అన్ని దినాల తర్వాత ఇంటికొచ్చినవా. అరే, జర ముందే చెప్పినుంటే ధూం ధాం చేస్తొంటిగా... పోన్లే ఒచ్చి మస్తుగ ఉన్నవ్గా సాల్తీ.
మాలికల రాశ్న కథ గిప్పుడే సదివిన, మంచిగుంది, మన మాండలికంల రాశేదాంట్ల నువ్వు సూపర్ అన్కో :)
మిమ్మల్ని కలవలేక పోవటం వెలితిగానే వుంది . మీతో కలిసి మీ అల్వాల్ వెంకన్నను చూదామనుకున్నాను . పోనీలెండి , కనీసం ఫోన్ లో నైనా మాట్లాడాము అదీ ఆనందం . మీరు నాకు తెగ నచ్చేసారండి .
పాపం అన్ని కష్టాలు పడి మొత్తానికి మాతృదేశాన్ని సందర్శించారనమాట. అయితే బోలెడు ఙ్ఞాపకాలని కూడా మూట కట్టుకున్నారా ఎన్నెల గారూ.. అల్వాల్ , సికింద్రాబాదు వచ్చి నన్ను కలవకుండా వెళ్లిపోయారా? వా వా వా :(:( నాకు చెబితే నేనొచ్చి ఎంచక్కా మిమ్మల్ని కలిసి మీ పుస్తకాలు కొన్నిటిని, బోలెడు ఙ్ఞాపకాల్ని తీసుకుని దాచిపెట్టుకుందును కదా...
:) బాగుంది .. కూడికలూ, తీసివేతలూ.. అన్నీ..
మీ ఆల్వాల్ గుడి మాకూ తెలుసు, కానీ వెళ్లలేదీమధ్య.
అయితే ఒకటర్థమైంది.. మీరు కలవాలనుకున్న బ్లాగర్ల లిస్టు లో మేము లేమన్నమాట :-(
కిందటి నెల భారతదేశ యాత్ర కొచ్చారన్నమాట. ఆరేళ్ళ తరవాత వస్తే ఎంత బిజీ గా గడిపారో అర్ధం చేసుకో గలను. తీసివేతలు కూడికలు ఎప్పుడూ బాలన్స్ కావండి. వచ్చి హాయిగా సంతోషంగా గడిపేసి కొన్ని మధుర క్షణాలు మూట కట్టి తీసుకెళ్లా రన్నమాట.
ఏవిటీ ముందేమో సీతయ్య అన్నారు, పిదప కృష్ణుల వారు అంటున్నారు, కొంపలేమీ అంటుకోలేదుకదా!
మళ్ళీ ఎప్పుడుజన్మభూమికి వెళ్ళినా, "మెత్తగ మాట్లాడితే పనులు గానీకి ఇది కెనడా గాదు" గుర్తుంచుకోండి చాలు.
I don't mean to rub it in - but was surprised that you had such tough time with money transfer. Unless you want huge amount of cash in hand in an instant, a most convenient way of getting rupee cash is to use your canadian bank ATM card.
But glad yo
యీ లోగా ఇంటి దగ్గర పెద్ద వాళ్ళ బాంకులకి, జేబులకీ కన్నాలు పడడంతో పాటు, ఇటు వైపు అటువైపు చిన్న పిల్లల గల్లా కుండలూ, పిగ్గీ బాంకులూ కొబ్బరికాయలు పగిలినట్లు పగిలాయి..
హ హ్హ :)))
మీరు తరుచుగా పోస్టులు రాయాలని డిమాండ్ చేస్తున్నాం
కృతజ్ఞతలు నాగార్జున గారూ...ప్లాన్ చేసుకుని రాలేదండీ అన్నీ టప టపా జరిగిపోయాయి...మీరు ధూం ధాం చేస్తారు..నాకు తెలియదేంటీ...సమయం లేదంతే!!యీ సారి చెప్పివస్తాగా....కనీసం పావుగంటైనా అందరినీ కలిసేలా ప్లాన్ చేసుకుంటా...
మాలిక కథ గురించి మీరు వ్రాసిన కామెంటు గాలిలొ తేలిస్తొంది నన్ను.యీ మాండలికంలో ఇంకా చాలా వ్రాయలని అనిపిస్తోంది.మీ ప్రొత్సాహానికి ధన్యవాదాలు.
మాలా గారూ, కృతజ్ఞతలండీ.అవును కనీసం మాట్లాడగలిగినందుకు చాలా సంతోషంగా ఉందండీ..యీ సారి తప్పక కలుస్తాను...అల్వాల్ గుడికా!!!అప్పట్లో చూసి రండి అని మిమ్మల్ని పదే పదే విసిగించాను...కానీ ఇప్పుడు అంత అనిపించట్లేదు..కారణం చెప్పాగా...
సారీ అపర్ణా, అలా హడావిడిగా అయిపోయింది...యీ సారి తప్పక కలుస్తాలే...కాంట్రాక్టు అయిపోయాక అయితే కొంచెం తీరిగ్గా వచ్చేదాన్ని..నాన్నకి బాలేదని తెలిసి ఆదరా బాదరా హైదరా "బాదురా"...అదీ సంగతి...
ఇప్పుడు విమానాల్లో తీసుకెళ్ళే బరువు చాలా తగ్గించేసారు..పుస్తకాలు గిస్తకాలూ కుదరవులే( సాడ్ )..జ్ఞాపకాలు వాకే,నీకూ కొన్ని పంచి ఉండేదాన్ని తప్పకుండా !!
కృష్ణ గారూ, ఒక సారి కంప్యూటర్ వదిలి బయటకెళ్ళి ఆకాశం వైపు చూసి రండి..చూసారా...ఒక కాగితం రోల్ తేలుతూ కనిపిస్తోందా...అది నేను కలవాలనుకున్న బ్లాగర్ మిత్రుల లిస్ట్ అన్నమాట...ఇక్కడ బయల్దేరినప్పుడు వ్రాయడం మొదలెట్టి ఆ రోల్ తో అలాగే విమానమెక్కేసా..ఇండియా వచ్చేదాకా వ్రాస్తూనే ఉన్నా. కెనడా వాళ్ళు ఏమనలే కానీ ఇండియా లో కస్టంస్ వాళ్ళు, కస్టంస్ కట్టమని కష్ట పెడుతుంటే.. ఆ రోల్ అలాగే గాల్లో వదిలేసా.నేను వదిలేసిన లిస్టు కనడా విమానాలకి దారి చూపిస్తోందట అందుకే దాన్ని అలాగే వదిలెయ్యమని రిక్వెస్ట్ చేసారన్నమాట !సరిగ్గా చూడండి ఆ లిస్టులో పదో పేరు మీదేగా.ఇప్పుడు కోపం పోయిందా? ఆఖరి రోజు మాలా గారి నంబరొక్కటీ దొరికిందండీ..కనీసం మాట్లాడగలిగా...
బులుసు గారూ ధన్యవాదాలండీ...మీరూ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎక్పీరియెన్స్ లు ఉండే ఉంటాయి కదా? ...అవునండీ..అంత బిజీ లోనూ అదో ఆనందం..పరమానందం..
నాగేస్రావు గారూ,కృతజ్ఞతలండీ ...హహహహ. కొంపలేమీ అంటుకోలేదండీ...వారి అసలు పేరు కృష్ణుల వారిదే..అయితే ఎవ్వరిమాట విననప్పుడు సీతయ్య అనే పేరుతో పాటు..సందర్భానుసారం హిట్లర్, టైగర్, సింబా, కర్ణ, రాజా వారు ఇత్యాది ఆ పేరుకి పర్యాయ పదాలుగా ఇంట్లో వినిపిస్తుంటాయన్నమాట.
అవునండీ అలా బతిమాలితే పనులయ్యేటట్లు కనబడలేదు ఎక్కడా...!!
కొత్తపాళీ గారూ కృతజ్ఞతలండీ..మా ఊళ్ళో చెప్పే ఒక సామెత ఉంది.."గ్రాచారం బాలేక నాచారం పోతే, నాచారం దెయ్యాలు నా ఎంట బడ్డాయి" అని...అలా కొన్ని జీవితాలకీ నాచారం గుట్ట నరసిమ్హ స్వామి కూడా సాయం చెయ్యలేడు...
హానెస్ట్ లీ..పిల్లలు యూనివర్సిటీ కెళ్ళే టైం కదండీ.. అందుకని ఆల్ కార్డ్స్ ఆర్ ఫుల్ అండ్ ఆల్ లైన్స్ ఆర్ బిజీ...హహహ ...అదీ సంగతి...
హరే కృష్ణ , కృతజ్ఞతలండీ...కృష్ణ కృష్ణా .కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కాని ఆఫీస్ వైఫ్స్ కి ఇలాంటి డిమాండ్స్ ఎలా చెల్లుతాయి రామా....!!!
hammayya mothaniki entiki vachaerannamaata :)
పోస్ట్ బాగుంది .....
మీ స్నేహితురాలి పేరు(Henna Glory) బావుంది కొంచెం వెరైటీ గా....
నాకు అంతే ఇండియా వెళ్ళినపుడు ఏ ఫీలింగ్ రాదు అసలు..స్తబ్ధుగా అలా ఉంటాను అంతే .. మావారేమో నా జన్మ భూమి అని పాటలు పాడుతారు..కాని మళ్ళీ ఇక్కడకు వస్తున్నప్పుడు బెంగొస్తుంది..ఫ్లైట్లొ కూర్చుని ఎడుస్తాను ..మళ్ళీ ఎన్నాళ్ళకు అందరినీ కలుస్తానో అని ..
nice post
ఎన్నెలమ్మా .. ఇండియా వెళ్లి వచ్చారా అయితే. చాన్నాళ్ళకి చూస్తున్నామిమ్మల్ని బ్లాగులో. మా సీతన్న గారు కుశలమేనా? :-)
"అసలు ఎందుకొచ్చినట్టురా బాబూ అనుకున్నట్టు చూచాయగా అనిపించింది"
:-)
అవును అశోక్, మిమ్మల్ని కలవడం/ఇంఫార్మ్ చెయ్యడం అవలేదు సారీ..
భారతీయ గారూ,
అవునండీ నాకు కూడా తన పేరు చాలా ఇష్టం. ఎటు తిరిగి చదివినా అదే వస్తుంది. (Hannah)
నేస్తం గారూ కృతజ్ఞతలండీ..అవునా! మీరు అలా కాం గా ఉండగలరా!!!
సీతమ్మ గారూ, ఇటు మీ అన్నగారు కుశలమేనండీ...అటు మా రామన్నగారు ఎలా ఉన్నారు? అవును కానీ, మీకు బ్లాగ్ ఉందా అండీ? నన్ను అల్లొవ్ చెయ్యట్లెదు యెందుకని?
కుమార్ గారూ కృతజ్ఞతలండీ
ఎన్నేలమ్మా, మీ కామెంట్ నేను ఇప్పుడే చూసాను. సారీ. మీరు ఇంతకూ ముందు కూడా అడిగారు నాకు బ్లాగుండా అని. లేదండీ. మీ అందరివీ నావే.
సరే గాని, మీకు నా ఈమెయిలు అడ్రస్ ఉండే ఉంటుంది కదా కామెంట్స్చి నుంచి. నాకో మెయిల్ పంపండి ప్లీజ్.
అవును మీరు ఇండియా వచ్చారని, పోన్లో మాట్లాడారని, గిఫ్ట్ పంపారని కలవలేక పోయారని....మా అక్క చెప్పింది. ఈ సారి వస్తే తప్పకుండా ఓ వెంకటగిరి చీర పంపిస్తా లెండి.
జయ గారూ, అవునండీ వచ్చి వెళ్ళాను .
మీ కామెంటుకి చిన్న సవరణ...
గిఫ్ట్స్ తో అందరినీ కలుద్దామనుకుని , కలవనూ లేదు, గిఫ్ట్స్ ఇవ్వనూ లేదు.మాలా గారి నంబర్ దొరికింది లకీగా లాస్ట్ రోజున.ఆవిడతో మాట్లాడగలిగా హాప్పీస్.....అదన్నమాట.అవునా !నెక్స్ట్ టయిము చెప్పి వస్తాగా.....
ఎన్నాలమ్మ ఓ ఎన్నెలమ్మ!
ఎన్ని తిప్పలు పడ్డావమ్మా!
ఏడు సముద్రాలూ దాటి వేల్లావూ
తిరిగి ఏడు సముద్రాలూ దాటి వచ్చావా
మిగితాది ఫహున్ బునాన
మీ కాకు ఇంగేత
నేను వినీలుండ
అన్నా వినీలన్నా,
వర బొడు సుకురియ..నీ కవిత్వం సూపరసలు...
దివేహి మాట్లాడి ఎన్ని రోజులయ్యిందో..దివేహి పదాలు చూడగానే ఉత్సాహం పొంగి పోతోంది.
హన్నా ని కలిసి ఎంత హ్యాప్పీ యో చెప్పలేను.
ఓ స్త్రీ రేపు రా ఇంకా మా ఊళ్ళో హాలోవీన్ కూడా చదువు..నీకు ఉమక్క చనిపోవటం అవీ గుర్తున్నాయా?(పిచ్చి ప్రశ్న..ఎందుకుండవులే!!!) పాలు పంచ్ లో మన చిన్నప్పటి పాల సంగతులు ఉన్నాయి..
మీ కాకు ఇంగేత అని ఆడిగావు..మరీ అంత గుర్తుపట్టలేనా ఏంటి..
తొందరలో మాల్దివ్స్ డేస్ సిరీస్ వ్రాద్దామనుకుంటున్నా టైం చూసి...ఫోటోలు గట్రా సప్లై భాద్యత నీదే..ఉరియా మీహున్న సలాం బునచ్చే.
పద్మవల్లి గారూ, మీ కామెంటుతో మీ మెయిల్ ఐడీ రాదండీ!నా ఐడీ ennela67@yahoo.ca
మెయిల్ వ్రాయండి ప్లీస్..
మీరు వచ్చి వెళ్ళిన అలసట కూడా తీరిపోయుంటుంది. నేను తీరిగ్గా ఇప్పుడు కామెంట్ రాస్తున్నా. కొంచెం ఇబ్బంది, కొంచెం సంతోషం అన్నమాట. ఫిఫ్టీ - ఫిఫ్టీ. :) మీ కథ కూడా చదివాను. బాగుంది.
చాలా బాగా వ్రాశారు బాంకు కష్టాల గూర్చి...
నాకైతె వళ్ళు మండింది...వాళ్ళ నిర్లక్శ్యం చూసి...
అసలె మనకు శెలవు దొరకదు...వాళ్ళెమొ పెద్ద
వాళ్ళ డబ్బు మనకు ఇచ్చెస్తున్నట్లు ఫొజు....
ఈ సారి గాని విసిగిస్తె అంబుడ్స్ మెన్ కి పిర్యాదు
చెసెస్తాను...అంత ఫైరింగ్ ఇక్కడ......
థాంక్స్ శిశిరా, ఫర్వాలేదు, నేను పోస్ట్ కూడా లేట్ గానే వ్రాసాలే. అవును శిశిరా, ఫిఫ్టీ కష్టం ఫిఫ్టీ ఇష్టం..
శశికళ గారూ, కృతజ్ఞతలండీ.
//పెద్ద వాళ్ళ డబ్బు మనకు ఇచ్చెస్తున్నట్లు ఫొజు....
ఈ సారి గాని విసిగిస్తె అంబుడ్స్ మెన్ కి పిర్యాదు
చెసెస్తాను...అంత ఫైరింగ్ ఇక్కడ......//
ఇలా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా శశికళ గారూ? మా హన్నా కూడా మీ లాగే ఫయరయ్యింది..కానీ నేనే కొన్ని నీళ్ళు చల్లా...ఎందుకోచ్చిన్దిలే అని!!!
ఎన్నెలమ్మా..మనల్ని కస్తాపెట్టినోల్ల పేర్లన్నీ నోట్ చేస్కున్నా...అయిపోయరంతే..!!!
పోన్లెండి..నాన్న గారిని చూసేసారు గా...:))..
haaayigaa navuukuni relax kaavaalante mee post taruvaathe edynaa..
ennela peru baagaa catch chesaarandi..
marinni posts kosam waitstoo..
Thanks a lot punnami gaaru. vastoo undandi itu vaipuki.. mee kosamainaa konni kathalu wraayaalani undi
kiranu.. chesko chesko... nee personality choosi Dhaammani padipothaaru andaruu
Post a Comment