పిలచినా బిగువటరా......

Monday, January 24, 2011


మొన్నామధ్యనే సెయింట్ కాథరీన్స్ కి వచ్చామా? మొదటి వారమంతా ఇంట్లో పుణ్యాత్ములు గో రెయిలు(ఆకు పచ్చ రంగులో ఉండే ప్రత్యెకమైన బస్సులు, రైళ్ళు)  వరకూ దింపితే , గో రెయిలెక్కి బర్లింగ్టన్ లొ దిగీ, గో బస్సెక్కీ, సెయింట్ కాథరీన్స్లొ దిగీ మళ్ళీ సెయింట్ కాథరీన్స్ లో రెండు బస్సులెక్కీ, 2 కిలొమీటర్లు నడిచీ ఆఫీసుకి వచ్చేదాన్ని...మళ్ళీ వెళ్ళేటప్పుడు పుణ్యాత్ములు ఇంట్లో ఉండరు గనుక ఇంకో రెండు మిస్సిస్సౌగా బస్సులు అదనంగా యెక్కీఇంటికెళ్ళి హమ్మయ్య  అనుకోకుండానే .. సింకు నిండా అంట్లు...ఇంటి నిండా..బూట్లు, బట్టలు..చెప్పులు...తిని పడేసిన అప్పచ్చుల ప్యాకీట్లు కనిపిస్తే...గృహమే కదా స్వర్గ సీమ అని అనిపించక చస్తుందా చెప్పండీ....ఇక్కడ ఆఫీసులో బయల్దేరింది మొదలు ఆ స్వర్గ సీమ గురించీ తలచు కునీ తలచుకునీ దిగులు...ఏం చూడాల్సి వస్తుందో అని.......యేదో శిశిరం గాబట్టి సరిపోయింది గానీ శీతా కాలమయితే అయిపోదును..

వారం లోగ ఇక్కడ ఇల్లు దొరుకుతుందా అనీ వాకబు చేస్తే...శ్రీ లంకను తమిళుడెవరో ఇరుకు ఇరుకు అన్నారు..ఇరుకయితె వద్దులే బాబూ బాగా విశాలం గా ఉండాలి అన్నాన్నేను..తమిళ్ తెరియాదా!ఐ థాట్ యూ ఆర్ తమిళ్  .. అమ్మాసింగళ్ బెడ్రూం  అపార్ట్త్మెంట్ అవయిళబుళ్ అన్నాడు..హమ్మయ్యా అనుకుని తట్టా బుట్టా సర్దుకుని రెండు వారాల తర్వాత వచ్చి పడ్డాను పిల్లలతో సహా. అసలు వచేటప్పుడు ఏమనుకున్నాం? నేను పిల్లల్తో ముందర వచ్చెస్తే వారు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారని...రోజూ చెవిలో గూడు కట్టి పోరాను..ట్రాన్స్ఫర్ మహా ప్రభో అని...యీ లోపు ఏదో చదువు కోర్స్ మొదలయింది...క్లాసులు అక్కడికి దగ్గర..దాంతో...నేను కట్టిన గూడు చెవిలో వెలాడుతూ అందరికీ కనిపిచడం తప్ప నా పోరు ఎవరికీ వినిపించడం మానేసింది. 

ఇది డవును టవును. మా ఇంట్లో అందరికీ యీ పేరు చెబితే హడల్...ఇరుకు రోడ్లు, అర్థం పర్థం లేకుండ ఉన్న రోడ్డు రూల్స్, మీద మీదకొచ్చే ట్రాంలూ.బస్సులూ .వింత వింత చేస్టల నల్లీయులు...రెండు డాల్లర్లున్నాయా అని ఇస్టయిల్ గా అడుక్కునే వారు, పార్కింగ్ ఎక్కడ చెయాలో అని కూడా అలోచించడానికి వీల్లేని సందులు, కళ్ళు తిరిగి పడిపోయే పార్కింగ్ రేట్లూ, యెవరు పొరపాటున రాంగ్ పార్క్ చెస్తారా అని చూసి చిటుక్కుని టికట్ పెట్టే ట్రాఫిక్ పోలీసులు.ఇంకా ధైర్యస్తులు ఎవరైనా బండి ఏమరి పాటుగా వదిలేస్తే మోసెయ్యడానికి తయారుగా ఉన్న టొయింగ్ ట్రక్కులూ...ఇవన్నీ డవును టవును పేరు వినగానే 70 ఎం ఎం లొ కనిపించి..వంటికి చమట తెప్పిస్తాయి సదరు తలచుకున్నవారికి...

ఆ భయిపించే డవును టవును కాదు ఇది అని ఇంట్లో వాళ్ళని (??) ఒప్పించాలెండి..
నాకయితే ఇది ఒక పల్లెటూరు...చుట్టూ నాలుగు బాంకీలు..తెగ మురిసిపోయాను......హవుసు క్లీనింగ్-నొ ఫెస్టివల్ అని మున్నా భాయి గారు   ఊరికే అన్నారా?  బాంకీలుండగానే సరా, బ్యాంకీలలో వెయ్యడానికో తియ్యడానికో..తయిలం ఉండాలిగా. పోనీలే అలా చుట్టూ బాంకీలుంటే ఎప్పటికయినా రిచ్ అయి పోవచ్చని రోజు బ్యాంకీ లని   చూస్తూ ఉండడం అలవాటు చేసుకున్నా.పైగా  అమ్మకి ఇష్టమైన బంతి , చామంతీ కనిపిస్తాయి ఎటు చూసినా....ఎటొచ్చీ నచ్చనిదల్లా అపార్టుమెంటు బయట రోడ్డుకిరుపయిపులా  పార్కింగ్ మీటర్లు ఉన్నచిన్న చిన్న   స్థంబాలు  ...ఎంత అని చూసా మీటరు మీద రేట్లు...తరవాత ఎందుకు చూసానా  అని స్పృహ వచ్చాక బాధ పడ్డాననుకోండీ...కానయితే ఏంచేస్తాం....టూ లేటు ...
ఇక్కడ పచారీ కొట్టు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. అందులో తిను బండారాల కంటే బట్టలు ఎక్కువ అమ్ముతారు. అంత దూరం నడవద్దు .నేను ప్రతి వారం సరుకులు ఇచ్చిపోతాలే అన్నారు...అవసరానికి  పాలు కొంటే రెండు సార్లు విరిగిపోయాయి...బ్రెడ్డు కొంటే కొంచెం కొంచెం మరకలొచ్చాయి. వారికి టెన్షన్..నేను పిల్లలు అక్కడ కొన్న వస్తువులు తింటామేమో అని ...అక్కడేమీ కొనకు అని ఎక్కువ మొత్తం లో సరుకులు తెచ్చేవారు ...సరే ప్రతి శని వారం వచ్చేవారు...కానీ ఒక పది నిముషాలుండగానే ..సరే ఇంక వెళుతున్నా అంటారు.యీ ఉన్నఅర  గంట  లోపలే పార్కింగుకి వేసిన రెండు డాలర్ల కాయిను సరిపోతుందో లేదో అని పది సార్లు అనుమానం..అయ్యొ రామా...వంట చేసేసా తిని వెళ్ళండీ అంటే...బాక్స్ లొ సర్ది ఇచ్చెయ్యి ఇంటికెళ్ళి తింటా అంటారు...నాకు పిచ్చెక్కి...ఇది ఇల్లు కాదా అని గొడవపడ్డాను కొన్ని సార్లు... వాడెవడొ చెప్పాడుగా ఇరుకు ఇరుకు అని...ఇక్కడ నించోడానికీ కూచోడానికీ లేదు..నాకేంటొ హోటల్ రూం కొచ్చినట్టుంది...హాస్టల్ రూం లాగ ఉంది ..ఇంకా పొతే హాస్పిటల్ రూం లా ఉంది అని వెళ్ళి పోతారు..పోనీలే, డే వన్ నుంచీ ఇక్కడ లేరు కదా..పయిగా పార్కింగ్ బోల్డు ఖర్చు .అలా అనిపించడం సహజమే అనుకున్నా.
ఒక రోజు..పిల్లలు చదూకోటానికి  వీలుగా లేదు నాన్నరూ అని చిన్ని కంప్లైంటు చేసారు ...వెంటనే వాల్మార్ట్ అడ్రెస్సు కనుక్కుని స్టడీ  టేబుల్ కొనుక్కొచ్చారు...టేబులంటే టేబులు కాదు అన్నట్లు 120 ముక్కలు ..అవన్నీ అతికించి  జిగ్సా పజిల్ లా గా అమర్చేటప్పటికి చిన్న కుటీర పరిశ్రమ పెట్టిన ఫీలింగ్ ఇంట్లో. నాలుగైదు గంటలు పట్టేసింది కార్నర్ టేబుల్ ఫిక్స్ చెయ్యడానికి...హమ్మయ్య ఈ వంకతో నయినా ఉన్నారు అని ఆనంద పడబోతున్న దాన్నల్లా ఆగిపోయాను. . అపార్ట్మెంట్ లో ఎవరో మగానుభావులు (మీరు కరెక్టుగానే చదివారు...అచ్చ్హు తప్పు లేదు) టోస్టు చేసుకునే సదుద్దెశ్యం కలిగి టోస్టరులో బ్రెడ్డు ముక్కలు పెట్టి యే కారణము చేసనో ( నా దురద్రుష్టము కారణము కావొచ్చు)...ఆకలి మరిచి బయటకు అరుదెంచిరి....పొగలు ఎల్లెడల వ్యాపించ ఫయరు అలారమ్ము...టింగు టింగు మని సన్నని చిరు గంటల సవ్వడి  వలె మొదలై గుడి గంటల వలె వినబడి, తుదకు కర్ణ భేరికి చిల్లు పడునంత సందడి చేసినది.. వెంటనే అందరునూ ఇల్లొదిలి భవనమునకు ఐదు వందల మీటర్ల దూరమున నిలువవలెనని హెచ్చరిక....ఫయరు ఇంజిను వచ్చి..అన్నీ సర్దు మణగుటకు అక్షరాలా తొంబది తొమ్మిది నిముషములు పట్టినది...ఇచట అతి సహనవంతులయిన మనుష్య జాతికి ఇది యొక మంచి పరీక్ష. ఇచట నీతి ఏమంగా సహనము లేని వారు ధన్యులు సుమతీ...అనగా భోజనము చేసి ఒక గంట తరువాత ఆఫీసుకి వెళ్ళవలసిన వారు కాస్తా యీ తొంబది తొమ్మిది నిముషములు ధాటికి నిలువలేక ఇంటికి పోయి తినెద పొమ్ము అని సెలవిచ్చి మిస్సిస్సాగా కు పయనమయిరి.

అప్పటి నుండీఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టమయినా ఎన్ని ట్రిప్ లయినా మా ముగ్గురినీ మిస్సిస్సాగా తీసుకెళ్ళి పది సార్లు దిమ్పమన్నా దింపుతారు కానీ సెయింటు కాతరిన్స్ లో ఉండమంటే మాత్రం ఊహు....బెట్టీ భాయపెట్టిన్దా అని నాకు అనుమానం కుడా...మాకు కూడా అక్కడికి వెళ్ళడం ఇష్టమే కానీ....వారు రావాలి తీసుకెళ్ళాలి, మల్లీ వచ్చి దింపి వెళ్ళాలి.... బోల్డు టయిము వేస్టు ఇంకా డబుల్ శ్రమ కదా? వారికున్నా బిజీ షెడ్యుల్ లో అంత కష్ట పడే అవసరమేంటీ ..అని..
అవన్నీ కాదు లెండి కానీ...ఎందుకో ఈ ఊరు వారికి నచ్చలేదు...ఇక్కడికి ఇంతకూ ముందు వస్తున్నప్పుడు కూడా  గమనించాగా... హయి వే అంతా ఓకే..ఊరికి చేరే ర్యాంప్ ఎక్కగానే మన మూడు ఖరాబ్ అయిపోతుంది...ఏంటీ అంటే..ఏమీ లేదు..మాట్లాడకు...క్వయిట్..ఖాముష్...నిశ్శబ్దం....ఆ సయిలెన్సరు మళ్ళీ మమ్మల్ని దింపి  తిరిగి ' వెళ్ళిపోతున్నాను' అని చెప్పేవరకూ కంటిన్యూ అవుతుంది..ఆ ఒక్క మాట మాత్రమే నిశ్శభ్దాన్ని చేదిస్తుంది...నా మవుతు యధావిధిగా వయిడు ఓపెను...మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేరాను అని ఫోను రింగ్ అయ్యేవరకూ

కొన్నాళ్ళకి ఈ  అపార్ట్మెంటులో టూ బెడ్రూం అపార్ట్మెంటు ఖాళీ అవుతోంది .  కానీ దాదాపు నెలకి 300 ఎక్కువ. వారికి ఫోను చేశా. ఫరవాలే తీసుకుందాం అన్నారు. అనుకున్న రోజుకి రెండు రోజులు ముందు గానే ఇల్లు ఖాళీ అయింది.. పిల్లలు నేను కలిసి ఒక రోజు ముందుగానే ఇంట్లోకి మారి పోయాం .ఇంక నాన్నని  సర్ప్రయిస్ చేద్దమా అని గొప్ప ప్లాన్ చేసుకుని వస్తారా అని పోను చేసాం...సరే శనివారం వచ్చారు...
టూ బెడ్రూం ఇల్లు చూసి తెగ ఇదయి పోతారనుకున్నానా. పచారీ సామాన్లు పడేసి   తిరిగి బయటికి వెళ్ళే లోగా..మా కారుకి ముందరున్న కారు పచ్చడి పచ్చడి అయ్యి కనిపించింది..ఏంటీ అంటే, బస్సు గుద్దేసిందిట..ఇంకా అద్రుష్టం అని తలచుకుని..కొంచెం షేక్ అయ్యి..ఇంటికి పరుగో పరుగు ఇంక ఆ పచ్చడిని చూసిన వాళ్ళెవరైనా అక్కడ పార్కింగ్ చెయ్యగలరా?..అప్పటి నుంచీ పార్కింగ్ టెన్షన్ ..అవున్లే అని సరిపెట్టుకున్నా
మా రేడియో స్టేషను (మా ఆఫీస్)  ఇక్కడికి పది నిముషాల నడక..నాకు పార్కింగ్ ప్లేస్ అలాట్ అయ్యింది..బోల్డు సంతోష పడిపోయా....యీ సారి నుంచి ఆఫీసు దగ్గర  బండి పెట్టుకోవచ్చు.

ఒక శనివారం సందె కాలం పచారీ సామాన్ల బండి వచ్చింది...(మరి ఇంత కంటే ఏం పేరు పెడతామండీ!).అప్పటికే  మంచు మొదలయ్యింది..పొగ మంచు కి దారి కూడా సరిగ్గా కనిపించట్లేదు...రోడ్లన్నీ స్లిప్పరీగా ఉన్నాయి..అయ్యో డ్రయివింగు కష్టం అవుతుందేమో  అని ఫీల్ అవుతున్న బలహీన క్షణాల్ని అదను చూసుకుని మేము ముగ్గురం  దెబ్బకొట్టేసాం....
అలా   అలా ఒప్పించి  ఉండిపొమ్మని తెగ మొహమాటం పెట్టేశాం ముగ్గురం కలిసి...ఏదో కొల్పోయినట్టు మొహం పెట్టి సరే అన్నారు..మేము ముగ్గురం హుర్రే అని మనసుల్లో పండగ చేసుకున్నాం..రెండు వరకు నలుగురం సినిమా చూసాం .రాత్రి రెండింటికి కొన్ని డయిలాగ్స్ గందర గోళం గా వినిపించాయి.టీవీ కట్టలేదేమో అని చెక్ చేసాను. ..కానీ పరీక్షగా చూస్తే ఇది ఇంట్లోంచి కాదు...గబ గబా..మంచం పైకెక్కి కిటికీ లోంచి బయటికి చూసాను...(కిటికీలు ఎత్తులో ఉన్నాయి)..బయట 200 దాకా స్టూడెంట్స్ ఉన్నారు...సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులూ...ఒక పిల్ల గట్టి గట్టిగా అరుస్తోంది...పోలీసులు ఆ పిల్లని అరెస్టు చేసి తీసుకెళ్ళారు..ఒక గంటకి అంతా సద్దు మణిగింది..నేను అందరూ వెళ్ళే వరకూ కిటికీకి వెళ్ళాడుతూనే ఉన్నా....ఇంకో అరగంట కల్లా మళ్ళీ బయట నుంచి ఫ్లాష్ లయిట్ల వెలుగులు..మా పయిన అపార్ట్మెంటులో పరుగులు హడావిడీ...పొద్దున్న ఎవరిని అడిగినా 'మాకు తెల్వద్'  అని జవాబు..పోనీలే మనకెందుకు అనుకున్నా కానీ...చ్చ చ్చా పాడు కొంపా అనే కాక, పాడు మనుషులూ, పాడు రోడ్లు, పాడు ఊరు, పాడు ఉద్యోగం.....ఇలా అన్నీ మనకి పాడునవే కానీ ఆడునవి కనిపిచకుండా పోయాయి.యీ లోపు నా ఆరు నెలల కాంట్రాక్టు అయిపోయింది....పోనీ యీ పాడు-ఆడు గొడవ వదిలెసి వెనక్కి వెళ్లి పోవడానికి పిల్లల చదువులు అడ్డమోస్తున్నాయి.ఇంకో నాలుగు నెలలు యీ పాడు- ఆడులతొ ఆటలు తప్పవు.అప్పటి వరకూ ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ ...ఇంక ఇష్ట్మయినా కష్టమయినా మేము వెళ్ళడమే గానీ వారిని ఇక్కడ ఉండమని అడిగే దమ్మూ ధయిర్యం మేము ముగ్గురమూ కోల్పోయాం....’ టైటిలు’ సాంగ్ మాత్రం తరచూ గుర్తొస్తుంది....
...ఔరౌర....భళిరా.......!!!!!!!!!

19 వ్యాఖ్యలు:

Unknown said...

హ్మ్ ఇలా అనచ్చో లేదో నాకు తెలిదు కాని ఎన్నెల గారు .. నాకు మాత్రం మీ పరిస్తితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది .. త్వరగా మీ అందరు కలిసి ఒకే ఇంట్లో ఉండాలని మనస్పూర్తిగా దేవుడికి నేను దణ్ణం పెట్టుకున్టానే

ఇందు said...

Ennela garu..chala baaga raasaaru.mee badhalu chebutune konchem hasyangaa....inkonchem chamatkarangaa..wow! chala bagundi post eppatilage....

naku oka line baga nachindi....ade meeru fire alarm ni describe chese line :))) chirugantala savvadi...gudgantalu lagaa....ani hahhahahaha.....meeru sooperb writer andi :)

Mee kashtalanni teeripoyi meeru malli ee padu ooru rakunda undali ani korukuntunna :)

మనసు పలికే said...

హ్మ్..:((
ఎన్నెల గారు, కావ్యతో పాటే నేను కూడా గాట్టిగా కోరుకుంటున్నానండీ.

అశోక్ పాపాయి said...

హ హ హ హ హ హ.........మేము వెళ్ళడమే గానీ వారిని ఇక్కడ ఉండమని అడిగే దమ్మూ ధయిర్యం మేము ముగ్గురమూ కోల్పోయాం...టైటిలు సాంగ్ మాత్రం తరచూ గుర్తొస్తుంది.......ఔరౌర....భళిరా.....సీతయ్యని ఎదిరిస్తే ఏం కాదు మరి అలా చెయ్యకపోతే గృహమేకదా స్వర్గసీమ అనుకోని భాధపడుతు ఇంకా సర్దుకుపోవల్సిందే..:))

అశోక్ పాపాయి said...

అవును నవ్వుకున్న కాని కొంచెం భాధ కూడ ఉంది..నిజం చెప్పాలంటే ఆఫిసులో పని చేసుకోని వచ్చాక ఇంట్లో కొంచెం రిలాక్స్ అవుదామంటే బయట వుండే గోల మాటల్లో చెప్పలేం..నేను త్వరలోనే సీతయ్యకి చెపుతానులే మీరు భాధపడక కొంచెం నవ్వుదురు..:)))

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఒక్క మాటలో చెప్పాలంటే Brilliant. ఇక మీకు ఎదురులేదు. ఇల్లాగే రాస్తూ ఉండండి.
Our sweetest songs are those that tell us of saddest tales అన్నారు Wordsworth or Keats or Shelly గుర్తు లేదు. కష్టంస్ తరువాత సుఖమ్స్ అన్నమాట. Hope your problems will be solved soon.

Sasidhar Anne said...

ennela garu, post comedy ga vunna.. aa comedy kosam meeru paduthunna kastalu chusthunte badha ga vundi.
ila separate ga vundatam chala kastam and at the same time benga ga kooda vuntundhi.
Twaralone mee setayya garu , mee mata vinali ani korukuntunna.

Downtown gurinchi nenu vinna, maa freinds new york lo vunnaru.vallu chepthuvuntaru.. ilanti news anni.

kiran said...

అయ్యయ్యో ...ఎన్నెల గారు...
ఎంటండి...మనిద్దరికీ ఇన్ని కష్టాలు... :)
నేను కూడా ప్రార్థనలు doing ...ఇందు,కావ్య,అప్పు ల తో కలసి.. :)..అక్కడక్కడ మీ స్టైల్ వదలలేదు..mouth wide open ...హహ్హహ :)

శివరంజని said...

అయ్యయ్యో ...ఎన్నెల గారు. మీ కష్టాలు పోవాలని మేము ప్రార్ధిస్తాము కాని మీరు మాత్రం మమ్మల్ని నవ్విస్తూ ఉండండి

మాలా కుమార్ said...

పాపం ఎన్ని కష్టాలండి మీకు పాపం . . . పాపం .
అవునూ మీ బర్త్ డే అయ్యిందా ? మమ్మలిని పిలవనే లేదు . ఎప్పుడైంది ?
హాపీ బర్త్ డే కొంచం ఆలశ్యం గా .

Ennela said...

కావ్య, అపర్ణ, కిరణ్ మీ ముగ్గురికీ కృతజ్ఞతలు ."ప్రార్థనలు doings" కి బోల్డు థ్యాంకులు .నాకు టైటిల్ సాంగు పాడీ పాడీ ఇంక బోర్ కొట్టేసింది..శాంతి నివాసం పాటో, యీ చల్లని లోగిలిలో అనో పాడుకుందామనిపిస్తోంది...కానీ చూడబోతే తొందరలో... కుశలమా, నీవు కుశలమేనా ....పాట పడేట్టుంది.చూడాలి ఏంజరుగుతుందో...అంతా దేవుడి దయ...


ఇందూ, అవునండీ...యీ ఫయిరు అలారమ్ము ఎన్ని హొయలు పోతుందనుకున్నారూ!..చివర్న గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది...ఆ సౌండు ఎఫెక్టుకి..ఆదరా బాదరా కట్టుబట్టలతో బయట నించోడం ఒహటీ...కృతజ్ఞతలండీ..


అశోక్...అవును...అపార్ట్మెంట్స్ తో అదే ప్రాబ్లం...
సీతయ్యతొ మాట్లాడేయండి మరి తొందరగా...మీరు రికమెండ్ చెస్తున్నందుకు కృతజ్ఞతలు..


సుబ్రహ్మణ్యం గారూ కృతజ్ఞతలండీ..అవునండీ,ఇప్పుడు కస్టంస్ తర్వాత సుఖంస్ సీన్ కొసం వైటింగ్స్....

శశీ కృతజ్ఞతలు....తప్పమ్మ,.మీరు మరీ అంత పెద్ద కోరికలు కోరుకుంటే, దేవుడికి కోపం వస్తుంది...'ఇంకో మాట చెప్పు బాబూ' అని మీతో బేరమాడుకుంటాడు కూడ!..పాపం దేముడు...ఆయనకీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా!

శివరంజని గారూ, కృతజ్ఞతలు...హహాహ..అదే నా ప్రయత్నం...

మాలా గారూ...కృతజ్ఞతలండీ...అబ్బే, సెలెబ్రేషన్స్ ఏమీ లేవండీ...ఉంటే మిమ్మల్ని పిలవనూ? కానయితే...బోల్డు శుభాకాంక్షలూ, దీవెనలూ వచ్చాయి...అదే కదా కావాల్సింది...మీ అభినందనలకి ధన్యవాదాలు.

Sasidhar Anne said...

శశీ కృతజ్ఞతలు....తప్పమ్మ,.మీరు మరీ అంత పెద్ద కోరికలు కోరుకుంటే, దేవుడికి కోపం వస్తుంది...'ఇంకో మాట చెప్పు బాబూ' అని మీతో బేరమాడుకుంటాడు కూడ!..పాపం దేముడు...ఆయనకీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా!

ante mana sitayya.. chivariki devudi mata kooda vinaru annamata.. aithey NBK Parama veera chakra chupidhamu.. appudu tappakunda oppukuntaru anukunta :)

Ennela said...

శశీ, మీరు మన అశోక్ బాబూ కలిసి మార్చేసేటట్టే కనిపిస్తోంది .....అలాగే కానిద్దాం...అపాయింట్మెంట్ బుక్ చెయ్యనా? వీసా తీసుకోండి..తొరగా

Anonymous said...

ఉంటారు ఎన్నెల గారు,తప్పకుండా ఉంటారు.మీరు,పిల్లలు,మీవారు...ఒకే ఊరిలో,ఒకే ఇంటిలో కలసిఉంటారు.

నీహారిక said...

ఎన్నెల గారు,
నన్ను రమ్మని అడగవచ్చు కదా? మీ ఇల్లు రమ్యంగాకుటీరం లా చేసిపెడ్తాను.

Ennela said...

అను గారూ కృతజ్ఞతలండీ, ఇంకో నాలుగు నెలలండీ.పిల్లలకి స్కూల్ అయిపోతుంది..మేమే వెళుతున్నాము ప్రస్తుతానికి..

నీహారిక గారు కృతజ్ఞతలండీ..వచ్చేయండి మరి..
అయినా కుటీరం రమ్యంగానే ఉందండీ..ఊరే నచ్చలే...

కౌటిల్య said...

వామ్మో! ఆ అమరుక దేశాన ఇన్నిబ్బందులా! మేము వెళ్ళకూడదని నిర్ణయించుకుని మంచి పనే చేసితిమన్నమాట!ఇక్కడ హాయిగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటుంటిమి....

మీ నారేషన్ సూపరు....

Ennela said...

కౌటిల్య గారు కృతజ్ఞతలండీ...అమ్మో, అంత భయపెట్టానా? డౌన్ టౌన్ మాత్రమే ఇలా అండీ..కొన్ని ప్లేసెస్ చాల బాగుంటాయి.ఇది కూడా ఉంటూ ఉంటే బానే అలవాటు అయిపోతుంది మన బోంబే లాగా, కానీ మా సీతయ్య గారికి నచ్చదు అంతే..
మీరు వచ్చెయ్యచ్చండీ...డాక్టర్లకి బాగుంటుంది (ట)....మేము అమెరికా కాదండీ...కెనడా...

సుజాత వేల్పూరి said...

సింబుళ్గా చెప్తానంటే ఇంటే ఇంత సింబుళనుకోలేదు సుమండి! ఇంతా చేసి ఎక్కడ ఆ పాటెక్కడ అనుకుంటూ వెదుకుతూనే చదివా మొత్తం! చివరాఖర్న దొరికింది. :-))