అదృష్టం తలుపు తట్టింది

Wednesday, March 16, 2011



చిన్నప్పుడు స్కూల్ లయిబ్రరీ లో ఉన్న చిన్న చిన్న కథల పుస్తకాలు, అప్పుడప్పుడు చందమామలు, బాల మిత్రలు తప్ప నాకు చిన్నప్పటి నుంచీ పెద్ద పెద్ద కథల పుస్తకాలు, పేరొందిన నవలలు  చదివే అవకాశం రాలేదు (మీరు నమ్ముతారు లెండి).  కొందరు మిత్రుల పుణ్యమాని యీ మధ్య ముళ్ళపూడి గారి రచనలు, బారిస్టరు పార్వతీశం (మ్యాడీ గారి బ్లాగులో) చదవగలిగా.

ఎవరైనా పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు " అయ్యో నేను చదవలేదే, ఇక్కడ ఎలా దొరుకుతాయి? యీ సారి భారత్ వెళ్ళినప్పుడు తప్పకుండా తెచ్చుకోవాలి" అని ప్రతీ సారీ అనుకుంటూ ఉంటా. మంచి పుస్తకం అని ఎక్కడైనా చదివినప్పుడల్లా ఆ పుస్తకాన్ని నా లిస్టులో చేర్చుకుంటూ ఉంటా.   ఎవరైనా బోల్డు పుస్తకాలు చదివామని చెపితే, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆరాధనగా ఉంటుంది..అబ్బా ఎంత అదృష్టం అనుకుంటా. అల్లాంటి కలలు గన్నఅదృష్టం నాకు వచ్చింది. మిస్సిస్సాగా వచ్చి,  మా రావు గారితో పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం లో 'స్వీట్ హోం' లో పిల్లవాడి గురించి ప్రస్తావించి, 'మీరు స్వీట్ హోం చదివారా' అని అడిగారు. 'నేను పుస్తాకాలేమీ చదవలేదండీ అసలు' అని కొంచెం విచారం వ్యక్తం చేసాను. సాయంత్రం కల్లా రంగ నాయకమ్మ గారి "స్వీట్ హోం" 3 భాగాలూ, శరత్ గారి "పరిణిత", "నిష్కృతి", చలం గారి" స్త్రీ", "మైదానం", విశ్వ నాధుని "వేయి పడగలు", శంకరమంచి సత్యం గారి "అమరావతి కథలు", బీవీఎస్ రామారావు గారి  "గోదావరి కథలు", పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి "మహనీయుల చతురోక్తులు" తెచ్చిపెట్టారు. ఇంక నాకు పండగే పండగ!కంప్యూటర్, చాటింగ్, ఫోనింగ్, బ్లాగింగ్, వాగింగ్ అన్నీ మానేసి, జాబ్ అప్లికేషన్స్ కూడా పక్కన పడేసి, కొత్త బిచ్చగాడి టయిపులో చదివేస్తున్నా!

పతి, సుతుల్,బంధువుల్,స్నేహితుల్ పదాలు కూడా కొంచెం పక్కన పెట్టేసి, పుస్తకాల వెంట పరుగులు తీస్తున్నా !తప్పదు కాబట్టి వంట ఒక్కటీ చేసి-పడేస్తున్నా (లిటరల్ గా) . మా సీతయ్య అసలు 'త్రీ రోసెస్' టయిపు.  వంట చేస్తే రంగూ రుచి వాసనా అన్నీ బాగుండాలి. కొన్ని సార్లు రంగుదేముందీ
రుచి బాగుంది తినెయ్యండీ అంటే, ' చస్! నో వే!' అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. భోజనం రుచిగా వండటంతో పాటు ప్రెసెంటేషన్ ఇంపార్టెంట్ అని ఆయన ఉద్దేశ్యం.   మనదేమో కావలసినంత అన్నం ఒకేసారి పెట్టుకుని దానిమీద పప్పో, సాంబారో, పులుసో  పోసేసి,  కూరా, పచ్చడి, పప్పు అని తేడా తెలీకుండా కలగా పులగంగా తినే బ్యాచ్.  యీ పుస్తాకాలొచ్చాక కలలో ఇలలో కూడా హస్త భూషణం లేకుండా నేనెవ్వరికీ కనబడట్లేదు. మరింక చదువుతూ వంట చేస్తుంటే , రంగుంటే- రుచి లేదు, రుచి ఉంటే -చిక్కదనం లేదు అనిపించే చవక బారు టీ  లాగా ఉండక, 'రంగు-రుచీ-చిక్కదనం త్రీ రోసెస్' లా ఎలా ఉంటుంది చెప్పండి? అందుకన్నమాట వండి తినడం బదులు వండి పడెయ్యడం...కాకపోతే   ఇలాంటి సందర్భాల్లో తినగలిగేలా వండడం ఎలా కుదురుతుందండీ? ? మీరు అర్థం చేసుకున్నారు కదా నాకు అంతే చాలు.  

పిల్లలెప్పుడైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ,పిలిచినప్పుడు పలక్కపోతే ఒక్క చరుపు చరిచి మరీ 'అంత పరధ్యానమేంటీ' అని ఉరుములు ఉరిమే నన్ను ప్రస్తుతం పుస్తక పఠనం లో సమాధి స్థితిలో ఉండడం చూసి  "ఏంటమ్మా ఇలా అయిపోయావూ " అని దీర్ఘాలూ, కొమ్ము దీర్ఘాలూ తీస్తూ నిట్టూరుస్తున్నారు. నేను మాత్రం ఎవరినీ కేర్ చెయ్యకుండా నా కలాపోసన చేసుకుంటున్నా..ఆఖరికి   మొన్న ఇంటర్వ్యూ కి   వెళ్ళినప్పుడు కూడా వెయిటింగ్ టయిములో చదువుకోవచ్చని అన్నిట్లో చిన్ని పుస్తకం చూసి బ్యాగులో పెట్టేసుకున్నా . చూసే వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ లో  "పరిణిత" మీద క్వశ్చన్లు అడుగుతారేమో, పరీక్ష ప్యాసు అవాలంటే యీ మాత్తరం చదవాలేమో అనిపించేట్టు ఒక్క నిమిషం కూడా  వృధాచెయ్యలేదు.

"ఇంకా కొన్ని  ఉన్నాయండీ పుస్తకాలు, వెతికి ఒక చోట పెడతా   కావలసినన్ని తీసుకోండి.  ఇవి అవగానే చెప్తే అవీ తెచ్చిస్తా" అని రావు గారు చెప్పగానే, "నా భాగ్యమే భాగ్యమూ" అని నేనున్నూ ,పుస్తకం చదువుతూ "కనిపిస్తే కాల్చేస్తా" అని మా వారున్నూ ఎవరి ఫీలింగు వాళ్ళు ఫీలేసుకున్నాము.ఇలా మా ఫ్యామిలీ వెతల్..నా కతల్..మూడు పుస్తకాలు ఆరు కథలు గా సాగుతున్నాయి.  

ఇందుమూలంగా సమస్త స్నేహ గణానికీ తెలియ చేయునదేమనగా..నేను కొన్ని రోజులుగా కనిపించక, వినిపించక పోతున్న కా"రణం"బిదియే. "ఉన్నావా అసలున్నావా" అనీ, "కనిపించక పోవ కారణమే మమ్మా" అనీ మెయిల్సు, కామెంట్లూ పెట్టిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు. మీ అందరి పోస్టుల మీదా రోజూ ఒక క్విక్  లుక్కేస్తున్నా. కానీ కామెంటట్లేదంతే.  మరి మీలో ఎవరికైనా పైన లిస్టులో పుస్తకాలు చదవాలనిపిస్తే, వెంటనే మా ఇంటికొచ్చెయ్యండే! ఆరు బయట మంచులో, గొంగళీ  కప్పుకుని పుస్తకాల సిలబస్ డిస్కస్ కూడా చెయ్యొచ్చు ఎంచక్కా! మీరు పుస్తకం చదివి వినిపిస్తుంటే ,మీ కోసం వేడి వేడి పకోడీలు చేసి పెడతాలెండి. ఇంక ఎందుకాలస్యం ?మీరొచ్చెయండి మరి , గొంగళ్ళు నేను సప్లయి చేస్తాగా! 

37 వ్యాఖ్యలు:

Anonymous said...

నేను వచ్చేస్తున్నా :)

కృష్ణప్రియ said...

Nice... Enjoy reading!!

ఇక 3 Roses కేముంది లెండి.. మా ఇంట్లో అయితే ముందే చెప్పా.. అన్నీ ఒక్కసారే చేయాలంటే కష్టం. చేయలేను.. ఒక్కో వారం ఒక్కోటీ కుదిరేలా వండుతా అని ;-)

లత said...

త్రీ రొజెస్ కాన్సెప్ట్ మా ఇంట్లొ కూడా ఉందండి ముందు చూపులకే బాగుండాలి.
పుస్తకం దొరికితే అంతే చదివేదాకా నిద్రపట్టదు ఎంజాయ్ చెయ్యండి

చెప్పాలంటే...... said...

నేను వస్తున్నా.......రమ్మంటారా మరి :) బావుంది టపా!!

చెప్పాలంటే...... said...

నేను వస్తున్నా.......రమ్మంటారా మరి :) బావుంది టపా!!

kiran said...

ఎన్నెల గారూ... :):)
నాకు పోస్ట్ నచ్చేసింది..!!
నేను కమింగ్ ఇంటికి...:)
నన్ను అభిమానించడం మొదలెట్టేయండి.. :P ...మీ టైపు లో నేను ఈ మధ్య పుస్తకాలు చదవడం మొదలెట్టేసా.. :)

తృష్ణ said...

హ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్........అంటే ఇది సుదీర్ఘమైన నిట్టుర్పన్నమాట. కానీ ఆనందకరమైనదన్నమాట.(నిట్టూర్పుల్లో కూడా రకాలుంటాయని తెలుసుకోవాలన్నమాట..:))

ఇవాళ పొద్దుటే మిమ్మల్ని తిట్టుకున్నా.నిఝంగా. రోజూ వ్యాఖ్యలలవాటు చేసేసి నెమ్మదినెమ్మదిగా రాయటం మానేసిన పాత మిత్రులలాగ మీరు కూడా నెమ్మది నెమ్మదిగా మానేస్తున్నారు. అలవాటు పడిన కళ్ళు వ్యాఖ్యలకు వెతుక్కుంటున్నాయి...అందరిలాగే మీరూనా...అని..!! ఇదన్నమాట కారణం...మ్మ్మ్మ్మ్..(ఇది వేడి నిట్టూర్పు..:) )

మీరే నయం చక్కగా...(ఇది పొగడ్త కాదు కుళ్ళన్నమాట...)నా దగ్గర కొనిపడేసి చదవాల్సినవి
ఎన్ని ఉన్నాయో...:(

కంది శంకరయ్య said...

బారిస్టరు పార్వతీశం (మ్యాడీ గారి బ్లాగులో) ..... అన్నారు. దయచేసి ఆ లింకు ఇస్తారా?

మనసు పలికే said...

నేను భీ వచ్చేస్తున్నాది హై..;)
>>ఎవరి ఫీలింగు వాళ్ళు ఫీలేసుకున్నాము.
kevvvvv :D

శిశిర said...

:)

సుజాత వేల్పూరి said...

ఇన్ని పుస్తకాలొచ్చి ఒళ్ళో వాలితే అది అదృష్టం కాక మరేమిటవుతుందమ్మా, చోద్యం కాకపోతేనూ! హాయిగా ఇష్టమైన పుస్తకం చదువుకోవడంలొ మునిగి ఉన్నపుడు ఇంద్రుడొచ్చి స్వర్గానికి బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చి రమ్మన్నా "చేయి ఖాళీ లేదు, రేపు రా పో" అని పంపేస్తా!

మీ అదృష్టానికి అభినందనలు

..nagarjuna.. said...

ఒక్కసారే అన్ని బుక్కులు సదువుతున్నవా ఎన్నెలమ్మా ! నువ్వు శానా గ్రేట్ పో ఇగ. [ కాని మా సీతయ్యను, పిల్లలను తల్సుకుంటెనే కొంచెం పరేషాన్ ఐతుంది ఏం తింటున్రో ఎట్ల ఉందవడ్తుర్రో ]

సరేగాని ఆ హస్తభూషణం చేత్లనే పట్కోని గా బారిష్టర్ పార్వతీశం లింకు ఓసారి ఇయ్యి [ మ్యాడి అనే బ్లాగర్ ఉన్నారని తెలుసు కాని బ్లాగు అడ్రస్ యాద్‌మర్శిన :( ] నేను గుడ్క సదువుత

Ennela said...

శంకరయ్య మాస్టారూ,

మాడీ గారు నా పిచ్చమ్మ-పిచ్చితల్లి పోస్టులో పరిచయమయ్యారు. వారి కామెంటు లింకు పట్టుకుని చూస్తే, అక్కద అద్భుతమైన పువ్స్తకం దొరికేసింది...ఇంకా కొన్ని భాగాలు రావలసి ఉంది లెండి. ఇదిగో ఆ లింకు. ఒకవేళ లింకు పని చెయ్యకపోతే, నా "పిచ్చిమ్మ -పిచ్చితల్లి" టపాలో రెండవ కామెంటు నుంచి వెళ్లచ్చు.
http://barristerpaarvateesam.blogspot.com/

Ennela said...

అను గారూ, నేను వెయిటింగు ఇక్కడ...పకోడీ, గొంగడి రెండూ రెడీ
కృష్ణప్రియ గారు, అంటే, చాలా వండుతారు కానీ, ఒక్కట్ మాత్రం కుదిరేట్టు కండిషన్ పెట్టారా! వావ్, నాకు నచ్చిందండీ...ఇల్లాంటి కాంట్రాక్ట్ మీద నేను కూడా సంతకం పెట్టించుకోగలనేమో చూస్తా...

అయ్యో లత గారు, మీకూ ఉందా యీ త్రీ రోసెస్ ప్రాబ్లం...ఏంటో సరదాకి అలా అనుకోడం బాగుంటుంది కానీ అబ్బో కష్టమే!

మంజూ గారు, రమ్మన్నాక మళ్ళీ రమ్మంటావా అని అడిగితే వద్దు అనాలని మా అమ్మమ్మ చెప్పేది..కానీ మీ కోసం ఆ రూలు మార్చుకుంటున్నా...మనసు మారే లోపు ఇక్కడుండాలి సరేనా!

కిరణ్, వచ్చెయ్ మరి!, ఉత్త అభిమానించడం కాదమ్మా...పుస్తకాలు చదివేవాళ్ళని ఆరాధించెయ్యనూ!

SHANKAR.S said...

కెవ్వు కేక. నేను తిరుపతిలో ఉండిపోయి టాటా వాడు ఫోటాన్ పేరుతో భారత దేశం లో నెట్ ఎంత స్లో గా ఉండచ్చో నాకు చూపించబట్టి ఈ పోస్ట్ చూడటం ఇంత ఆలస్యం అవడం జరిగింది.
పకోడీలు ఉన్నాయా? అయిపోయాయా? తమరు చదువుకోండి మేడం. మేము "సీతయ్య" గారిని అడుగుతాం
సీతయ్యగారూ రెండు ప్లేట్ల పకోడీలు పార్సిల్ల్ ల్ ల్ ల్ ల్ చేసి బెట్టీ తో పంపించండి ప్లీజ్ :)

అర్జంటుగా ఈ పుస్తకాలన్నీ కంప్లీట్ చేసినా వాటి తాలూకా హంగోవర్ నుంచి బయటపడేదాకా త్రీరోజేస్ వంటకు ఇంట్లో చోటు ఉండదు.

అన్నట్టు అమరావతి కధలు, గోదావరి కధలు ఫ్లో లో పసలపూడి కధలు కూడా కానిచ్చేస్తే ఓ పనయిపోతుందిగా.
(ఒక చిన్న కోరిక : మీ పిచ్చితల్లి కి బుడుగు ని పరిచయం చేయచ్చుగా. నా ఇంకో బ్లాగులో ఉంది ఆ పుస్తకం లింకు. మరి ఆ పన్లో ఉండమని మనవి )

ఆ.సౌమ్య said...

ఓహ్ చాలా బావుంది...అసలు అన్ని పుస్తాకాలు ఉంటే ఇంక తిండి నిద్ర అక్కర్లేదు. నాకొక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నన్ను ఎవరైనా ఉద్యోగం సద్యోగం అక్కర్లేదు, నీకు వండి పెడతాం నువు పుస్తకాలు చదువుకో అని అంటే ఎంత బాగుంటుందో అని. :)
మీకు దొరికిన పుస్తకలలో నా ఫేవరెట్స్ కొన్ని ఉన్నాయి. హాయిగా అన్నీ చదువుకుని ఎంజాయ్ చెయ్యండి.

సుమలత said...

@వెన్నెల గారు
ఎమి అయిపోయారు ఎప్పుడో వీక్ ఎండ్ లో కనపడతారుఎమిటో మీ మీద కోపం గా వుంది.
మీ టపా కోసం ఎదురుచూస్తున్నాను.ఎప్పటి లగే టపా
చాలా బాగుంది నేను ప్రతిసారి పొగడడం మీరు ఏమో
మునగ చెట్టు ఎక్కించద్దు అనడ౦ అందుకనే ఈ సారి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులే,(జోక్ గా)
మా ఇంట్లో కుడా వుంది ౩ రోజెస్ కాన్సెప్ట్ నేను ట్రై చేస్తూ వుంటాను.

Padmarpita said...

good post.

Ennela said...

తృష్ణ గారూ, అమ్మో అన్ని రకాల ఎక్స్ప్రెషన్సా!..పొద్దున్నించీ నాలిక కొరిక్కుంటున్నానండీ...కారణం మీరన్నమాట..ఎవరబ్బా నన్ను తిట్టుకునేదీ అనుకున్నా..నన్ను మిస్స్ అయ్యారని తలుచుకుంటేనే...అబ్బో బోల్డు హాపీ. అసలు హాపీ టయిము వచ్చేసిందండీ నాకు..ఇంక వదలకుండా కామెంటుతా లెండి...ఇంక తిట్టకండే..ఇంకా తిట్టారంటే, మీరు కలిసినప్పుడు.. సైగలతొ సరిపెట్టుకోవాలి..ఎన్నెల కి నాలుక ఉండదు...

అపర్ణా, నువ్వు అలా హిందీలో ఫీలేసుకోడం మానేసి..ఆవో ఆవో..జల్దీ కరో...గొంగడి, పకోడీ రెడీ హై...హా హూ హై

సుజాత గారూ, నిజమేనండీ ఇది ఎంత అదృష్టమో..రచయితలందరూ నా దగ్గరికి వచ్చేసారు...ఎన్ని రోజుల నించీ ఎదురు చూసానో...//ఇంద్రుడొచ్చి స్వర్గానికి బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చి రమ్మన్నా "చేయి ఖాళీ లేదు, రేపు రా పో" అని పంపేస్తా!// హహహహ్ భలే బాగుంది కానీ మళ్ళీ వస్తాడంటారా, బిసినెస్ క్లాస్ టికెట్ తెస్తాడంటారా!

నాగార్జునా గారూ, సీతయ్య గిన మంచిగనే ఉన్నరయ్యా...త్రీ రోసెస్ కాకుంటె, ఒక్క రోస్ అయిన ఎల్తుంది దినాం . గా ఒక్క అడ్జస్టుమెంటు కావాల్నా ఒద్దా! యే, ఉండని తియ్, ఫ్యూచర్ల పనికొస్తది! మాడీ గారి బ్లాగ్ లింక్ ఇదిగొ
http://barristerpaarvateesam.blogspot.com/

Ennela said...

శిశిర గారూ, నవ్వుల్ పువ్వుల్ రువ్వడమేనా?!కెనడాకి వచ్చే ఉద్దేశ్యం లేదా?! మరి మంచు లో చల్లని వెన్నెల, వెచ్చని గొంగళి, వేడి వేడి పకోడీ అన్నీ మిస్ అవుతారు మీ ఇష్టం!

శంకరా, అజ్జొజ్జో, అలా టాటా కి బలి అయిపోయావా?
పకోడీలు బోల్డు చేసా, సీతయ్య గారి చేతికి యెముకల్లేవని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ..దీనికీ, పకోడీలకీ, బెట్టీకీ యేదో సంబంధం కనిపిస్తోంది..చూద్దాం..పార్సల్ అందగానే ఫోన్ కొట్టు!!త్రీ రోసెస్ గురించి నీకన్న బాగా ఎవరికి తెలుస్తుంది చెప్పు, నువ్వు కూడా అదే కోవ (పాల) అంట కదా!పిచ్చితల్లి పరీక్షలతో బిజీ, కాగానే బుడుగుని చూపించి అభిప్రాయం రాబడతా! మా రావు గారింట్లో ఒక రోజు చోరీ చేస్తే గానీ అసలేమేమి ఉన్నాయో తెలియదు.పసలపూడి కథల కోసమైనా ఆ పని మీదుండాలి!!

సౌమ్య గారు నేను బ్లాగ్ మొదలెట్టాక కొన్ని రోజులు ఎడిక్ట్ అయిపోయి అలాగే అనుకున్నా ఎవరీనా జీతం ఇచ్చి బ్లాగ్ వ్రాయిస్తే బాగుణ్ణు అని!మీ ఫవరేట్ బుక్స్ చెప్పండి,నేను చదివి కథ చెపుతా!!

Ennela said...

సుమ గారూ, మీరూ అలిగారా!! సారీ అండీ...చూసారుగా కనిపించకపోవడానికి కారణం...యీ సారికి క్షమించెయ్యాలి ఓకేనా? అవును మీరు ప్రతిసారీ మబ్బుల్లో విహరింపజేస్తూ ఉంటారు, నాకేమో అంత ఎత్తునుంచి కిందకి రావడం ఇష్టం ఉండదు .మళ్ళీ కనిపించట్లేదని మీరే అలుగుతారు.!! అందుకని చెప్పా అన్నమాట..మీరు రావట్లేదా కెనడాకి? దగ్గరేగా వచ్చెయ్యండి మీ శ్రీవారితో సహా!

పద్మార్పిత గారూ, స్వాగతం అండీ.టపా నచ్చినందుకు బోల్డు కృతజ్ఞతలు

జయ said...

అమ్మో ఏమైందా ఈ ఎన్నెలమ్మ అనుకుంటున్నాను. ఇదన్నమాట సంగతి. అవునుగాని, వేయిపడగలు చదివేసారా. బాగా అర్ధమయ్యిందా. ఆ భాష చదవగలుగుతున్నారా. ఒక మంచి రివ్యూ రాయొచ్చుగా ఆ బుక్ మీద.

Rama Prasad said...

ennela gaarooooooooo, abba anni pustakkalu meevenaa, naaku koncham kullu gaa undandi, okkataina itu pampimcharoooooooooooo

మంచు said...

పుస్తకాలా.... హ్మ్మ్... వాటి సంగతి తరువాత అలొచిద్దాం కానీ... ఈ పకోడీ తొ పాటు.. ఇంకా మిర్చి బజ్జి, జిలేబీ, ఇరానీ సమోసా ఇలాంటివి ఎమైనా వెరైటీలు ఉంటే చెప్పండి... వచ్చేస్తాను...

Ennela said...

జయ గారూ, నేనా!! రివ్యూ నా!! స్వీట్ హోం 3 భాగాలు పరిణిత, మైదానం చదివానండీ. వేయి పడగలు మొదలు పెట్టగానే అన్నీ అవాంతరాలు ఎదురయ్యాయి...అవన్నీ అయిపోయేలోగా నాకు ఒక నెల కోసం ఉద్యోగం దొరికేసింది...ఇంక యేం చదూతానో ఏంటో, బెంగ పెట్టుకుని పుల్లలా అయిపోయా...

రమా, ఏంటీ కొత్తగా అండీ గిండీ అని తిడుతున్నావ్!!పుస్తకాలు కావాలంటే ఇస్తాలే, నువ్వు ప్రసాద్ గారిని, చిన్ని ప్రణతిని తీసుకుని కెనడా బేగెల్లిపొచ్చెయ్!!

మంచు గారూ, పుస్తకాలు వద్దా!!మిర్చీ బజ్జీదేముందండీ, మీరూ బేగెల్లిపొచ్చెయ్యండి!..ఇరానీ చాయ్ కూడా బాగా పెట్టిస్తా...జిలేబీ మాత్రం ఇండియన్ స్టోర్ జిందాబాద్.

పద్మవల్లి said...

హెల్లొ ఎన్నెలా
సారీ చాలా ఆలస్యంగా చూసాను మీ పోస్ట్. చాలా అదృష్టం భలే పట్టిందిగాపుస్తకాలు దొరికితే నా అరిస్తితి కూడ మీలాగే. యేదో ఒకతి పడెసి, నేను మాత్రం ఒక కాఫీపట్టుకొని మాయం అయిపోతాను. బాగ ఎంజాయ్ చెయ్యండి.

మా సీతయ్య(న్న) గారిని అడిగానని చెప్పండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీరు పుస్తకాలు చదువుకుంటున్నాకూడ.

మాలా కుమార్ said...

చాలా మంచి అదృష్టం మీ తలుపు తట్టిందే :)

కొత్తావకాయ said...

మీ ఇంటికి ఎలాగూ వస్తా కాని రావు గారి ఎడ్రస్ చెప్దురూ ముందు. అడగక వరమిచ్చే దేముడెంతో, చదవని పుస్తకం అరువుచ్చే వారూ అంతే తెలుసా!
మా సీతయ్య వేరే టైపు.. "చస్..మూడు రోజెస్ కుదరక పోనీ పరవా నై .. ముందా పుస్తకం నన్ను చదవనీ" అని.. ఇది ఇంకా దుర్భరం స్మీ..

Sasidhar Anne said...

idhannamata sangathi..anduka postlu late ayyindhi..nenu kooda ippudu "repalle lo radha" ane book chaduvuthunna.. bale vundi telusa book..
akka, baristar parvatheesam book ante naaku chala istam.. pdf format lo mee daggara vunte fwd cheyyandi.. meeku oka 10 gongallu free ga istha.

ramki said...

abbo.......
meeku pusthakala pichi bagane vundi ennela garu.....
mothaniki pusthakala purugu ani cheppakane cheppinchukunnaru..... :)

Ennela said...

పద్మవల్లి గారూ, మీ బ్లాగ్ ఏదండీ? ప్రతి సారీ పేరు మీద క్లిక్ చేసి డిసప్పాయింటింగ్ నేను! నన్ను మీ బ్లాగ్ కి రానియ్యరూ ప్లీస్!మీరూ వచ్చెయ్యండి...కాఫీ గంగాళం నిండా కలుపుకుని మాయమైపోదాం!

మాలా గారూ కృతజ్ఞతలండీ.

కొత్తావకాయ గారూ, మా ఇంటికి ముందు రండి మేడం...మా రావు గారింటికి తీసుకెళతాగా! మరి మీకూ మీ వారికీ పుస్తకాలు చదవటంలొ కూడా పోటీనా! హ్మ్. కస్టమే !

శశీ, ఆ పుస్తకం కూడా అదే అడ్రెస్స్ లో దొరుకుందేమో వెతుకుతా... బారిస్టర్ గారి చిరునామా పైన శంకరయ్య మాస్టారికి/నాగార్జున గారికి ఇచ్చిన రిప్లై లో ఉంది.

రామకృష్ణ గారూ, ..ఒక్క పది పుస్తకాలకే అలా 'పుస్తకాల పురుగు 'లాంటి పెద్ద బిరుదులిచ్చేస్తే ఎలా! మీ బ్లాగ్ విసిట్ చేసాను. బాగుంది.

David said...

బాగుందండి మీ పోస్టు....చదవండి మంచి అవకాశం దోరికింది.నేను రంగనాయకమ్మ స్విట్ హోం పుస్తకం చదివారు చాలా బాగుంటది. enjoy

ramki said...

thanks for visiting.
Ee madhya time kudaratamledu..... malli naa camera ni dummu dulapali....naa blog ni kooda kastha hadavidi cheyyali...kakapothe ashraddha ante.. :)

జయ said...

హెలో, ఉద్యోగంలో బిజీ నా. ఓకే. ఉగాది శుభాకాంక్షలు.

గిరీష్ said...

భళే రాశారండీ!
ఆ బారిష్టరు పార్వతీశం నేను పదో తరగతిలోనే చదివేశానోచ్.. :), Happy Reading.

Ram said...

హలో ఎన్నెల గారూ,
మేము ఉండేది మిసిస్సాగ లొనే.. లక్కీ గా మీ బ్లాగ్ కనపడింది. మీ బ్లాగ్ కబుర్లు బాగున్నాయి.

pradeep said...

meeru ippati varaku chadivin/nachina manchi books perlu cheputara? nenu ee madyne books chadavadm start chesanu kaani evari books chdvalo ee books chadavalo rtham kavatam ledu.
mee laanti vaalla daggara nundi oka list tayarucheddamani prayatnam...
alage naa list ki inka ela contribute cheyalo (evarini adagaalo) telupagalaru