ఇదేం టాపిక్ అని ఆశ్చర్యంగా ఉందా! అవును మరి టాపిక్ పెడుతుంటే నాకు అదే అనిపించింది....కానీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఎలా చెప్పాలో సరిగ్గా తెలియట్లేదు...ఏదో పిచ్చికి సంభందించిన పేర్లు కదా అని నేను పిచ్చి పిచ్చిగా చెపితే చదివే మీరు నన్ను పిచ్చిదాన్నను కోరు? అందుకే పోస్టాలా వద్దా అని తెగ చించాను చివరికి ఏమయితే అది అయిందని 'ధైర్యే సాహసే ఎన్నెలా' అనుకుని చెప్పేస్తున్నా. వీరు కవలలు కారు, జంట కవులు కారు, ఆ మాట కొస్తే అసలు ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేదు... మరి విషయం లోకి వచ్చేద్దాం.
మా జనరల్ మానేజర్ షోడశ కళలతో కళకళ లాడుతుంటుంది..ఒక నిముషము గట్టిగా బ్రాండ్ డయిరెక్టర్స్ మీద అరుస్తూనే, నేను కనబడగానే నవ్వుతూ యోగ ధ్యానం గురించి కూల్ గా మాట్లాడుతుంది. నేను చాల సార్లు కంఫ్యూస్ అవుతాను. అసలేంటి అని -రెండు ఫోన్ కాల్స్ ఒకే సారి వస్తే, ఒక లయిన్లో తిట్టేస్తున్న ఆవిడ కాస్తా వాళ్ళని హోల్డ్ లొ పెట్టి ఇంకొకళ్ళతో హ్యాప్పీ గా నవ్వుతూ మాట్లాడుతుంది...ఇంక యీ లయిన్లో అవగానే మళ్ళీ తిట్ల దండకం కంటిన్యూ...యీ విద్య ఎలా వస్తుందీ..మన వల్లయితే కాదండొయ్. ఒక రోజు నేను ఇంటికి వచ్చే టైం లో...సేల్స్ టార్గెట్ పూర్తీ అవ్వలేదని ఎవరినో చచ్చేట్లా తిడుతోంది...అప్పుడే అక్కడకొచ్చిన ప్రమోషన్స్ మ్యానేజర్ తో ఒకటే జోకులు..ఇంత కళాకళల మనిషేఏంటిరా బాబూ అని ఆలోచిస్తూ బయటికి వస్తున్నా....మెట్లు దిగగానే ఒకాయన 'ఈస్ మ్యాడీ స్టిల్ ఇన్ హెర్ ఆఫీస్' అని అడిగాడు....'ఎస్ ,షీ ఈస్' అని బయటి కోస్తూ అనుకున్నా ఈవిడ పేరు విచిత్రంగా ఉంది కదూ! అని.. ఆవిడ పేరు మ్యాడలిన్ . కొందరు మ్యాడీ అని పిలుస్తారు...ఆవిడ సంతకం మ్యాడ్ అని పెడుతుంది..ఇలా పేరెందుకు పెడతారు ..పెట్టారనుకోండీ ఎవరైనా మ్యాడ్ అని వాళ్ళని వాళ్ళు పిలుచుకుంటారా...ఎంత ముద్దయితే మాత్రం వేరే వాళ్ళు మ్యాడ్ అని పిలిస్తే చూస్తూ ఊరుకుంటారా అని ఆలోచిస్తూ నడుస్తున్నా. సడెన్ గా చిన్న నవ్వు నా మోమున చిగురించింది...మన దగ్గర పిచ్చమ్మ అని పెట్టుకుంటారు కదా అలా ఇక్కడ మ్యాడలీన్ అని పెట్టుకున్నారు.ఒక వేళ ఎవరి పేరన్న పిచ్చమ్మ అని ఉంటే మనం ముద్దుగా పిచ్చీ అని పిలుచుకోమూ ఇదీ అంతే అని జీవిత సత్యం కనుక్కున్నాను..అప్పటి నుంచీ ఆవిడ మా పిచ్చమ్మ. మరి ఆవిడ గురించి మాట్లాడు కుంటున్నప్పుడు మా పిచ్చమ్మ గారు ఇవాళ ఇలా అన్నారు..మా బెట్టీ గురించి ఇలా చెప్పారు అని చెప్పుకుంటామన్న మాట..
పిచ్చితల్లి నాకు చదువుల్లో పరిచయమయ్యింది. చిన్కీ (చైనీ) పిల్ల . మొదటి సారి లయిబ్రరీ లో కలిసింది. ఒక శనివారం రోజు మా గ్రూప్ మొదటి సారి కలుసుకున్నాం. ముందుగా అనుకున్న ప్రకారం ఆ రోజు ప్రెసెంటేషన్ నాది. నా డిస్కశన్సు బోల్డు నచ్చేసాయిట. మనిద్దరం కలిసి చదువుకున్దామా అంది...నాకు రోజు ఇక్కడికి రావడం కుదరదండీ అన్నాను..మీరు ఏమి అనుకోకపోతే నేను మీ ఇంటికి రావచ్చా అంది...దానికేమి భాగ్యం...రండి తప్పకుండా అన్నాను..తను చాలా పంక్చువల్ గా సోమ వారం సాయంత్రం సరిగ్గా నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే టయిముకి మా ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంది. నా కంటే ముందుగా వచ్చేసినందుకు నేను కొంచెం ఖంగారు పడ్డాను..ఇల్లు నరకంలా ఉంటుంది.. మొహమాటం గా చెప్పాను..ఇల్లు చూసి భయపడకండీ అని...డోంట్ వర్రీ అంది. నేను లోపలికి వెళుతూనే కాలికి అడ్డం తగిలిన వస్తువులన్నీ గబా గబా తీసేసాను. తనని కూర్చోమని చెప్పి ఐదు నిముషాల్లో సాధ్యమైనంత సర్దాను.. కాళ్ళు చేతులు కడుక్కుని పిల్లలకి తినడానికి పొద్దున్న చేసిన రొట్టెలు కూర వేడి చేసి ఇస్తూ తనకి కూడా ఇచ్చా.ఇంక మిగిలిన పనులు వదిలి రాత్రి పదిన్నర వరకు చదువుకున్నాము.మా వారు వచ్చే టయిముకి తను వెళ్ళిపోయింది పార్కింగ్ ప్రాబ్లెం అవుతుందని... . ఇంటికి వచ్చాక రెండో రోజు తను కూడా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. మీ పిల్లలకి చెప్తుంటే విన్నాను...కాళ్ళు చేతులు కడుక్కోకపోతే నాకు తిండి పెట్టవేమో అని కడుక్కుని వచ్చేసాను అంది. అబ్బో తెలుగులో చెప్పినా భలే అర్థం అయ్యిందే అని నేను బోల్డు సంబరపడి పోయాను. మూడో రోజు నేను కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చే టయిముకి తను సింకు దగ్గర ఉండి అంట్లు కడగడానికి ట్రయి చేస్తోంది.. అరెరే అని నేను ఖంగారు పడ్డా . నిన్ను చూస్తె జాలేస్తోంది పాపం, ఇంటి పనంతా చేసుకుని, వర్కు నుంచి వచ్చీ మళ్ళీ చదువుకోవాలిగా. నేను ఇల్లు సర్ది ౩ ఏళ్ళు అయింది తెలుసా. సిబ్లింగ్స్ తో సహా ఎవ్వరినీ ఇంటికి పిలవను, నేనే వెళతాను అవసరమయితే. మా ఆయన చయినీస్ రెస్టారెంట్ లో షెఫ్..మా ఇద్దరి కోసం వంట తనే చేసేస్తాడు ..నేనే వంకలు పెట్టి తిడుతూ ఉంటాను ..శని వారాలు నేను లేచి మొహం కడుక్కుని లైబ్రరీ కి వచ్చేస్తానంతే ...తను లేచి నా కోసం వండి అక్కడికి పట్టుకొస్తాడు, అయినా నేను అలిసిపోతాను. నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు, నేను రోజూ నీకు అంట్లు కడిగి పెడతాలే అంది....నాకు మా ఫ్లోరా ఫీలింగ్స్ కి కళ్ళ నీళ్ళొచ్చాయి నాకు అలవాటేలే నువ్వు వర్రీ అవకు..అని చెప్పాను...తను నన్ను సూపర్ వొమన్ అంటుంది.. మా వారు ఇంటికొచ్చాక ఫ్లోరా అంట్లు కడిగే ప్రయత్నం చెప్పాను, తన కామెంట్లు జత చేసి...మీకు అర్థం అయ్యే ఉంటుంది...అయన కూడా ఫ్లోర లాగ ఆలోచించడం మొదలు పెడతారేమో అని కొంచెం దురాశ. అన్నీ పక్కన పెట్టి ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి పదం 'అయ్యో పిచ్చి తల్లీ' అని. అది నన్ను గురించీ అనుకుంటే ప్రస్తుతం కంది పప్పు ధర ఎక్కువ కాబట్టీ వేస్టు చెయ్యలేము కాబట్టీ మీరు చారులో కాలేసినట్టే ఆ పిచ్చితల్లి బిరుదాన్కితురాలు మా ఫ్లోరా. తనకి చెప్పాను ఆ బిరుదు గురించి..దాని అసలు అర్థం..సందర్భానుసారం తనకి ఆ బిరుదు ఇయ్యడానికి మీనింగు తో సహా చెప్పాను లెండి...కొంచెం బై హార్ట్ చెయ్యడానికి ప్రయత్నిచింది.నిన్ను మేము ఏమని పిలుస్తామూ అంటే...పిచిటాలీ అంటుంది.ఇలా రోజూ నేను ఆఫీసు నుంచి వచ్చే లోపు బయట వెయిట్ చేస్తూ ఉండేది ప్రతి రోజూ..ఒకొక్కసారి బస్ స్టాప్ కి వచ్చేది పిక్ చేసుకోడానికి..ఇంకా ఆఫీసుకి వచ్చి పిక్ చేసుకుంటాను అనేది కూడా..అంత వద్దులే అని చెప్పేదాన్ని.
మా మూర్తి గారు వచ్చారు ఒక రోజు...తనని పరిచయం చేసాను...మీ ఇంటికి పిలవరా అని అడిగారు తనని ....ప్లీస్ మా ఇంటికి రావద్దు..కావాలంటే రెస్టారెంటుకి తీసుకెళతా అంటుంది...మా స్నేహితులెవరైనా తనని ఇన్వయిట్ చేస్తే బోల్డు సంబర పడి పోతుంది..వాళ్ళు నిజ్జంగా రమ్మన్నారా అని అడుగుతుంది..మా వాళ్ళు అలా ఊరికే రా అనరు..ఎప్పుడయినా తీసుకెళతాలే అని చెప్పేదాన్ని...ఒక్కోసారి రాగానే రొట్టెలు వద్దు అన్నం పెట్టు అంటుంది...తన కోసం కారం తగ్గించి చెయ్యటం తప్పలేదు కనీసం ఒక కూరలో..లేక పోతే కళ్ళు ముక్కూ వర్షిస్తాయి మరి..అన్నం చేత్తో కలుపుకుని తినడం..రొట్టెల్లో కూర పెట్టుకుని తినడం బాగా వచ్చేసాయి..చూడు చూడు నీ లాగే తింటున్నా అని కళ్ళు మెరిపిస్తుంది... అలా అలా పది రోజులకే ఇండియన్ తిండి అలవాటయ్యి ఇంక వేరే వంటలు నచ్చటం మానేసాయిట. కనిపించిన వాళ్లకల్లా 'ఆహా ఏమి రుచి..అనరా మయిమరచి' అని చెప్పేస్తోంది కూడా..అంతే కాకుండా మా కోర్సు పూర్తీ అయ్యాక పరీక్ష కి ముందు రోజు పెద్ద పెద్ద సంచీలతో వచ్చింది..ఏంటీ ఇవన్నీ అని అడిగితె...ప్రతి రోజు మీ ఇంట్లో అన్నము రొట్టెలు తింటున్నాగా వాటి రా మెటీరియల్స్ కొనుక్కొచ్చా అంది.నీకు ఎలా తెలుసు అని అడిగితే ఏదో ఇండియన్ షాప్ కి వెళ్ళి వాళ్ళకి నేను రోజూ ఏమేమి పెడతానో ఎక్స్ప్లెయిన్ చేసి కనుక్కుందిట..నాకు పిచ్చెక్కింది...ఒక బస్తా బాస్మతీ బియ్యం, ఒక బస్తా పిండి , వివిధ రకములైన రెడీ మేడ్ రొట్టెలు, కొన్ని ఫ్రోజెన్ కూరలు..బోల్డు తెచ్చింది...తను మరీ హార్ట్ కాకుండా ఫ్రోజెన్ కూరలు మాత్రం ఉంచుకుని మిగిలినవి ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పాను సున్నితంగా. పనిలో పని అన్నం వండడం నేర్పించి బియ్యంతో అన్నం వండుకో , ఇంకా రొట్టెలు వేడి చేసుకుని తిను.. కూర కావాలంటే మాత్రం మా ఇంటికి రావాల్సిందే అని చెప్పాను. పరీక్షకి వెళ్ళే రోజు మా ఇంటికి త్వరగా వచ్చేసింది. తీరా బయల్దేరే సమయంలో ఒకటే చలి. ఇంటికి వెళ్లి వచ్చే టయిము లేదు కదా అని మా పిల్లలది ఒక హుడీ ఇచ్చాను. పరీక్ష అయిన మర్నాడు ఫోన్ చేసింది.. ఆ హుడీ వెనక్కి ఇవ్వాలా అని. ఆ అడగటం లో ఇవ్వద్దు అని చెప్టే బాగుణ్ణు అని ఫీలింగ్ కనిపించింది.. వద్దులే ఉంచుకో అన్నాను.నువ్వు ఇమ్మన్నా నేను ఇచ్చేదాన్ని కాదు..ఊరికే నామకహా అడిగాను అంతే అంది.. .ఆ హుడీ వల్లే తను పరీక్ష పాస్ అయ్యానని , ఇప్పటికీ ఏ పరీక్షకయినా అదే హూడీ వేసుకోవడం సెంటిమెంట్ అయిపోయిందనీ మొన్న చెప్పింది. ఇంక కెనడా లో బూగీ వూగీ ప్రోగ్రాం అవుతుందని తెలుసుకుని నా కంటే ముందే టికెట్టు కొనేసుకుంది..చీర కట్టుకోవాలని తెగ ఎక్సయిటు అయ్యింది..నగలు, గోరింటాకు, బొట్టు, కాటుక పువ్వులు గాజులు..నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా మెట్టెల తో సహా ..ఏవీ మిస్ అవ్వకుండా అడిగి అడిగి పెట్టించుకుంది..ఇంకా ఏమైనా మిస్ అయ్యానా అని ఆడుగుతూనే ఉంది వెళ్ళేదాకా. చూడండి మరి లచ్చిందేవి లా ఎంత అందంగా రెడీ అయ్యిందో..'ఎలా ఉన్నాను' అని అడిగింది బయలదేరుతున్నప్పుడు కనిపించిన ఒక పంజాబీ ఆవిడని . 'గాడెస్ ఆఫ్ వెల్త్ ' లా ఉన్నావు అని చెప్పారు....ఇంక ప్రోగ్రాం కి వెళ్ళాక ...'సో క్యూట్' అని చూసిన వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు..ఈ యని వాళ్ళని మేడం గారు వదులుతారా ఏంటీ...హెలో అని పలకరించడం...నేను ఇండియన్ లేడీ లా ఉన్నానా అని అడగడం. స్టేజి ఎక్కిన ప్రతి వాళ్ళతో ఫోటోలు ..భలే సరదాగ గడిచింది ఆ సాయంత్రం. ఇంటికి తీసుకొచ్చి దిష్టి తీసి మరీ పంపించాము అమ్మగారిని. నగలు, వస్త్రములు జాతీయం చేసిందని వేరే చెప్పక్కరలేదనుకుంటా...లకీ మీ...అన్ని గిల్టువే...
మరి తను మా వారిని ఏమని పిలుస్తుందో తెలుసా? అచ్చ తెలుగులో "నాన్న"
మొన్న ఫోన్ చేసి చెప్పా తన గురించి నా బ్లాగ్ లో వ్రాస్తున్నా అని...మొదటి ఫొటో పంపింది..కాస్సేపాగి...ఉండు ఉండు పువ్వులు కనిపించట్లేదు..ఇది కూడా పెట్టు అనిరెండవ ఫోటో పంపింది.....మీకు పూలు కనబడ్డాయా? హమ్మయ్యా... ఇంక మా 'పిచి టాలీ' మస్త్ ఖుష్....
మరి తను మా వారిని ఏమని పిలుస్తుందో తెలుసా? అచ్చ తెలుగులో "నాన్న"
మొన్న ఫోన్ చేసి చెప్పా తన గురించి నా బ్లాగ్ లో వ్రాస్తున్నా అని...మొదటి ఫొటో పంపింది..కాస్సేపాగి...ఉండు ఉండు పువ్వులు కనిపించట్లేదు..ఇది కూడా పెట్టు అనిరెండవ ఫోటో పంపింది.....మీకు పూలు కనబడ్డాయా? హమ్మయ్యా... ఇంక మా 'పిచి టాలీ' మస్త్ ఖుష్....
42 వ్యాఖ్యలు:
మీ 'పిచి టాలీ' పూలు కనిపించాయి, అని ఇంకా అచ్చుఇండియన్ లేడీ లా ఉంది అని నా తరుపున కూడా చెప్పండి ! మీ పోస్టు చాలా బావుంది .
Wow...Pichamma kante mee PichiTalley ekkuva marks kottesindanDee...
She is looking SUPERB ani naa taruphuna cheppandi...
paapam pichi talli santoshistundi....
బాగున్నాయి మీ పిచ్చమ్మ, పిచ్చితల్లి కబుర్లు. చాలా బాగుంది అని చెప్పండి ఆ పిచ్చితల్లికి
శ్రావ్యా గారు కృతజ్ఞతలండీ..నా బ్లాగ్ కి స్వాగతం..చెప్పేసానండీ మీ కామెంట్ రాగానే ఫోను కొట్టా..ఫోటో లో లాగే నవ్వేసింది అందంగా. 7వ తారీఖు ఇంకో పరీక్ష ఉంది తనకి..ఆ టెన్షన్ లోంచి బయటకొచ్చిందిట మీ ఇద్దరి కామెంట్సూ విని..మీకు థ్యాంకులో అని చెప్పమంది...
మ్యాడీ గారు..స్వాగతం .కృతజ్ఞతలు ఇంకా సారీ కూడా అండీ..తెలుగు బ్లాగ్ లో మీ పేరు ఎక్స్పెక్ట్ చెయ్యలేదండీ...మీ పేరుతో పోస్టేసా..సారీ అగైన్...మీ పేరు చూసాకా ఇక్కడ పిచ్చమ్మ పార్ట్ తీసేద్దామనిపిస్తోంది...మీరేమంటారూ..మొహమాటం లేకుండా చెప్పండే..మీ ప్రత్యుత్తరం వచ్చే దాకా వేచి ఉంటా..
బావున్నాయి మీ కబుర్లు
చీరలో ఆవిడ బావున్నారు.
మళ్ళీనా|అబ్బో సూపర్
...
ఇంకో పెద్ద పోస్టా|మీ పిచ్చమ్మ విశేషాలు
...
మొన్నే చిన్నపోస్ట్ రాస్తే|ఆవిడ అద్భుత విద్య
...
ఇక పే.ద్ద పోస్టులు|నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి
...
చదివే శ్రమ తప్పిందనుకున్నా|ఫాలో అయిపోతున్నా
ఈ కామెంట్ రాసేటప్పుడు మీ పిచ్చమ్మ పూనిందేమో :)
ఇక మీ పిచ్చి తల్లిని సడెన్‌గా చూసి మన మినిస్టర్ గీతా రెడ్డి లా ఉంది అనిపించింది. (అంటే ఆవిడ చైనీస్ లా ఉందా? ఈవిడ తెలుగమ్మాయిలా ఉందా? ) ఏంటో అంతా విష్ణుమాయ :)
అలో అలో...బాగున్నారా? మీ టపలు చదివేసానండి...అన్నింటికీ ఇక్కడే రాసేస్తున్నాను....మీరు,మీవారు అంతా త్వరగా ఒక్చోటకు వచ్చేయాలని కోరుకుంటున్నాను.
మీరు పరిచయం చేసే మనుషులు, కథలు కబుర్లు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి..
ఇంకా....***ఽఽఽ%%%॑॑॑॓॓॓॓౨౨౨౨౨॒॒॒॒॒
బ్లా బ్లా బ్లా.....:)
ఫాంట్ కొంచెం తగ్గించకూడదూ?
బాగున్నాయండి మీ పిచ్చమ్మ, పిచ్చితల్లి కబుర్లు.పిచ్చితల్లి కి మా అభినందనలు & శుభాకాంక్షలు తెలపండి.
అదేమిటో నండి బాసు లందరూ, శాంతమూర్తి అనిపేరు పెట్టుకున్నా పిచ్చమ్మ లాగానే ఢాం ఢూమ్ అంటుంటారు. వాళ్ళదంతా అదో లోకం.ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు తిడతారో వాళ్ళకే తెలియదు. పిచ్చిమాలోకాలు.:):)
భలే ఉంది ఎన్నెల గారు మీ పిచ్చిటాలీ.. :)
పూలు కనిపిస్తున్నాయి...:)
:-)) మీ పిచ్చి టాలీ బాగుంది..
బాగున్నాయి మీ పిచ్చమ్మ, పిచ్చితల్లి కబుర్లు. చాలా బాగుంది ...... ఎన్నెల గారు కొంచెం ఫాంట్ సైజ్ పెంచితే బాగుంటుందేమో అనుకుంటున్నా
:))
మీ సాంగత్యంవల్ల ఇహ పిచి టాలి భర్తగారికి ఇండియన్ వంటలు చెయ్యడం తప్పదనుకుంటా..
:))
మీ పిచ్చమ్మ , పిచ్చి టాలి బాగున్నారు . పిచ్చి టాలి మస్త్ గుంది .
మాకో వెర్రి తల్లి వుండేది . ఆవెర్రి తల్లి గుర్తొచ్చింది , మీ పిచ్చి టాలి ని చూస్తే :)
మీ పిచ్చిటాలీ పిచ్చిపిచ్చిగా ముద్దొచ్చేస్తోంది. పాపం ఇంతమంది దిష్టి తగలకుండా చక్కటి పట్టు చీరలతోటో వజ్రాల నగలతోటో దిష్టి తీసేయండి.మీ మ్యాడీ కి కూడా దిష్టి తీయమంటుందేమో కనుక్కోండి.
హై పిచ్ పిచ్చి తల్లి అదిరిందంతే
గోడ బ్యాక్ గ్రౌండ్ లో పూలు కలిసిపోయాయి ఎన్నెల గారు
ఈ మారు వెరైటీ గా వేరే కలర్ పెట్టగలరు
ఫాంట్ సైజు కొంచం పెంచకూడదూ..మరీ చిన్నదిగా కనిపిస్తోంది!
మొన్నేకదండీ చిన్న పోస్ట్ రాసేయడమొచ్చిందని సంబరపడ్డారు! :) ఆవిడ చాలా బాగున్నారు చీరలో. మీ పోస్ట్ బాగుంది.
మీ 'పిచి టాలీ' పూలు కనిపించాయి అని చెప్పండి.మొత్తానికి మీ విదేశీ ఫ్రెండ్స్ కు మన సంస్కృతి సంప్రదాయాలు,మన వంటలు రుచి చూపిస్తున్నారన్నమాట.Very Good.
ఎన్నేలగారు మీ పిచ్చమ్మ పిచ్చితల్లి కబుర్లు చాల
బాగున్నాయి...
మీరు బలే వెరైటి గా రాస్తారు...
అందుకే మీరు నాకు నచ్చేసారు .
కొంచెం సైజు పెంచగుడదు....
ఎన్నెల గారూ! చదువుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా...సూపర్బ్ నారేషన్....మీ "పిచిటాలీ" వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది...చీరలో చాలా బాగున్నారని చెప్పానని చెప్పండి...ః)...ఆ రెండో ఫొటోలో పిల్లగాడెవరు?....
ఇంకొక చిన్న సవరణ..ఏమీ అనుకోవద్దేం..."శోడష" కాదండీ! "షోడశ"...
ఎన్నెలగారూ..ముందుగా మీకు బోలెడు క్షమాపణలు....అస్సలు చూసుకోలెదు మీ పోస్ట్! ఆ కథల గోలలో పడి...బ్లాగ్స్ చూడటమే మానేసా! సారీ!!
ఇక ఈ పోస్ట్ సంగతికి వస్తే....మీ 'పిచ్చి టాలీ' సూపర్! మరి సమ్మర్లో కెనడా వస్తే నాకు పరిచయం చేస్తారా ;) మీ పిచ్చి టాలీని మా మిషిగన్ రమ్మంటా! గుంటూరు మిరపకాయల ఘాటు చూపిస్తా!! :P
మీ పిచ్చిటాలీ సూపర్‌గా ఉంది అని చెప్పండీ...పూలు కూడా కనిపించాయని చెప్పండే!
ఎన్నేలగారు లేట్ గా చదివినందుకు ముందు క్షమాపణలు ..
మీ పిచ్చమ్మని నా తరపున డిప్ప మీద ఒక్కటి పీకండి ..
మీ పిచ్చి టాలి పిచ్చ క్యుట్ గా ఉంది .. కాని ఈ పువ్వులేంతో ఎంత చించిన తట్టడం లేదు .. కొంచెం చెప్తారా ...
లక్ష్మి గారు,
అదిరిపొియింది . మీ పెన్ను లో చాలా విషయములు ఉన్నాయి. చాలా చక్కని ప్రయత్నం,
మరి కొన్ని మీ రచనల కోసం వేట్ చేస్తాను.
wow ...its very nice ...pichamma pichitally chanabagundi,,ekkadanunchivastondi ee comedy,,u have gud creativity...andaru enjoy chestunnaru vaidyo horo narayana kadu navvinchi nalugu kalalu manandarini unchestunnaru.....indian dress bagundi sister pichitalliki....inka manchi pichi ratalu rastu andarini navvistu ....undali...am ur fan....pichhamaa
pichchi talli exam pass avutundani mana telugu varu pray chestarani cheppandi.........
భాను గారు , కృతజ్ఞతలండీ. ఫ్లోరా కి చెప్తాను.
లత గారు కృతజ్ఞతలండీ.తను బోల్డు హాప్పీఅయిపోతోంది.
శంకర్, యీ ప్రయోగం నాకు పిచ్చిగా నచ్చేసింది..ఎడమ వైపు వన్నీ ఒక సారి , కుడి వైపు వన్నీ ఒక సారి కలిపి చదవాలని అర్థం చేసుకునే సరికి ఇంత కాలమైంది సోదరా..అర్థం అయ్యాక భలే నచ్చింది.
తృష్ణ గారు, తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ. కృజ్ఞతలండీ.మీ కామెంటులో నాకు బ్లా బ్లా బ్లా బాగా అర్థం అయింది..
సుబ్రహ్మణ్యం గారు, కృతజ్ఞతలండీ.మళ్ళీ మీ మార్కు కామెంటు కొట్టారు మాస్టారూ,శాంత మూర్తి..హాహహ్హా ..
కిరణ్,మంచు గారు, శివ రంజని గారు కృతజ్ఞతలండీ, మీ విషెస్ తనకి తెలియ చేస్తా.
నాగార్జున గారూ కృతజ్ఞతలండీ, అవునండీ నాకు సరదా కాలం, ఆవిడ భర్తకి కష్ట కాలం ఒకేసారి మొదలయ్యాయి .
మాలా గారూ, కృతజ్ఞతలండీ, మీరు కూడ మీ వెర్రి తల్లి గురించి టపా వ్రాసెయ్యండి మరి!
జయ గారు, కృతజ్ఞతలండీ..అవును అలా చేద్దామనే ఉంది..ఏదీ పట్టు చీరల కోసం మీ బీరువా మీద దండయాత్ర చేద్దామంటే అస్సలు కుదరట్లేదే!..ఇక డైమండ్స్ అంటారా..ఆల్రెడీ బ్లాక్ డైమండ్స్ తోటే దిష్టి తీసా!
హరే కృష్ణ గారు, కృతజ్ఞతలండీ..ఇలా బ్లాగ్‌లో పెడదామనీ అప్పటికి అనుకోలేదండీ. అందుకే అలా మల్లెపూలు- తెల్ల గోడా అయింది
శిశిర గారు, కృతజ్ఞతలండీ.. 'పుట్టుక తోటి వచ్చినట్టు ఉందండీ అలవాటు..చిన్నప్పుడు ఏడ్చినా గంటకు తగ్గకుండా ఏడ్చేదాన్నిట...హహాహ '..పోగొట్టడం కష్టంగానే ఉందండీ..మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తా చిన్న టపాలు.
అనూ గారూ కృతజ్ఞతలండీ..అవునండీ ఇంకా చాలా మందిని చెడిపా రవ్వ లడ్డూలు, పకోడీలు, జంతికలు పరిచయం చేసి...ఇక్కడికొచ్చాక ఇంకా ఇండియాకి వెళ్ళలేదండీ, ప్రస్తుతానికి చీరలు నగలు బోల్డు ఆర్డెర్స్ ఉన్నాయి..ప్రామిస్ చేసేసా..చూడాలి ఎప్పటికి తేగలనో!
సుమ లత గారూ, కృతజ్ఞతలండీ..మీరు ప్రతి సారీ నన్ను వెన్నెల్లో విహరింపచేస్తారు. థ్యాంక్స్ అండీ.
కౌటిల్య గారు, కృతజ్ఞతలండీ.
ఆ పిలగాడు- నా పిలగాడే..
షషబిశలు కరకట్టు చేసా,థ్యాంకులు.
ఇందూ, కృతజ్ఞతలు.. తప్పకుండా పరిచయం చేస్తా...ఇంటికి పిలవమని అడక్కుండా ఉంటే చాలు తనని ! అమ్మో గుంటూరు కారమే..ఇంకెప్పుడూ మీతో మాట్టాడదు...
కావ్యా. కృతజ్ఞతలు.//మీ పిచ్చమ్మని నా తరపున డిప్ప మీద ఒక్కటి పీకండి// ఎంత నవ్వుకున్నానో! బులుసు గారి తరవాత కామెంట్లకి నువ్వేనమ్మాయ్!! రెండో ఫొటో జాగ్రత్తగా చూస్తే ఫ్లోరా తల్లో మల్లె పూలు కనిపిస్తాయి అదీ సంగతి!
ఫణి గారూ, కృతజ్ఞతలండీ. పెన్నులు మాటి మాటికీ పోగొట్టుకున్నానండీ. అదే ప్రాబ్లం. ధన్యవాదాలండీ... తప్పకుండా ప్రయత్నిస్తా.
శ్యాం కృతజ్ఞతలమ్మా, అంగ్రేజీలోనే వ్రాసావుగా, తనకి డైరెక్టుగా చూపించేస్తా నీ కామెంటు....
నా బ్లాగ్‌లో ఫాంట్ స్మాల్ పెడితే చీమల్లాగానూ. లార్జ్ పెడితే ఏనుగుల్లాగానూ వస్తోందండీ..కొంచం మొయినంగా (కౌటిల్య గారి దగ్గర యీ పదం కాపీ కొట్టా!) ఉండే సైజు ఎలా పెట్టాలో ఎవరైనా చెప్పి శివ రాత్రికి వచ్చే పుణ్యానికి రెట్టింపు ఫలితం పొందగలరు . స్పందించ బోయే అందరికీ కృతజ్ఞతలు.
small, large తో పాటు normal font కూడా ఉంటుంది కదండి. ప్రయత్నించారా?
:) ఇప్పుడే చదివా.. చాలా బాగుంది..
ఎందుకో ముందర మిస్ అయిపోయా..
Very nicely written..
హలో ఎన్నెల గారు....
నా పేరు రామకృష్ణ . మన ఇందు గారి బ్లాగ్ నుంచి మీ బ్లాగ్ కి చేరుకోవటం జరిగింది....
ఏది యితేనేం...ఇంకో మంచి లైవ్ లి బ్లాగ్ ని ఫాలో అవుతున్న..
మీ పిచ్చిటాలి ఇప్పుడే చదివాను......
బావుంది....
మీరు ప్రెసెంట్ చేసిన స్టైల్ బావుంది....
మీ పిచ్చిటాలి కి చెప్పండి...చిర బాగా సూట్ అయ్యింది అని.... :)
కృష్ణ ప్రియ గారూ, కృతజ్ఞతలండీ. లేట్ అయినా ఫర్వాలేదండీ. మీరు బిజీ అని నాకు తెలుసుగా !
శివ గారూ, కృతజ్ఞతలండీ.
రామ కృష్ణ గారు, నా బ్లాగ్ కి సాదర స్వాగతమండీ. కృతజ్ఞతలండీ. తప్పకుండా చెపుతాను..తెలుగు కామెంట్లన్నీ చదివి వినిపిస్తానని ప్రామిస్ చేసానండీ తనకి.
మీ పిచ్చిటాలి పోష్ట్ చాలా బాగుందండి.సూపర్బ్ నేరేషన్
ఎన్నెలకి, పిచ్చమ్మకి, పిచ్చిటాలికి నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏదీ, కొత్త పోస్ట్ రాలేదేం?
baagunnay mee pichchi kaburlu :):)
oh wow, naga, after a long time nee blog chadivaanu, it was great, liked ur pichchamma and pichchi talli, convey my regards to both, intaki intha time neeku ekkada dorukutondi talli(pichchi talli kaadule)
స్నేహ గారూ, కృతజ్ఞతలండీ.నా బ్లాగ్ కి స్వాగతం.
జయ గారూ, కృతజ్ఞతలండీ, మీకు కూడా శుభాకాంక్షలు. మా పిచ్చితల్లికి కూడా తెలియచేస్తాను. పోస్ట్ రాయకపోడానికి కారణం తదుపరి టపాలో చదవాలి మీరు...!!
సరయు గారూ కృతజ్ఞతలు. మీ పేరుతో ఒకమ్మాయి నాతో కలిసి పని చేసారు మల్కాజ్గిరి ఏరియాలో. తను ఇంగ్లిష్ టీచ్ చేసేవారు..చాలా యేళ్ళ తర్వాత యీ పేరు విని...దిల్ ఖుష్!!!
రమా, నువ్వొచ్చేసావా! సో హ్యాప్పీ.
నాగ రాజు గారూ, కృతజ్ఞతలండీ.
nice post Ennela gaaru
lol
:)
Bharatiya gaaru thanks andee...
Welcome to my blog
Post a Comment