ఒక సారి ఆరుగురు అక్కవుంటెంట్లు, ఆరుగురు ఇంజనీర్లు కాంఫరెన్సుకి వెళ్ళాల్సి వచ్చింది..అందరు ట్రెయిన్ టికెట్స్ కొనడానికి కవుంటర్కి వెళ్ళారు...అకౌంటెంట్లలో ఒకరు "ఆగండి మన ఆరుగురికీ నేను కొంటాను" అని కవుంటర్ దగ్గరకెళ్ళి ఒక టికెట్ మాత్రం కొన్నాడు.ఇంజనీర్లలొ ఒకతను.."ఆగండి మనందరికీ నేను కొంటాను" అని ఆరు టికెట్లు కొని ఐకమత్యాన్ని చాటుకున్నాడు.అయితే, టికెట్ కొన్న అకౌంటెంట్ ఒక టికెట్ మాత్రం కొని వాళ్ళ గ్రూప్ కి ఏదో కీడు తలపెడుతున్నాడని అతనికి అర్థం అయ్యింది.వాళ్ళ టీం తో చెప్పాడు యీ విషయం..ఎప్పడి నుంచో అకౌంటెంట్ల మీద కోపం గా ఉన్న ఇంజనీర్లు "ఊరుకో వాళ్ళకి అలానే జరగాలి" అని ఊరుకున్నారు...రైలెక్కాక వీళ్ళు ఫైన్ కట్టే టయిం కోసం ఇంజనీర్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు......యీ లోపు ఎవరొ ...టికెట్ కలెక్టర్ కమింగ్ అని అరిచారు..వెంటనే ఆరుగురు అకౌంటెంట్లూ బాత్రూం లోకి సర్దుకున్నారు..
టికెట్ కలెక్టరు తలుపు మీద తట్టి..టికెట్ ప్లీస్ అన్నాడు..వాళ్ళు తలుపు కింద నుండి టికెట్ బయటికి విసిరారు..అతను వెళ్ళిపోయాడు..ఇంజనీర్లు కొంచెం డిసపాయింట్ అయినా, ఒక విద్య నేరుచుకునే చాన్స్ వచ్చిందని మురిసిపోయారు..
తిరుగు ప్రయాణం లో ఇంజనీర్లు ఒకటంటే ఒకే టికెట్ కొనుక్కుని టికెట్ కలెక్టర్ వచ్చే టైం కోసం ఎదురు చూస్తున్నారు..యీ లోపు అక్కవుంటింగ్ టీం వాళ్ళు కొంచెం లేట్ రావడంతో టికెట్స్ కొనుక్కోకుండా పరుగెత్తుకొచ్చి రైలు ఎక్కేసారు...వీళ్ళకి యీ సారి తప్పకుండా తిక్క కుదురుతుందనీ అది వాళ్ళు కళ్ళారా చూడాలనీ ఒక వైపు, ఒక టికెట్ తో ఆరుగురు ప్రయాణం చేసె ట్రిక్కు ఉపయోగించటం లో థ్రిల్లు ని అనుభవించాలని ఒక వైపు తెగ ఉవ్విళ్ళూరుతూ కూర్చున్నారు ఇంజనీర్లు ..
ఇంతలో ఎవరో టికెట్ కలెక్టర్ కమింగ్ అని అరిచారు..యీ ఆరుగురు ఇంజనీర్లు గబ గబా బాత్రూం లోకి సర్దుకున్నారు...టికెట్ ప్లీస్..అనగానే టికెట్ బయటికి విసిరారు..కొంత సేపు అక్కడే ఆగి గర్వంగా తమ సీట్లల్లో వచ్చి కూర్చున్నారు..యీ లోపు...టికెట్ కలెక్టర్ కమింగ్ అని మళ్ళీ అరుపు వినిపించి చూసేంతలో..అక్కౌంటింగ్ బాచ్ బాత్రూం లోకి సర్దుకోవడం..మన ఇంజినీర్లు ఫైన్ కట్టడం గబ గబా జరిగి పోయాయి..
బ్రహ్మ రాత్రంతా చక్కగా నిద్ర పోయి, ఫ్రెష్ ఫ్రెష్ గా ఉదాయాన్నే లేచి మంచి మూడ్ లో ఉన్నప్పుడు అక్కవుంటెంట్లని తయారు చేస్తాడట..అందుకే మేధవైన వాడు అక్కౌంటెంట్ గా పుట్టునని వేదాలు ఘోషిస్తున్నాయి.
మిత్రులారా..ఇది ఒక పురాతనమైనా జోకు..మీలో చాల మందికి తెలిసే ఉంటుంది...నాగార్జున గారి రోబో సినెమా పోస్ట్ చదివినప్పుడు ఇది గుర్తుకొచ్చి, మీతో కలిసి మళ్ళీ గుర్తు చేసుకుందామని ఇక్కడ పోస్టుతున్నాను...అన్నట్టు మా అక్కౌంటెంట్లని ఇంజనీర్లు చిన్న చూపు చూస్తున్నారని నేను ప్రత్యర్థి గా ఇంజనీర్లని ఎన్నుకున్నాను....ఇందులో మీరు ఏ బాచ్ వారయితే ఆ బాచ్ వారిని అక్కౌంటింగ్ బాచ్ ప్లేస్ లోను, మీరు బకరాలు అనుకునే ఇంకొక బాచ్ ని ఇంజనీర్ల బాచ్ లోను..పెట్టేసుకుని నవ్వు రాకపోయినా నవ్వేసుకోండి మరి......మీరు ఇంజనీర్లయితే అక్కౌంటెంట్లని ఎన్నుకోండి..కానీ నాకు చెప్పకండే...
హుర్రే!!!!!నాకూ చిన్న పోస్టు వ్రాయడం వచ్చేసిందొహో..ఓ..ఓ...ఓ..ఓ..ఓ...ఓ..ఓఓ
24 వ్యాఖ్యలు:
హ్హహ్హహ్హా! ఎన్నెలగారూ మీరు చిన్నపోస్ట్లు వ్రాసే విద్య నేర్చుకున్నదుకు శుభాకాంక్షలు :))
మా ఇంజినీర్లందరిని పోగేసి మీమీదకి దండయాత్రకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైనది :))
చూసుకుందాం..ఇంజినీర్లు గ్రేటో..అకౌంటెంట్లు గ్రేటో! కెనడా రైంబో బ్రిడ్జిమీద :))
హ్హహ్హహ్హా! బాగుంది జోకు.
mi tapaa baavundi endukandi engineerla mida kopam??
చిన్నప్పటి డిబేట్ గుర్తోచింది
కత్తి గొప్పదా ? కలం గొప్పదా ?
నేనైతే కలం కనుక్కున్నా వాడిని కత్తి తో పొడిచి రైలెక్కి పారిపోవాలని అనుకునే వాడిని. (టికెట్ లేకుండా) పెద్దయ్యాక పార్ధు గా రావచ్చని.
కానీ కుదరలేదు !! ప్చ్ !!!
నేనూ కామర్సే (ACS). ఇకనుంచీ ఇంజనీర్లంతా మనకి తసమదీయులన్నమాట. హై హై సోదరీ
వెధవ ఓ టికట్టు కక్కుర్తితో టాయిలెట్లో.. హమ్మ! హూ .. అదీ రైల్వే టాయిలెట్లో.. ఐదుగురు గంట సేపు అఘోరించడం కన్నా, టికెట్ కొన్న ఇంజనీర్లే కాసింత బుర్ర వుపయోగించారని అంటాను. :))
జోకు బావుంది.
మాకు ఇంజనీర్లతో ఏమాత్రం పని లేదు. మాకు అకౌంటెంట్ల తోటే చాలా పని ఉంటుంది. నా ఓట్ ఎటో అర్ధమైపోయిందనుకుంటా:)
బాగుంది ఎన్నెల గారు మీ జోకు బలే నవ్వించారు మీ పేరు బలే నచ్చేసింది మీరు ఏమైనా అనుకోండి
ఈ జోకు ఇంజనీర్లు Vs మెడికోలు, ఇంజనీర్స్-MBAs మధ్య చదివాను. ఇప్పుడు ఇంజనీర్లు-అకౌటెంట్లు...అయినా ఇంజనీర్లంటే ఎంత కసి లేకపోతే ఇంతమంది ఇంజనీర్లను టార్గెట్ చేస్తారు....మేము రచ్చంతే...
హహహ..ఎన్నెల గారు..
కొత్త విద్య మీరు కూడా నేర్చేస్కున్నారు..
అదే చిన్న పోస్ట్ రాయడం..
ఇదిగో మీకు నా కనుక- ఒక గులాబీల bouquet ..:)
మా ఇంజనీర్ లను అనడానికి ఎంత ధైర్యం..ఇందు అన్నట్లు..వచేస్తున్నమ మీ మీద దండ యాత్ర కి.. :):)
బాగుంది పోస్ట్ ఎప్పాటి లాగె..:)
ఎన్నెల గారు ,
చిన్న పోస్ట్ రాయటము నేర్చుకున్నందుకు అభినందనలు .
జోక్ బాగుంది . మా ఇంట్లో ఇంజనీర్లూ , అకౌంట్లు ఇద్దరూ వున్నారు . మరి నేనెటు వెళ్ళినా ఇబ్బందేనే :)
జోకు బాగుంది. అంటే బాగానే ఉంది కానీ పాపం ఎంత అకౌటెంటు లయినా అర డజను మందిని ఒక టాయిలెట్టు లో కనీసం అర గంట పెట్టీయడం?? ఎంత మేధావులైతే మాత్రం వరసగా పాపం రెండు రోజులా? పాపం అకౌటెంటు లు. నేను ఇంజనీరుని కాదు.
చిన్న పోస్ట్ కి అభినందనలు.:):)
పోస్ట్ చిన్నగా రాసినా ఇలా మా ఇంజనీర్ల మనోభావాలను గాయపరిచేవిధంగా రాసినందుకు కాను అకౌంటంట్ల తరుపున క్షమాపణ చెప్పాల్సిందే...
బిల్లుల దండయాత్రలు చేయవలసింది గా నేను కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను
జై కెనడా!
పోస్ట్ చిన్నగా రాసినా ఇలా మా ఇంజనీర్ల మనోభావాలను గాయపరిచేవిధంగా రాసినందుకు కాను అకౌంటంట్ల తరుపున క్షమాపణ చెప్పాల్సిందే...
బిల్లుల దండయాత్రలు చేయవలసింది గా
నేను కూడా పిలుపునిస్తున్నా
ఈ సందర్భంగా చలో కెనడా యాత్రలో భాగంగా ధర్నా కి పిలుపునిస్తున్నాం
వివరాలకు బులుసు సుబ్రహ్మణ్యం గారిని నాగార్జున ని సంప్రదించగలరు
మేము హర్టెడ్ హర్టెడ్... ఇందుకు నిరసనగా ఇక్కడ కామెంట్ల జాగారం చేస్తామింక :-)
హహ్హహ్హ.. చిన్న పోస్ట్ రాయడం వచ్చేసిందని ఆనందమా? బాగుందండి మీ చిన్న పోస్ట్.
evaru ikkada maa engineer's ni comment chesthundi aaaya...?
Akka mothaniki nenu cheppinattu chinna post rayatam nerchukunnav :)
ఇందూ కృతజ్ఞతలండీ, దండలన్నీ అలాగే పట్టుకుని యాత్రకి రండి...నాకు వెయ్యచ్చు...
అనూ గారు కృతజ్ఞతలండీ
మంజు గారూ కోపం యేమీ లేదండీ...చిన్న చూపు చూస్తున్నారని ఫీలింగ్ అంతే
ఆత్రేయ గారు, మీ కోరిక సూపర్ గా ఉందండీ...ఇప్పుడు అలా పొడవడం, పార్థూ గా రావడం కుదరదంటారా?
శంకర్ గారూ, అవును సోదరా మనము-అసమదీయులం..వారు తసమదీయులు
ఎస్.ఎన్.కె.ఆర్ గారు, కృతజ్ఞతలండీ...మరి వాళ్ళూ ఫాలో అయ్యారుగా...ఆ టెక్నిక్కూ!
జొయా జీ నాకు తెలుసుగా మీరెప్పుడూ నా సైడు అని..చెట్లూ పుట్టాలూ తిరుగుతూ బోల్డు కబుర్లు చెప్పుకుందామే ..
సుమలత గారూ, కృతజ్ఞతలండీ...నా పేరు నచ్చిందని చెప్పారు కదా , నాకు 'మనసున మల్లెల మాలలూగెనే'.అబ్బే యెమీ అనుకోను ఎన్నిసార్లు చెప్పినా బాగుంటుంది నాకు
నాగార్జున గారూ, మీకు అలా అర్థం అయ్యిందా..యెంతైనా మీ ఇంజనీర్లున్నారు చూసారూ!
కిరణ్, మీ గులాబీలు అందాయి. కృతజ్ఞతలు...మీరు కూడా దండ తెచ్చారా..వేసెయ్యండి...కాందంటే బాగుండదు కదా?
మాలా గారూ, కృతజ్ఞతలండీ..మీ లాగా ఒకరుండటం మాకు అవసరం..అప్పుడప్పుడు ఇలా వీర లెవెల్లో కొట్టుకుంటే..మీరేగా మాకు జడ్జీ..
సుబ్రహ్మణ్యం గారూ, కృతజ్ఞతలండీ...ఏంటో మీరు కూడా! ఎన్ని డబ్బులు పొదుపు చేసారు-అసలు మేధావులు అని మెచ్చుకోవచ్చుగా మాస్టారూ..
హరేకృష్ణ గారూ, బిల్లుల దండయాత్ర అనగానేమి? డాలరు బిల్లులతో దండలు తయారుచేయించి మాకు వేయుదురా...చలో కెనడా యాత్రకి వచ్చునప్పుడు చలి తట్టుకొనుటకు నేను "అందరిలో మావయ్య " మొదటి భాగములో చెప్పినట్టు గంగిరెద్దు సామగ్రి తెచ్చుకోవలసిందిగా పెద్ద మనసు చేసుకుని హెచ్చరించడమైనది..బార్డలులోనే చలికి తట్టుకోలేకపోతే..ధర్నా లు జరగవు..బిల్లుల దండలు కొంచెం ఘనంగా తయారు చేయించమని మనవి.
భాస్కర రామి రెడ్డి గారూ, అదిగో అలా చిన్న దానికి హర్ట్ అయ్యేవాళ్ళనే ఇంజనీర్లు అంటారని మా అక్కవుంటెంట్ల నిఘంటువు చెపతాంది..మీరు ఇక్కడ రుజువు చేసేసారొహో ఓ !
శిశిర గారూ కృతజ్ఞతలండీ....ఎంత ప్రయత్నం చేసానో తెలుసాండీ..చిన్న పోస్టు వ్రాయడానికీ!
శశీ, మీరు కూడా దండలూ అవీ తెస్తే వేసెయ్యండి..అవునండీ చిన్న పోస్టు అని నేను బోల్డు ఆనంద పడి ఉబ్బి బలూన్ అయిపోయా...ఇక్కడ ఒక స్నేహితురాలు 'నా మొహం దాన్ని చిన్న పోస్టు అంటారా?' అని గాలి తీసేసింది. రెండు ముక్కల్లో చెప్పడమంటే నా వల్ల కాదాయె....యేమీ సేతురా లింగా యేమీ సేతూ..!
ennela garu yemayyaru chinna postlu
rasi manchi pani chesaru...
i like it...
bagundi mi joku....
iam happy , iam not either...
Jaya garu commentinanduku kRtajnatalanDee.
suma lata gaaru, thanks andee..kaanee sorry, continue cheyyaleka potunna chinna postulu...
Post a Comment