పెళ్ళప్పుడు మా అమ్మ నన్ను
అప్పగిస్తూ మా వారితో...' అమ్మాయి సెవెన్ జాస్మిన్
హయిటు నాయనా, జాగర్త గా చూసుకో ' అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. మా వాళ్ళందరూ
అయోమయంగా మొహం పెట్టి,
"పాపం బాధలో ఏదో మాట్లాడుతోందిలే పిచ్చి తల్లి" అని సర్దుకున్నా, తర్వాత చుట్టూ చేరి,
మీ అమ్మ గారు ఏమన్నారు ఇందాకా అప్పగింతలప్పుడూ"
అని నన్నడిగారు."అదా....సెవెన్ జాస్మిన్స్ హయిటు అనగా 'ఏడు మల్లెల ఎత్తు' అని కన్నులు తుడుచుకుని కల కల నవ్వాను.
నాలుగు రోజుల తరువాత మా
సీతయ్య(అవును, ఎవరిమాటా వినడు) “మీ ఊళ్ళొ ఏం
పూలు పూస్తాయి” అనడిగారు. నేను ఉత్సాహంగా ”మల్లెలూ,చామంతులూ, బంతులూ..” అని లిస్ట్
చదవడం మొదలు పెట్టా."ఆగాగు,మల్లెల్లో ఏ రకాలు...సన్న జాజులా, బొండు మల్లెలా”?
అన్నారు. సన్నజాజులే ఎందుకు? అన్నాన్నేను.
"నాకు చూడాలనుంది,
మీ ఊరు వెళ్ళొద్దామా ఒక సారి" అన్నారు..నా మనసు మేఘాల్ని తాకిందీ 'హై హైలెస్సా'
అంటూ. మా చిన్నాడు లోపలికొస్తూ ' ఏంటీ ప్రయాణం
అంటున్నారు ఎక్కడికీ' అన్నాడు..'నువ్వు కూడా బయల్దేరు చిన్నా, ప్రాజెక్టుకి ఏవో వింతలు
విశేషాలూ కావాలన్నావుగా. మీ వదినా వాళ్ళ ఊళ్ళో వింత పూలు పూస్తాయిట. నా అభిప్రాయం ప్రకారం
వీళ్ళ ఊరిలో పూచే మల్లెలేవో గిన్నిస్ బుక్ కి ఎక్కాల్సిందే' అని నా వైపు తిరిగి
" మీ అమ్మ గారి లెక్క ప్రకారం ఏడు మల్లెలు డెబ్భయి కిలోలు ఉంటే, ఒక్కొక్క మల్లె
పూవు కనీసం పది కిలోలైనా ఉంటుందేమో కదూ...భలే కాదా మీ ఊళ్ళో మల్లెలు" అని వెటకారం బయట పెట్టేసారు. అవాక్కయి చూసా నేను, నలుగురిలో
ఏమీ అనలేక. అదిగో అప్పటి నించీ గుర్తొచ్చినప్పుడల్ల సన్నజాజీ, మల్లెతీగ, నాగమల్లీ అని పిలుపులొకటీ..
ఏదోలే, మా అమ్మని తలచుకొన్నట్టుంటుందని
ఆ పిలుపులన్నీ లయిట్ తీసుకున్నా కానీ ఆ పిలుపులకి తగ్గట్టే ఆ మల్లె పూల బరువు మరీ ఎక్కువ
కాకుండా రోజుకి కొన్ని గ్రాముల చొప్పున అవలీలగా పెరిగింది బంగారం ధర పెరిగినట్టు. అప్పటి
నుంచీ మల్లెల ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ, 'ఇలా అంటే నేను అన్నం తిననంతే'అని గారాలు
పోయా. మా అత్తగారు కల్పించుకుని 'ఏవిట్రా అదీ, పిల్లని తిననీకుండా...పిల్లల్ని కనాల్సిన
పిల్ల దిష్టి పెట్టకు అని వెనకేసుకొచ్చారు.
పైగా' వాడి ముందు తినకు'
అని వారు లేనప్పుడు రెండు మూడు రోజులకి సరిపడా ఒక డోసులో పెట్టేసి తినిపించేసేవారు. పాపం పెద్దావిడ అంత ప్రేమగా పెట్టినప్పుడు కాదనడం
ఎలాగ మీరే చెప్పండి?
ఉమ్మడి కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగాక, ఇంట్లో పిల్లలందరికీ అన్నం
పెట్టడం నా వంతు. యీ పిల్లల్ని పెంచడమేమో కానీ, ప్రతి పూటా వాళ్ళ కోసం
అన్నం కలపడం, వాళ్ళు తినకపోతే అయ్యో వేస్టు అయిపోతుందే అని బాధ పడి అలా నోట్లో
పడేసుకోడం. అంతే కాక పిల్లలు సగం తిని వదిలేసిన బిస్కట్లూ, చాక్లెట్లూ, అరిశెలూ, అప్పచ్చులూ.......మరి
సన్నజాజులు, విరజాజులు రూపాంతరం చెంది బొండుమల్లెలవక ఛస్తాయా!!!
మాకు ట్రాన్స్ఫర్ వచ్చి
ఇంకో ఊరు చేరాక, ఉమ్మడి కుటుంబంలో ఉండే సుఖాలన్నీ ఉష్ కాకీ..
ఇంటి పని ముగించుకుని,
పిల్లలని బడిలో దింపే పరుగుల్లో...పొద్దున్న హడావిడిగా ఏమీ తినకుండా ఆఫీసుకి వెళ్ళిపోయి, లంచుకి తీసుకెళ్ళిన చిన్ని డబ్బాలో వస్తువుని నలుగురితో
పంచుకుని తినడం వల్ల, పోనీలే ఏదో డైటింగు చేస్తున్నా అని ఫీలింగు వచ్చేది. ఆది వారం
ఆరు రోజులకి సరిపడా లాగించేసినా... అబ్బ పోదురూ.. ఆ మాత్రం తినకపోతే ఎలా అసలు!!
కాల క్రమేణా అవేవో డయిటింగులవీ
వచ్చాయి. తినడం మానేయక్కరలేదుట కానీ "ఒకే సారి తినకండి, కొంచెం కొంచెంగా చాలాసార్లు తినమని" డాట్రు గార్లు, డయిటీషియన్లూ టీవీల్లో అరచి అరచి
మరీ చెప్తారు కాబట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళ మనసు బాధ పెట్టడం బాగుండదు కనుక
, రెండు బ్రేకులు, ఒక లంచూ , డెస్క్ దగ్గర తినడానికి చిరు తిండీ, పళ్ళూ, ఫలాలు
( డ్రయి ఫ్రూట్స్ అన్నమాట) పట్టికెళ్ళేదాన్ని. ఈ మధ్య అన్ని ఆఫీసుల్లో కాఫీ మిషన్లు ఉద్దరగా ఉండడంతో మధ్య
మధ్యే పానీయాలతో మల్లె తీగ కళ లాడిపోతోంది.
ఇక పోతే వారంలో ఒక్కటంటే
ఒక్క రోజు.. అదే శనివారాలు అందరికీ ఫుడ్ తెప్పిస్తారు ఆఫీసులో. (ఏబీవీపీ ..ఎవడి బిల్లు
వాడే పే చేసే ప్రాతిపదికన) ఏదో నలుగురితో నారాయణ...
తినక పోతే బాగుంటుందా మీరు చెప్పండి! ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు తినడమే మానేసాను, మీరు నమ్మాలంతే,నమ్మక పోతే నా మీదొట్టు.
కాస్త మోకాళ్ళు నెప్పిగా
ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళని చేసుకోమంటానో లేదో "అమ్మా జిమ్ముకి వెళ్ళచ్చు కదా"
అని పిల్లలుమొదలెట్టారు. "ఛీ ఊరుకోండిరా,గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట, నాకు
అవన్నీ ఎందుకు? బోలెడు పని ఇంటా బయటా. ఇంట్లో
పనే నాకు పెద్ద జిమ్ము తెలుసా ? పొద్దున్న లేచినప్పటి నుంచీ ఎంత పని. వంట, ఇల్లు-వాకిలీ,
తుడుపుళ్ళు-కడుగుళ్ళు, అబ్బో "అంటూ, ముద్దు
మురిపాలొలుకు ముంగిళ్ళలో ముత్యాల ముగ్గు కథానాయిక చేసిన పని లెవెల్లో చెప్పి చెప్పి
ఊదరగొట్టేసా. ఇంక మల్లెలు, మల్లె తీగలు విషయాలు ఎప్పుడైనా డిస్కషన్ కి వచ్చాయంటే, గబ
గబా ఫోను కలిపేసి, అత్తయ్యా...ఊ..ఊ.. అని షికాయత్ లు. అక్కడి నుండి వార్నింగులు...హహహ..మరి
ఏటనుకున్నారు మనమంటే!!
“అసలు ఆడాళ్ళు ఇంట్లోనే
పదమూడు కిలోమీటర్లు నడిచేస్తారట తెలుసా! ఇంటి పని చేసుకుంటే 1000 క్యాలరీలు కరుగుతాయట”!
లాంటి ఆశ్చర్యకరమైన నిజాల్ని సేకరించి, ఎప్పటికప్పుడు మా ఇంట్లో అందరి మెదడు బోర్డ్
మీద స్క్రోల్ అయ్యే సదుపాయం కల్పించేసాను నేను. " నిను చూస్తూ మేముండలేమూ"
అని వాళ్ళు., " తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్..." అని
నేనూ హోరా హోరీ "ఇది సంగీత సంగ్రామమూ " అనే ప్రోగ్రాం పెట్టేసుకున్నాం. విజేతనైన నేను ఒక పక్కా, వాళ్ళ
నాన్న ఒక పక్కా ఎక్కువెక్కువ తిండి కుక్కి కుక్కి పెట్టేస్తున్నామని ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా పిల్లలు అందరి దగ్గరా కంప్లెయింట్లు చేసారు. వీలు
దొరికినప్పుడల్లా స్కూల్లో నేర్చుకున్న హెల్తీ ఫుడ్ హాబిట్స్ గురించి చిన్న చిన్న క్లాసులు
పీకడం, ఎవరితోనైనా పీకించడం వృధా అని వాళ్ళకి త్వరలోనే అర్థం అయ్యింది. దాంతో అందరూ
చెప్పినంత చెప్పి, మా వల్ల కాదు బాబోయ్ అని చూసీ చూడనట్టు వదిలేసారు.
మరి ఎవ్వరూ పట్టించుకోకపోతే
ఎలా అండీ..అలా పట్టించుకోడం మానేసారని నేను తెగ బెంగ పెట్టుకున్నాను తెలుసా! మొన్న
మా రాజీ ఫోన్ చేసినప్పుడు చెప్పింది "ఎవరయినా బెంగ పెట్టుకున్నా,
మానసికంగా ఆందోళనకు గురి అయినా బరువు పెరుగుతారంట"..చూసారా? ఇప్పుడు చెప్పండి
మీరు అసలు నా సమస్యకి కారణమేంటో!!
యీ మధ్య అద్దంలో చూసుకుంటూ.."ఏంటో,
మొహమంతా కళ తప్పింది, జుట్టు నెరిసి పోతోంది, కళ్ళ కింద నల్ల చారలొచ్చేసాయ్, బరువు
పెరిగి పోయిందీ..చాలా డిప్రెసుడుగా ఉందీ...ఏమైనా కాంప్లిమెంటు ఇవ్వొచ్చుగా" అని
అడిగా..."పోనీలే,అన్నీ ఎలా ఉన్నా నీ కళ్ళు మాత్రం చాలా పర్ఫెక్టుగా పని చేస్తున్నాయనుకుంటా"
అన్నారు. మనసు చిన్నబోయింది, కానీ మల్లె తీగ మాత్రం బాగా వృద్ధి చెందిందండోయ్!
అలా దిగులు(వృద్ధి) చెందుతూ
చెందుతూ ..దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టా...'లావొక్కింతయు లేదు...ధయిర్యము విలోలంబయ్యె'అని
ఒకటే మొరలు , ప్రార్థనలూ. 'అమ్మా నాగ మల్లీ..నీ ప్రార్థనలో యేదో దోషములున్నవి సరి చూసుకో
తల్లీ ' అని దేవుడు ఖంగారు పడ్డట్టనిపించింది ఎందుకో. 'అర్థం కావట్లేదు స్వామీ' అన్నాను,
కానీ ఆయన పలకలేదు. ఎంత అడిగినా మౌనమే సమాధానం. ఏమయ్యుంటుందబ్బాబ్బా అని ఎంత ఆలో...
చించినా అర్థం కాలేదు.
ఒక చిన్ననాటి స్నేహితురాలు
కలిసిందీ మధ్య. " మా దగ్గర పూజలు చేస్తున్నారు రాకూడదూ" అంది. " రానే,
దేవుడు నాతో పలకట్లేదు. దేవుడికీ నాకు కటీఫ్ అయ్యింది " అన్నా. ఆమె ఆతృతగా అడిగే
ప్రశ్నలకి తట్టుకోలేక ఇలా ఒక పద్యం చదివితే దేవుడు ఏదో సరి చేసుకోమన్నాడనీ, ఏం సరి
చేసుకోవాలో చెప్పలేదని , అదే పద్యం రోజూ చదువుతున్నాననీ చెప్పా. ఇంతకీ ఏం పద్యమది అని
అడిగి, " లావొక్కింతయు లేకపోవడమేంటే, నీ మొఖం .. నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి
చదివితే మరి దేవుడు మాత్రం ఖంగారు పడడా
?" అంది.. 'అదేంటీ చిన్నప్పటి నించి చదివే పద్యమే గా దేవుడి సిలబస్ మారిందా
" అనడిగా అమాయకం గా.. ఒసేయ్ మొద్దూ, వద్దు వద్దు దేవుడిని నువ్వు కంఫ్యూస్ చెయ్యకు' అని మందలించి “నీ సమస్యకి ఆ పద్యం కాదు
ఈ మంత్రం చదివాలి" అని చెప్పి మంత్రోపదేశం చేసింది.
యీ మంత్రం నాకు బాగా నచ్చేసింది...మీకు
కూడా నచ్చుతుందనీ, మీరు కూడా ప్రార్థిస్తారనీ తలంచి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను...ముందుగానే
చెప్పాను కదండీ మంచి మంచి వన్నీ మీతో పంచుకుంటానూ అని...అదన్న మాట విషయం...(అదిగో,
మీరు మెచ్చుకుంటున్నారని నాకు తెలుసు..ఎక్కువ మెచ్చుకోకండే..యీ మధ్యనే మంత్రం పని చేస్తోందండీ...మళ్ళీ
మీరు మెచ్చుకున్నారన్న ఆనందం తట్టుకోలేక ఉబ్బి తబ్బిబ్బయిపోతే..ఇంక మబ్బుల్లో నివసించాల్సి
వస్తుంది మరి!)సరే, ఇప్పుడు క్రింది మంత్రం ప్రతి రోజూ 108 సార్లు చదవండి...ఇంక ఆనందమానందమాయెనూ..అని
పాడుకుంటారు నాలాగే.
సన్నగా ఉన్నవారు యీ మంత్రాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి చదువుకోవలసిందిగా
విన్నపం..లేకపోతే తేడాలొచ్చేస్తాయండోయ్!! మంత్రాన్ని కస్టమైజ్ చేసుకునే విషయం లో ఎవరికి వారే బాధ్యులు. ఎట్టి
పరిస్థితుల్లోనూ నాకు బాధ్యత లేదని సవినయంగా
మనవి చేసుకుంటున్నాను. క్షమించెయ్యండి యీ మంత్రాన్ని తెలుగు లోకి అనువదించడం నాకు చేత
కాలేదు.
////Dear God: For
2020 and there on, all I ask for is a big fat bank account, and a slim body. Please do not mix up the two
like you did last year. Amen////
55 వ్యాఖ్యలు:
ఇది "మల్లెల వేళయని" ......ఇది "ఎన్నెల" మాసమనీ... :)
ఇదిగో మీ మంత్రానికి తెలుగు అనువాదం
" దేవుడా! ఓ మంచి దేవుడా ఈ ఏడాది అంటే ౨౦౧౧ నుంచీ నాకు తెగ బలిసిన బ్యాంక్ ఖాతాను, బక్కచిక్కిన శరీరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గతేడాది నువ్వు ఈ రెండిటి విషయం లో అనవసరం గా అయోమయపడిపోయి తారుమారు చేసినట్టు కాక కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని అనుగ్రహించు. నువ్వు చేస్తావ్. ఎందుకంటే బేసికల్ గా నువ్వు మంచి దేవుడివి. - హమ్మయ్య ఇప్పటికింతే!!!"
:)
:) :)
హహ్హహ్హా.. ఎన్నెల గారూ:)) ఎంత గొప్ప సదుపాయం కలిగించారండీ కిరణ్కీ నాకు:) మీరు చాలా మంచి వారు సుమండీ. మార్పులూ చేర్పులూ చేసుకుని తప్పకుండా ఆ మంత్రాన్ని చదివేస్తాం ఇద్దరం.
మీకు కూడా మీ మంత్రం మీరనుకున్న ఫలితాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను;) టపా కెవ్వు, కేక:))
baavundandi -:)
ఎన్నెల గారూ,
మీ బ్లాగులో ఇదే ఫస్టు పోస్ట్ నేను చదవడం.. :)
సెవెన్ జాస్మిన్స్ హైట్.. అయిన మీ కొత్త ప్రార్థనని దేవుడు విని మిమ్మల్ని త్వరలోనే ఏడు జాజులెత్తు సుకుమారిలా మార్చెయ్యాలని నేను కూడా మీ తరపున అడిగేస్తున్నా! :)
మల్లె తీగ అందం మల్లె తీగదే ఎన్నెల గారు.. :)..ఎన్నేళ్ళైన... :)
హహ..ఎంత మంచి వారండి..మా కోసం మంత్రాలూ కూడా ఇస్తున్నారు...
అదీ..customised మంత్రాలు..:D
Thank you ... :)
:)) బాగుంది..
ఏవిటీ, నా బ్లాగ్ కనిపించటం లేదా:) 'సెవెన్ జాస్మిన్ హైట్' నుంచి 'సెవెన్ లోటస్ హైట్' కి తగ్గితే తప్ప నేను కనిపించను మరి. ఈ కామెంట్ లోంచి వచ్చేయండి. అయినా అక్కడ ఏంలేదుగా.
సెవెన్ జాస్మిన్ హైట్ ....సన్నజాజులు ..బొండుమల్లెలు... ఏడు మల్లెలు డెబ్భయి కిలోలు ఉంటే, ఒక్కొక్క మల్లె పూవు కనీసం పది కిలోలైనా ఉంటుందేమో కదూ...అంత పెద్దగా పూస్తాయా మీ ఊళ్ళో మల్లెలు" ...పది కిలోల మల్లెపూలు రోజుకి ఎక్కువ కాకుండా కొన్ని గ్రాములు బంగారం ధర పెరిగినట్టు:)..మరి సన్నజాజులు బొండుమల్లెలవక చస్తాయ :) :) హ..హా..హ్హా.. సూపర్ భలే రాసారండీ. ఆ మంత్రం ఈ రోజు నుండి మేం కూడా చదివేస్తాం. కాని మంత్రం చెప్పి భాద్యత లేదంటే ఎలా :)
దొరికిందిలే...దొరికిందిలే..జోయగారి బ్లాగ్ తలుపు తెరిచిందిలే.....
జాస్మిన్స్ నించీ లోటస్ హయిట్ లోకి రావాలా? అంటే..ఏమో లెండి...మీ బ్లాగ్ ఓపెన్ అయ్యిందిగా...మీ సూచనల్ని బాగా ఫాలో అయినట్టే...
కృతజ్ఞతలండీ
శంకర్ గారు, //ఇది "ఎన్నెల" మాసమనీ//కృతజ్ఞతలండీ...వామ్మో...మీ అనువాదం అద్దిరింది సుమండీ...యీ లెవెల్లో ప్రార్థనలు చేస్తే, దేవుడు యేది అడిగినా టక్కున ఇచ్చేస్తాడు..శ్యూర్.
అపర్ణ, కిరణ్..మీ ఇద్దరి కోరికా నెరవేరాలని చిన్న ప్రయత్నం అంతే...రిసల్ట్స్ చెప్పడం మాత్రం మరచిపోకండి...కృతజ్ఞతలండీ..
శిశిర గారు కృతజ్ఞతలండీ.
మంజూ గారు, పరిమళం గారు,కృష్ణ ప్రియ గారు , మధుర వాణి గారు కృతజ్ఞతలండీ.
మీ నలుగురికీ స్వాగతం...సుస్వాగతం....
భాను గారు కృతజ్ఞతలండీ..యీ మధ్య అన్నిటికీ సంతకాలు పెట్టల్సి వస్తోంది కదండీ...పైగా నా లాంటి వాళ్ళు లావు శరీరం , బక్క బ్యాంకీ బ్యాలన్సూ ..కొవ్వు దాతా సుఖీభవ అనుకునేవాళ్ళు , బక్క శరీరం లావు బ్యాంకీ బాలన్సు...ఇంకా కంప్యూస్ అయిన వాళ్ళు, బక్క బ్యాంకీ బ్యాలన్సూ,బక్క శరీరం ...ఇలా పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ కలిపేసి..కంపూస్ అయిపోయి...నీ వల్లే నీ వల్లే అనే ప్రమాదాన్ని నివారించడానికన్న మాట..
" మీ అమ్మ గారి లెక్క ప్రకారం ఏడు మల్లెలు డెబ్భయి కిలోలు ఉంటే, ఒక్కొక్క మల్లె పూవు కనీసం పది కిలోలైనా ఉంటుందేమో కదూ...అంత పెద్దగా పూస్తాయా మీ ఊళ్ళో మల్లెలు"
ఇది మాత్రం సూపరు :)))
బాగా రాశారు :-)
:))
నిషిగంధ గారికి , మౌళి గారికి స్వాగతం...నచ్చినందుకు కృతజ్ఞతలండీ.
:))))))))))))))))))
మాలా గారూ...కృతజ్ఞతలండీ
హబ్బ! ఎన్నెలగారూ...నిన్న వేసారా ఇది? నేను మిస్ అయ్యా :( అప్పుడే ఇన్ని కామెంట్లు కూడా వచ్చేసాయ్! హ్మ్! ఏంచేస్తాం!
ముందుగా మీ పోస్ట్ ఎప్పటిలాగె..కెకలు..అరుపులు...
>>మరి సన్నజాజులు, విర జాజులు రూపాంతరం చెంది బొండుమల్లెలవక ఛస్తాయా!!!
హెహెహె! నాకు ఈ లైన్ భలే నచ్చిందీ!!
>>లావొక్కింతయు లేదు...ధయిర్యమువిలోలంబయ్యె'........
ఆగండాగండి దేవుడేదో అంటున్నాడు....'అమ్మా నాగ మల్లీ..నీ ప్రార్థనలో యేదో దోషములున్నవి సరి చూసుకో తల్లీ ' అని అంటున్నట్టుంది.
ఇది ఇంకో సూపరు లైను....
ఇక ఫైనల్‌గా మీ మహామంత్రం కూడా బాగుంది :) కానీ అదేదో ఇంగ్లీషు మంత్రంలాగ ఉందికదా....మన తెలుగు మంత్రమ్య్యుంటే బాగుండేది చెప్మా అని అనుకున్నంతలో శంకర్ గారు ఆ ముచ్చటా తీర్చేసారు :) SHANKAR.S.....you rock!!
మొత్తమ్మీద ఈ పోస్ట్‌లో కూడా విజయవంతంగా నవ్వించేసారు :) త్వరలోనే మీరు జాజితీగలాగ సన్నగా...నాజూగ్గా అయిపోవాలని కోరేసుకుంటున్నానోచ్! :))
సన్నజాజులు అయినా,బొండు మల్లెలయినా,ముద్దబంతులయినా...పూలు ఏవయినా అందంగానే ఉంటాయి,కాబట్టి బాధ పడకండి.
సన్నజాజులు అయినా,బొండు మల్లెలయినా,ముద్దబంతులయినా...పూలు ఏవయినా అందంగానే ఉంటాయి,కాబట్టి బాధ పడకండి.
అను గారు కృతజ్ఞతలండీ...అంతేనంటారా!మంత్రం బాగ పని చేస్తొందండీ..మీరూ కస్టమయిజ్ చేసి చదివెయ్యండి..యేదో ఒక లయిను తప్పకుండా పనికొస్తుంది
ఎప్పటి లాగానే టపా చాలా బాగుంది. మీ ఇంగ్లీష్ మంత్రానికి S. Shankar గారి అనువాదం ఇంకా బాగుంది. తెలుగులోనే వేడుకోండి. తెలుగు దేవుడు వెంటనే వింటాడు.
అను గారన్నట్టు ముద్దబంతి పూవులైనా అందంగానే ఉంటాయి. :):):)
ఎన్నెల గారూ
చాలా బాగుందండీ. మీ ప్రార్ధన, దానికి శంకర్ గారి అనువాదం అదుర్స్. నేను కూడా నాకు కావాల్సినట్టుగా ( బక్క శరీరం, లావు బేంక్ బేలన్సే, కానీ బయటకి అలా చెప్పేస్తే బాగోదని) మార్చుకొని చదివేసుకుంటాను. మీ కోరిక నా కోరిక కూడా తీర్చమని ఉమ్మడిగా కోరుకుంటాను లెండి.
మొన్నెప్పుడో అపర్ణ గారు కొవ్వు కావాలో అని గొడవ పెట్టటం చూసాను. అమ్మా, అపర్ణా, తొందరపడకమ్మాఅని చెప్దామనుకున్నాను, ఎందుకంటే మీరన్నట్టు సన్నజాజులు, మల్లెలు బొండుమల్లెలు ఏమి ఖర్మ, అప్పుడప్పుడు నంది వర్ధనాలు కూడా అవుతాయి కదా, స్వానుభవం మరి. ఒకప్పుడు నాకన్నా సెవెన్ జాస్మిన్సే హైట్ :-))
పద్మవల్లి
ps : గుర్తున్నానా. మా అన్నగారెలా ఉన్నారు. అప్పుడెప్పుడో ఇందు గారి బ్లాగ్‌లో.. సీతమ్మ .....
//ఏంటొ, మొహమంతా కళ తప్పింది,జుట్టు నెరిసి పోతోంది,కళ్ళ కింద నల్ల చారలొచ్చేసాయ్,బరువు పెరిగి పోయిందీ..చాలా దిప్రెసుడు గా ఉందీ...ఏమైనా కాంప్లిమెంటు ఇవ్వొచ్చుగా" అని అడిగా..."పోనీలే,అన్నీ ఎలా ఉన్నా నీ కళ్ళు మాత్రం చాల పర్ఫెక్టుగా పని చేస్తున్నాయనుకుంటా" అన్నారు..
Idhi highlight ennela akka. Nenu Aparna gurinchi comment pedadhamu anukunna nuvvu thana gurinchi post lo vesav.
manaki kooda same problem.. Amma "orey Sambandalu chusthunnam, koncham sannu padu ante".. Na manasu chusi ammayi ravali kani naa six pack ni chusi kadu.. ani vankalu cheppi tappinchukuntunna..
మీరు పదిలంగా అల్లుకున్న మీ ఎన్నెల బ్లాగ్ ని మీ సన్నజాజులతో మరింత పరిమలింజేశారు.మీ సన్నజాజుల పరిచయం వాటి సువాసన అంత బాగుంది మరి...అయితే అందరిని మీ సన్నజాజులా తోటలో అలా అలా షికారు చేయించరన్న మాట:)
చాల చాల బాగుంది మీ టపా.
పద్మ వల్లి గారు కృతజ్ఞతలండీ...అయ్యో, మిమ్మల్ని మర్చిపోవడమేంటి సీతమ్మ గారూ, మీ అన్నగారు అడిగారు కూడా మొన్ననే మీరు ఎప్పుడూ ఇక్కడ కనిపించలేదే అనీ...ఇప్పుడు చెపుతా లెండి.అయినా 'ఎలా ఉన్నారు?' అన్నది ఒక ప్రశ్నా చెప్పండీ...మీరు, వారు ఎప్పుడూ బానే ఉంటారండీ...ఎటొచ్చీ..అక్కడ మిస్టర్ రామయ్య గారు ఇక్కడ మిస్సెస్ రామమ్మ (నేను) ఎలా ఉన్నారు అన్నదే ప్రశ్న..హహహ ....
//ఒకప్పుడు నాకన్నా సెవెన్ జాస్మిన్సే హైట్//అంటే మీరు అపర్ణ , కిరణ్ వాళ్ళ బ్యాచా...!!!!!
శశీ కృతజ్ఞతలు. అయ్యో, మీకు కూడా తప్పట్లేదా...'//నా మనసు చూసి అమ్మాయి రావాలి కానీ నా సిక్స్ ప్యాక్ చూసి కాదూ//..హాహహ్..నిజమే కానీ,"ఇంకా ఎందుకు మీకు చింత -మంత్రముందిగా మన చెంత".అమ్మ మాట వినీ మీరు మీ పేరుకి తగ్గట్లు ఉండేట్లా కస్టమయిజ్ చేసేసుకోండి..ఇంక మనసెరిగిన మెరుపుతీగ లాంటి అమ్మాయి తథ్యము సుమతీ...ఆడ పడుచు కట్నాలు ఘనంగా ఉండాలి సుమండీ....
ఇందూ గారూ, కృతజ్ఞతలండీ ..అవునండీ అగ్నానంతో లావొక్కింతయ్ లేదు పద్యం చదివేసా ఇన్నాళ్ళూ, దేవుడు చెప్పబట్టీ సరిపోయింది గానీ...ఎంత అన్యాయమయిపోయేదాన్నీ! అవునండీ శంకరి గారి ట్రన్స్లేషన్ అసలు సూపరో సూపరు..అసలు నా పోస్టు అచ్చు తప్పుల కోసం ఒక సారి చదివా కానీ...శంకర్ గారి ట్రాన్స్లేషన్ మాత్రం ఎన్ని సార్లు చదివానో లెక్క కూడా లేదు...ప్రతి సారీ నవ్వొచ్చేస్తోంది...ప్రత్యేకంగా దేవుణ్ణి ఒళ్ళు దగ్గర పెట్టుకునీ.....ఆ లయిను...అహహహాహ్
సుబ్రహ్మణ్యం గారూ, కృతజ్ఞతలండీ ..హమ్మో, శంకర్ గారా మజాకా..//తెలుగులోనే వేడుకోండి. తెలుగు దేవుడు వెంటనే వింటాడు.//అవునండీ తెలుగులో చదివితేనే దేవుడికి బాగా అర్థం అవుతుంది...మీ సలహా అందరం పాటించేస్తాముగా
ఎన్నెల గారూ
ఔనండీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. మళ్ళీ వద్దాం అని తొందరలొ వెళ్ళిపొవటం, తరువాత, దొంగలు పడ్డ ఆరు నెలలకి యెందుకులే అని (సామెత కొంచెం బాగోలేదనుకోండీ..) అలా.. అలా..అన్నమాట.
మీ ఎన్నెల రామాయణం మాత్రం చదవలెక (భాష అర్ధం చేసుకోలేక) పారిపోయాను.
"మీరు, వారు ఎప్పుడూ బానే ఉంటారండీ..." ఇదే మిస్టర్ రామయ్య గారి డైలాగ్ కూడా..
//ఒకప్పుడు నాకన్నా సెవెన్ జాస్మిన్సే హైట్//అంటే మీరు అపర్ణ , కిరణ్ వాళ్ళ బ్యాచా...!!!!!
అంటే .. అంటె... అనగా అనగా అనగా ఒకప్పుడన్నమాట.ఇలాగే లావవ్వాలని, ఎవరో చెప్తే, అచ్చమయిన నెయ్యితొ చేసిన స్వీట్స్ కొనుక్కుని, బయటకు వచ్చెలా ఉన్న, కళ్ళూ మూసుకొని మింగేదాన్ని. ఒక వారం చేసి విరక్తి వచ్చి మానేసాను. ఇప్పుడేమో అన్ని దానాల్లోకీ కొవ్వు దానమే గొప్పది అని ఒక ఉద్యమం కూడ మొదలు పెట్టొచ్చు నేను. (మరీ అంత కాదులెండి కాని బొండు మల్లెలే).
.ఇంక మనసెరిగిన మెరుపుతీగ లాంటి అమ్మాయి తథ్యము
//merupu teega ante naaku simharasi movie lo dialogue gurthuku vasthundhi..
mari merupu teega ante pattukovatam kastam akka..
adupaduchu katnam tappakunda istam... koncham mee bank account nundi test transfer ga oka 1000$ veyyandi.. inka future lo katanam ragane oka 5% share meeku transfer sestham..
seven jasimin height abba!vennella garu
yemi rasarandi first mi tappa chusee
baddakicha kusinta chala vundi matter
yemito.. anni
tarwata telisindi chadavakapote miss
ayedani anni.intaki miru anukunatalu
malle tigani miku ivvalani na tarupunumchi....
పద్మ వల్లి గారూ, ఇప్పుడు మీ నెయ్యి మిఠాయిల కథ కంప్లీట్‌గా అర్థం అయ్యిందండీ.
తృష్ణ గారి కోసం రామాయణం మల్లీ మామూలు తెలుగు లో కొంచెం మార్చాను...అది చదవండి వీలైతే. రామాయణం వర్గం లో ఉంది...ఎన్నెల రామాయణం తృష్ణ గారి కోసం అని.....
శశీ పోనీ మెరుపు తీగలొద్దులే, మనసెరిగిన సన్న జాజి లాంటి అమ్మాయి తథ్యము అందాము.ఇప్పుడు ఓకే నా?
దానిదేముందీ...అలాగే చేద్దాం...అలాంటి పట్టింపులేమీ లేవు...ఇయ్యడానికీ రెడీ, తీసుకోడానికి డబుల్ రెడీ....
అశోక్,కృతజ్ఞతలు..మీకు నచ్చినందుకు చాలా హాప్పీ ..మీ కామెంటు లో కవి హృదయం కనిపించేస్తోందండీ. ఒక మంచి కవిత వెయ్యండి మరి..యీ మధ్య కనబడ్డం మానేసారు.
సుమలత గారూ కృతజ్ఞతలండీ...ప్రతి సారీ చిన్నగా వ్రాయాలి అనుకుంటానండీ ..అది అలా అలా పెద్దదయిపోతుంది...అసలు చివర్న ఉన్న మంత్రము ఒకటే పొస్ట్ చెయ్యాలి అనుకున్నాను...ఏదో కొంచెం ఇంట్రొడక్షన్ ఇద్దాము అని మొదలు పెడితే అంత లంబా చౌడా కహానీ అయ్యింది మరి... మీకు నచ్చినందుకు నేను హాప్పీ.
అబ్బ ఎంత బాగా రాశారు అండీ,
సన్నజాజులు ఎంత గుబాళిస్తున్నాయో
చాలా బావుంది .
మిగిలిన పోస్ట్ లు అన్ని తీరిగ్గా వచ్చి చదువుతాను.
//చివర్న ఉన్న మంత్రము ఒకటే పొస్ట్ చెయ్యాలి అనుకున్నాను...ఏదో కొంచెం ఇంట్రొడక్షన్ ఇద్దాము
introduction ilaga vunte, ika essay rayamante ela rasthavo akka..
లత గారూ కృతజ్ఞతలండీ. మీ కామెంటు కూడా సన్నజాజుల్లగే పరిమళిస్తోంది.
నా బ్లాగ్ కి స్వాగతం
శశీ, ఎస్సేల గురించి అడక్కండి మళ్ళీ మీరు తట్టుకోలేరు...వృత్తి మారినా ,లెక్చర్లు పీకే అలవాటు పోవట్లే ..అదీ విషయం
"సన్నజాజులోయ్ " అన్న మీ పిలుపు " శనక్కాయలోయ్ " అన్నట్టు వినిపించింది ..
నా చిన్నప్పుడు మా ఊళ్ళో శనక్కాయలమ్మేవాడు అలాగే అరిచేవాడు మరి.
డిస్ట్రబెన్సు ఎక్కువ గా ఉన్నట్టు అనిపించి హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి మళ్ళీ చదివా, అప్పుడు క్లియర్ గా వినిపించింది " సన్నజాజులోయ్ అని ".
పూర్తిగా చదివాకా తెలిసింది , సన్నజాజులు ఉంటే సువాసనే కాదు , నవ్వు కూడా ఇట్టే వచ్చేస్తుంది అని .
తెల్లటి బొండుమల్లెలతో , ఎవర్ గ్రీన్ పోస్ట్ ..
"యీ పిల్లల్ని పెంచడమేమో కానీ, ప్రతి సారీ వాళ్ళకని అన్నం కలపడం...వాళ్ళు తినకపోతే అయ్యొ వేస్టు అయిపోతుందే అని నోట్లో పడేసుకోడం.ఇంకా వాళ్ళు సగం తిని వదిలేసిన బిస్కట్లూ, చాక్లెట్లూ,అరిశెలూ, అప్పచ్చులూ.......మరి సన్నజాజులు, విర జాజులు రూపాంతరం చెంది బొండుమల్లెలవక ఛస్తాయా!!!"
పెళ్ళికి ముందు సన్నజాజుల్లా, మల్లెతీగాల్లా ఉన్న అమ్మాయిలు , ఆ తర్వాత బొండుమల్లెల్లా ఎందుకు తయారవుతారబ్బా , అనుకుంటూ ఉండేవాడిని ఇప్పటి వరకూ .
ఒక పేద్ద సందేహం తీర్చారు . థాంక్స్ ..
స్వామీ గారూ
మీకు , మీ చిలిపి బుజ్జిగాడికీ స్వాగతమండీ...
హహహహ్ శనక్కాయలోయ్ అని వినిపించిందా?...
//డిస్ట్రబెన్సు ఎక్కువ గా ఉన్నట్టు అనిపించి హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి మళ్ళీ చదివా, అప్పుడు క్లియర్ గా వినిపించింది// ఇది సూపరు
వెరయిటీగా భలే ఉంది మీ కామెంట్
పెద్ద సందేహం తీరిందా?...హహహ...కృతజ్ఞతలండీ...
ఇప్పుడే మీ మొదటి పోస్ట్ నుంచీ అన్ని పోస్టులూ చూశా. తెలంగాణా రామాయణం కేకో కేక. అప్పుడెప్పుడో కవయిత్రి మొల్ల...ఇప్పుడు బ్లాగర్ ఎన్నెల.
ఇక "పిలచిన బిగువటరా" లో ఫైర్ అలారం సీన్ నవ్వుకోడానికి బావున్నా. ఆ టైం లో మీ కుటుంబ సభ్యుల మనస్థితి తలచుకుంటే ......అబ్బా ఈ కాస్త టైం కూడా వీళ్ళకి దొరకనివ్వరా అని ఆ "మగానుభావుల" మీద భలే కోపం వచ్చిందండీ. అంతగా ఇన్ వాల్వ్ అయి చదివా.
అన్నట్టు నా బోణీ "కామెంటింగ్" మీకు అచ్చోచ్చిందండీ. మీకు ఎక్కువ కామెంట్లు వచ్చిన మొదటి రెండు "ఓ స్త్రీ రేపు రా" అండ్ "సన్న జాజులోయ్" కి మొదటి కామెంట్ నాదే. మీ తరవాత పోస్టులకీ ఇలాగే కామెంట్ చేస్తా.కానీ నాకేంటి ...ఆ నాకేంటని (అహ నా పెళ్ళంట సినిమాలో కోట అరచేతిలో అరచేతితో కొడుతూ అడుగుతున్న స్టైల్ లో) .....
:)
ఇంతింత పెద్ద పోస్టులు రాస్తున్న మీ ఓపికను చూస్తే అసూయ కలుగుతోంది. ఎలా రాయగలుగుతున్నారండీ బాబూ!
శంకర్ గారూ, అన్నీ చదివినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మో, మళ్ళీ ఒక సారి నా మనసు 'మేఘాల్ని తాకిందీ హైహైలెస్సా....
అలా అంటున్నారు కానీ నా పోస్టు కంటే..ఇక్కడ మీ కామెంటే సూపరు తెలుసా...నేను ఎన్ని సార్లు కామెంట్ సెక్షనుకి వచ్చానో...మళ్ళీ మళ్ళీ ఆ అనువాదం చదవడానికీ...హమ్మొ హమ్మో...అస్సలు ఏంటదీ....ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకోమనే లయిను...వెయ్యోసారయినా నేను నవ్వకుండా ఉంటానేమోనని ప్రయత్నించా...ఊహూఊ
చదువుల కోసం నయిట్ ఔట్లు అలవాటయ్యాయండీ..ఇప్పుడు ఇలా వ్రాయడం కోసం నయిట్ ఔట్ చేస్తున్నా అంతే...
నిజమేనండీ, నేనే ఆ మాట చెపుదామనుకున్నానండీ కానీ బెట్టీ వినేసి మళ్ళీ ఏమయినా అడ్డుపుల్లలు వేస్తుందని భయమేసి చెప్పలేదండీ...
ఇంతకీ మీకేంటీ అంటారా? అలా నాతోనే చెప్పిస్తే ఎలా అండీ...పోనీలెండి చెప్పేస్తా...మీ ఇంటికొచ్చినప్పుడు..చీరా పువ్వులు గాజులూ ఇచ్చేస్తే, ఇక్కడకొచ్చి మా పుట్టింటికెళ్ళొచ్చా అని చెప్పుకుంటా...ఏంటీ కంఫ్యూస్ చేసానా? మిమ్మల్ని సోదరుడుగా స్వీకరించేసానండీ..
//.అబ్బా ఈ కాస్త టైం కూడా వీళ్ళకి దొరకనివ్వరా అని ఆ "మగానుభావుల" మీద భలే కోపం వచ్చిందండీ// మరి ఇలా ఫీల్ అయ్యేది సోదరుడు కాక ఇంకెవరు చెప్పండి!
"మీ ఇంటికొచ్చినప్పుడు..చీరా పువ్వులు గాజులూ ఇచ్చేస్తే, ఇక్కడకొచ్చి మా పుట్టింటికెళ్ళొచ్చా అని చెప్పుకుంటా"
అంతకన్నానా. మీరు ఎప్పుడొచ్చినా సరే మీకు పుట్టింటి మర్యాదలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు గ్యారంటీ
శంకర్ గారూ...ధన్యవాదాలండీ, ఇప్పుడే ఇండియా వచ్చెయ్యాలని ఉంది..
మరి మా ఇంటికో...నేను కూడా బొట్టు, పళ్ళు, గాజులు, వెంకటగిరి చీర(లు) ఇవ్వాలిగా. ఇప్పుడు ఏడు మల్లెల సైజు కాదు కాబట్టి లోటస్ అంత సైజు గాజులు, ఇంద్రధనుస్సు రంగులతో ఇస్తాను. సరేనా:)
:))
Customized నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి మీకు కూడా :))
హాహ్హాహా
జయ గారూ, సన్న జాజులు ఎంత బరువు పెరిగినా..గాజుల సయిజ్ పెరగదండీ..నేనయితే అవే గాజులు వాడుతున్నా...వచ్చాక కొనిపించుకుంటాలెండి మీతో ఇంద్రధనుస్సు రంగుగాజులు .మాలా గార్ని కూడా పిలిచి సుల్తాన్ బజార్ వెళదాం...చీరలంటారా..అదే లాభం..సయిజ్ ప్రాబ్లంస్ ఉండవ్..వచ్చేస్తా..మీ చీరలు దోచేస్తా..కాస్కోండి మరి..
హరే గారూ..కృతజ్ఞతలండీ..యేంటీ యీ మధ్య లావెక్కినందుకు కూడా నొబుల్ ఇస్తున్నారా! అరెరె తెలియదండీ నాకు...తెలిస్తే యీ పాటికి నాలుగు సార్లన్నా వచ్చేవి...అయినా మీరు ఇచ్చేస్తున్నారుగా..ఇంక నో ప్రాబ్లెం. ఒక సందేహం...ఇంతకీ మీరు ఇస్తున్నది నో'బెల్లా' నో 'బుల్లా'?
శంకర్ గారు, మీరు అంతగా 'నాకేంటి నాకేంటి' అన్నాకూడా ఎన్నెలమ్మ మీకు పైకం ఇస్తానని చెప్పలేదు చూసారు....పైగా రివర్సులో మీరే ఏదో ఒకటి ఇచ్చుకోవలెనట ;)
@నాగార్జున గారు ఒక సోదరుడిగా ప్రేమను పంచే అవకాశమే ఇచ్చాక అంతకన్నా ఇంకేం ఇవ్వాలండీ ? ఇంటికొచ్చిన ఆడపడుచుకి చీర, గాజులు పెట్టే అవకాశం కన్నా ఇంకేం కావాలండీ? అది ఇచ్చుకోడం కాదండీ ...సోదరి ప్రేమని పుచ్చుకోడం
shankar గారు...easy easy...నేనేదో సరదాకి ఆమాట అన్నాను looks like it didn't workout and i now get some అక్షింతలు ;)
Ok. అప్పుడప్పుడు అక్షింతలు కూడా పడుతుండాలిలెండి :) :D
శంకరా, నాగార్జునా, పరమాత్మా...రక్షించు తండ్రీ...హెల్ప్ ..ముఝే బచావో...... పాహిమాం! పాహిమాం!!!
ఎన్నెలమ్మా...ఈ పరమాత్మ ఎవరు ఆయనకూడ ఏదైనా అన్నారా...సర్లెండి నేను సర్దిచెబుతా...
పరమాత్మ గారు, నేను అలా రాసినందుకు మీరు ఖోప్పడొద్దు, ఉత్తినే రాసాను. శంకర్‌గారు ప్రైవేటు తీసుకున్నాక విషయం ఎటో వెళ్ళిందని అర్దమయింది...మీరు లైట్ తీసుకోండి. 'పాహిమామ్' అని ఎవరినో కాపాడాలంట ఎన్నెలగారు హెల్ప్ అడుగుతున్నారు నేను వెళుతున్నా వీలైతే మీరుకూడా రావచ్చు
ప్రార్ధన
నాగార్జున గారూ...నేను శంకరుడు, నాగార్జునుడు అయిన పరమాత్మ..ఈశ్వరుడ్ని పిలిచానండీ పాహిమాం అని..హహహ .మీరు మా లక్ష్మణుడి లాగా చాలా కామెడీ..మా తాత గారు(93) మంచం మీద పడుకొని...రామా రామ అనుకుంటూ ఉండేవారు...మా లక్ష్మణుడు, ఆ పక్కనున్న కిటికీ దగ్గరికెళ్ళి..వచ్చాను రామా అనేవాడు...తాత గారు ఆయనతో రాముడు మాటాడుతున్నాడని మాతో చెప్పేవారు కూడా..ఆయన అలా తృప్తి పడుతున్నందుకు మాకు హాప్పీగా ఉండేది...
సీరియస్ లు, అక్షింతలు యేమీ లేవండీ..అంతా సరదాగానే....
మీ ప్రార్థన లింకు కూడా మీ కామెంట్ల లాగే సూపరు...నేను కూడా ఆ టైపు లోనే ప్రార్థన చేసానన్నమాట..హాహాహ్
మీరు భలే ఫన్నీగా రాస్తున్నారు.
నవ్విస్తునందుకు ధన్యవాదాలు.
////Dear God: For 2011 and there on, all I ask for is a big fat bank account, and a slim body. Please do not mix up the two like you did last year. Amen////
ఎంత చిన్న ఆశ కోరుకున్నారండీ... :-)
బుజ్జి గారికి, భాస్కర రామి రెడ్డి గారికి కృతజ్ఞతలండీ...సారీ అండీ మీ కామెంట్లకి రిప్లయి ఎలా మిస్ అయ్యానో తెలీలేదు.
Post a Comment