నిజం చెప్పొద్దూ అన్నమాచార్య కీర్తనలన్నీ అస్సలైతే మా వారు రాయాలనుకున్నారట....కానైతే 'ఇంకానేను అనుకోకుండానే ఆల్రెడీ ఇలా అచ్చయిపోయి ఉన్నాయేంటబ్బా' అని చాలా ఫీల్ ఐపొయ్యి ..బాధతో విరక్తి చెంది..పెన్ను ముట్టుకోవడం మానేసారంట... లేకపొయ్యంటే సుభద్రా పరిణయం వ్రాసిన కవయిత్రిగా నాకెంత వైభవమొచ్చేదో మీరూహించండి. ఏమాటకామాటే చెప్పుకొవాలికానండీ, ఆయన అలా అంటున్నప్పుడల్లా 'పోదురూ బడాయీ' అని నేననుకోని రోజు లేదు..కానైతే యీ బ్లొగు వ్రవెశం చేసాక కానీ నాకు ఆ విషయం తెలియలేదు...
ఒకానొక రోజు పరీక్షా కాలంలొ (అంటే ఎక్జాముల టైములొ అన్న మాట)బుర్రకాయ వేడెక్కి పొయ్యి చెవుల్లోంచి పొగలు చిమ్ముతున్న వేళ ...అల అల నెమ్మదిగ.....ఉష్......ఇంట్లొ యెవరైన చూస్తే చిన్నా పెద్దా అని లేకుండ క్లాసు పీకుతారు...కంప్యుటర్ లొ ఈనాడు చదువుకుందామని చిన్ని ప్రయత్నం చేసానా....దీనికి కూడా నేనంటే చులకన...అస్సలు మాట వినలెదు.....పొనీలే అని గూగులమ్మనడిగా....కుంచుం సహాయం చెయ్యమని......ఇంకెముందీ....శబ్బాసురా శంకరా అంటూ వేణు గారి బ్లాగ్ లోకి తీసుకెళ్ళిపొయ్యి
లోకమంతా తిప్పేసి ఇందు గారిని , జ్యొతి గారిని, శివ రంజని గారిని, శిశిర గారిని, నాగార్జున గారిని పరిచయం చేసేసింది.... ఇంక చాలు గూగులమ్మా యీ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని యెంత గొడవ చేసినా వినలేదంతే. పైగా ఇంత హాప్పీగ తోడుండి తిప్పేవాళ్ళూ నీకెవరన్నా ఉన్నారా అని మరీ గదమాయించింది. నేను కూడా అవును నిజమే అనేసుకుని ఇంక బయటికి రాకుండా అక్కడే ఉండిపొయ్యాను...అంతలొ.....తలుపు కిర్రునా చప్పుడైనది...గుండె ఝల్లునా కొట్టుకున్నదీ..మెల్లి మెల్లిగా నే కళ్ళుతెరిచి ఆ వచ్చినదెవరొ చూసాను.......
యెవలాలూ అని మీకు నాకుమల్లేనే డౌటు వచ్చిందా? అయితే మీరు ఇంకా మెళకువగానే ఉన్నరన్నమాట....హమ్మయ్య..అయితే నేను ఇంకా చెప్పచ్చు.
అబ్బే యెవ్వరూ లేరు ...అంతా నా భ్రమ ....కానీ ఆ దెబ్బకి ఒంటి మీద 'సొయొచ్చీ సదూకొవాలె ఇగ నడువు అని నన్ను నేను అదిలించుకున్నా. అబ్బ అంత వీజీగ వినేస్తే మనమేమి గొప్పోళ్ళమండీ అప్పటికప్పుడు ఇంద్ర భవనం లాంటి బ్లాగు కట్టెయ్యాలని... దానికి ఎన్నెలని పేరెట్టెయ్యాలని..బోల్డు కబుర్లు మీతో చెప్పెయ్యాలని...బోల్డు బోల్డు బ్లాగులకు రోజు వెళ్ళి తలుపులు కొట్టాలనీ.... ఒకటే ఇది.....ఆ ఊపులో పుస్తకం ముందేసుకుని
ఇన్నాల్లు యాడుందొ యీ గంగ
ఉర్కుర్కి రావట్టె ఆత్రంగ
కతలు రాయవట్టె సిత్రంగ
శబ్బసురా శంకరా...
.అని భరణి గారిని తలుచుకుని "మమ" అనేసుకున్నానన్నమాట...
అజ్జిబాబోయ్ యీ ఇషయం ఇప్పుడు సెప్పీసినాన? ఇంట్లొ వాళ్ళు సదివేసి ఏటంటారొ ఏటో . అయినా నాకేటి దిగులు....పరీచ్చలు అయిపొనాయి గంద.... కూసింత కలాపొసన ఉండాల అని సెప్పీనూ?ఓఓఓఓఓ ఇదయిపొతుంటారూఊ...
సరే అని ఇంత కాలం అది రాయాల ఇది రాయాల అని అనేసుకోవడం చాలా 'విజ్జీ' చిన్నప్పుడు పరీక్షలయ్యాక 'ఎలా రాసావమ్మ అని అడిగితే ఎంత "విజ్జీయొ" అని చెప్పిన కంటే ఇంకా యెక్కువ "విజ్జీగా" తీసుకున్ననన్నమాట.ఇంక యేమి వ్రాయాలో తెలియక మీతో వ్రత కథా శ్రవణం చేయించేసి మీకు బోల్డు పుణ్యం సంపాదించి పెట్టేసానా? మరి అక్కడి నుంచీ అన్నీ భవసాగరాలే . ఆలోచించీ చించీ చించీ .....విరక్తి వచ్చేసింది.... ఆ విరక్తిలొ చిన్నప్పుడు భక్తి రంజనిలొ వచ్చే తత్వాలు గుర్తొచ్చేసాయి. నేను ఇంత తాత్వికినని ఇంత కాలం తెలియదు సుమా! ఓ యీ సుమా యెవరూ అంటారా మా అత్తగారు పరిచయం చేసారు లెండి..
సరే సుమా గురించి మళ్ళీ యెప్పుడైనా చెపుతా గాని నా ఫిలాసఫీ గురించి కొంచం మాట్లాడుకుందాం. పాపం మా వారు అన్నమయ్య ని అపవాదు చేస్తే యేమొ అనుకున్నా గానీ నాకూ కళ్ళు పత్తి కాయల్లా విచ్చుకుని బోధిసత్వుడిలా
జ్ఞానోదయమయ్యింది.. ఓన్లీ తేడా యేంటంటే ఆయన కళ్ళు సహం మూసుకుని ఉంటే నేనేమో సహం తెరుచుకుని ఉంటున్నానన్నమాట. ఆ వొచ్చిన జ్ఞానం జ్ఞానం యెంత తాత్వికం చేసేసిందంటే, యేది చదివినా " చీ నేను వ్రాద్దామనుకున్నా , వీళ్ళు వ్రాసెసారు" అని భయంకరమైన వ్యాధిని కూడా వెంట తెచ్చేసింది. ఆ విరక్తి + వ్యాధి+ తత్వం + వేదాంతం = యీ కింద వ్రాయబడిన 'కపిత్వం' ....అబ్బా దీని మీనింగు కూడా అడిగారంటే
నేను మీ జట్టు కచ్చయిపోతానంతే. మరి ఇంక చదవండి.... పదండి ముందుకు పదండి ముందుకు...అదిగొ మళ్ళీ శ్రి శ్రి కవిత అనుకున్నారా? అబ్బే కాదండీ అర్టీసీ బస్సు.... ఓకే టికట్ తీసుకున్నారు కదా ఇప్పుడు తీరిగ్గా కూచుని చదవండి మరి.....
మా ఊరీ ఎర్ర బస్సు
ఎర్రిదని నేనందమంటే
శివరంజని అడ్డమొచ్చి
అంత మాటని పోయె లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....
ఈ టీవీ చూసి నేను
నేటి వార్తలు రాద్దమంటే
మొన్ననే మన శిశిర గారూ
వ్రాసి పారేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....
కాలేజీ కబురులన్నా
కరువు తీరా చెపుదమంటే
చిన్నవారూ నాగార్జున
చించి చెప్పేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....
షడ్రుచులతొ నోరూరగ
పాక కళనూ చూపబోతే
రుచి రుచిగా జ్యొతి గారూ
వండి వడ్డించారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....
నెమలీకలు గుర్తుకొచ్చీ
చిన్ని కతలూ వ్రాయబొతే
మక్కువతో ఇందు గారూ
అచ్చు వేసేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....
శబ్బాసుర అంటు నేను
"భరణిని" కీర్తిద్దమంటే
మస్తు మస్తుగ వేణు గారూ
పుస్తకాలేసారు లింగా
యేమి సేతురా లింగా యేమీ సేతు....
... యేటి నాలాగ మీకు కూడా తత్వాలు వచ్చేస్తున్నై కదూ....ఇంక ఆలీసమెందుకు...... పదండి ముందుకు పదండి ముందుకు
పదండి ముందుకు ...పైపైకీ
సారీ , ఇంకా చెప్పలేదు కదూ..... ఇక్కడ మా ఊర్లో... ఇలా పదండి ముందుకు అనడమే కాకుండా చివరి సీటు దగ్గర 'ఇంత లొపలికి వచ్చినందుకు త్యాంక్సులొయ్' అని కూడా చెప్తారండోయ్...... మీకు కూడా త్యాంకులు
Subscribe to:
Post Comments (Atom)
10 వ్యాఖ్యలు:
ఎన్నెల గారు మీరు పోస్ట్ చివర లో sorry అనే పదం ఉపయోగించారు .. ఆ sorry ల మీద పేటెంట్స్ నాకు మాత్రమే ఉన్నాయని బ్లాగ్ లోకం మొత్తం తెలుసు ..కాబట్టి మీరు ఆ sorry ల జోలికి వెల్లకుండా థాంక్స్ లు మాత్రమే ఉపయూగించుకోండేం
సూపరండీ..భలె కవిత వ్రాసేసారే మా మీద! మీరు కపిత్వం అనుకున్నా...అది కవిత్వం లాగే చాలా బాగుంది :)సో! మీ నెమలీకల పోస్ట్ రాకుండా నేను అడ్డుకున్నానన్నమట :))మీరు ఇలాగే మంచి మంచి పోస్ట్లు వ్రాసి మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నా!!
ఇంతకీ మీ బ్లాగ్ ని సంకలినుల్లొ చేరుస్తారా? మీ బ్లాగ్ ముందు మమ్మల్ని ధర్నా చేయమంటారా? ఎందుకంటే..ఇంతమంచి బ్లాగ్ని చదివే అదృష్టం అందరికీ కలిగించాలి కదా! కాబట్టి మీరు త్వరగా మీ బ్లాగుని చెర్చేస్తే...మేము ఆనందిస్తామన్నమాట :)
శివ రంజని గారూ
సొరీలు లేవు ఓన్లీ స్యారీలే అని డిసైడ్ అయ్యాం కదండీ, అయినా ఒప్పుకోరా? పోనీ నేనే ఒక స్యారీ కొనిచ్చెయ్యనా లంచంగా? కుంచుం కన్సిడర్ చేసేసి కుంచుం కుంచుం గా వాడుకోడానికయినా పర్మిషన్ తీసుకోవాలంటే యేమి చెయ్యాలో చెప్పెయ్యండి పొనీ....యీ సారికి ప్లీస్ అంటున్నాగా...
ఇందూ గారూ,
కృతజ్ఞతలండీ ,అమ్మో ధర్నాలంటే భయ్యం... తప్పకుండా పెడతాను. కుంచెం సమయాభావం అంతే.
మీరు మరీ ఆస్మాన్ దాటేసి సొరగం దాకా కొంచవోయిన్రు...ఆడికెల్లి పడతనో యేందో...జెర కిందికి దించురాదురి....
హ హ కవిత్వం బాగుందండి. గూగులమ్మ మొదట నాబ్లాగుకు తీసుకువచ్చిందా Interesting, దేనిగురించి అడిగారేమిటి తనని.
మరో చిన్ని ప్రైవేటు :-) ఎవరెన్ని రాసినా ఎవరి శైలి వారికి సెపరేటు కనుక మీరు మరోఆలోచన పెట్టుకోకుండా చక్కగా మీరు అనుకున్నవి అనుకున్నట్లు రాసేయండి. ఇదివరకే ఎవరైనా టపాయించారా అన్నఆలోచన వదిలేయండి.
సంకలినులలో కలపడం కూడా ఆలస్యంచేయకండి. పెద్ద పనేమీ ఉండదు ఉన్న నాలుగు సంకలినులలో ఒక్కొక్కరికీ ఒక్కో మెయిల్ చేయడం అంతే..
మీకు నన్ను పరిచయం చేసేసినట్టు గూగులమ్మ నాకు చెప్పలేదు చూశారా? :) పోనీ మీరూ చెప్పలేదు. :) వేణూగారి బ్లాగులో మీ కామెంట్ చూసి ఇటొచ్చానండి. చాలా బాగా రాస్తున్నారు. వార్తలకేముందండి? ఎవర్గ్రీన్ అవి. అయినా నేను రాసినవి మొన్నటి నేటి వార్తలు. ఇవాల్టి నేటి వార్తలు మీరు రాసేయండి. :) అన్నట్టు 'ఎన్నెల' పేరు అధ్భుతం.
వేణు గారూ కృతజ్ఞతలు. 'గూగులమ్మా, ఈనాడు ఓపెన్
అవ్వదంట, ఒక మంచి తెలుగు కథ చూపించవూ' అని గారంగా అడిగా..అదీ సంగతి...కొన్ని నెలల క్రితం ఈనాడులొ నెమలి కన్ను అని చూసి బ్లొగ్ లోకి వెళ్ళాను కానీ...మళ్ళీ సమయం లేక మర్చిపొయ్యాను, పేరుతో సహా. అది మనసులో పెట్టుకుని తెలుగు చదివెయ్యాలని
అలా అలా వెతుకుతుంటే మీ బ్లొగ్ దొరికేసింది. అక్కడి నుంచి మిగిలిన బ్లొగ్స్ లోకి వెళ్ళోచ్చని మీ బ్లొగ్ కి వెళ్ళాక ఔడియ వచ్చిందన్న మాట.
మంచి సలహాకి మరియొక సారి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.
శిశిర గారూ
గూగులమ్మ అంతేనండీ...తన పని తను చేసేసి యేమీ తెలియనట్టుంటుంది. అందుకే నేను మీ బ్లొగ్కి వెళ్ళి దండోరా వేసేసాను. మంచి స్నేహితుల్ని ఇచ్చినందుకు గూగులమ్మకి నేను 'పెద్ద థ్యాంక్యూ ' చెప్పాను. ( మీ వైపునుంచి కూడా). పేరు నచ్చినందుకు కృతజ్ఞతలు.... ఇది నాకు చాలా చాల ఇష్టమయిన నా పేరు.
ఎవరేది రాసినా మీరేమి రాయాలనుకున్నా మీ బ్లాగులో హాయిగా రాసుకోండి. చదవడానికి బోలెడు మంది ఉన్నారుగా...
ఇప్పుడిప్పుడే ఈ బ్లాగుల గోలేమిటా అని వెతుకుతుంటే ఏమి
సేతురా అంటూ చక్కగా అలరించారు. కృతజ్ఞతలు.
బ్రహ్మేశ్వర రావు మేకా
బ్రహ్మేశ్వర రావు గారూ మీకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలండీ..నా టపా నేను మళ్ళీ ఒక సారి చదివే అవకాశం వచ్చింది మీ వల్ల.
ఈ మధ్య బ్లాగ్ తలుపులు తెరవడం కుదరట్లేదు. మీ కామెంటుతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చా. ధన్యవాదాలండీ.
Post a Comment