మాలిక పత్రికలో నా కథ "బొమ్మల పెండ్లి"

Monday, June 8, 2015

యాస చదవడం కష్టమని స్నేహితులు అంటున్నప్పుడల్లా వెనుదీస్తూ ముందుకు సాగమన్న మనసు మాట వింటూ ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి వెళుతూ అప్పుడప్పుడు అయినా నాకిష్టమైన యాసలో కథలు వ్రాయాలి అని నిర్ణయం తీసుకున్నందువల్ల చిన్నప్పటి ఙ్ఞాపకాలతో సాగిన ఈ కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పవలసిందిగా మిత్రులని కోరుతున్నా. 
కథ చదువుతున్నప్పుడు మీకు మీరు చేసిన/చూసిన  బొమ్మలపెళ్ళి గుర్తుకి వచ్చిఆనందంతో కానీ కథలోని వేదనతో కానీ మీ కంటి నించి ఒక చుక్క నీరు కారితే  చాలు నా కథకి సార్థకత చేకూరినట్టే .

Story line: చక్కగా బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుంటూ అయోమయంగా, అమాయకంగా  అన్ని వస్తువులతో ఆడుకునే 10 మంది స్నేహితుల గుంపులో ఉన్న అక్కా చెల్లెళ్ళ  తల్లి బిడ్డని కని చనిపోయింది. పిల్లలని బాగా చదివించాలనే కోరికతో ఉన్న తల్లి చనిపోవడంతో  బొమ్మల్లాంటి అక్కచెల్లెళ్ళకి 10, 12 వ ఏట పెళ్లయిపోయింది. తండ్రి ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. వచ్చినావిడ చంటి పిల్ల ప్రభని సొంత తల్లిలా పెంచింది. తీరా ప్రభకి 10 ఏళ్ళు రాగానే దానికీ పెళ్ళి చేసెయ్యాలని తండ్రి తపన.  చదువే ప్రాణం గా పెంచుతున్న తలితండ్రులున్న  ఒక పిల్లకి ఆ పెళ్ళి ఆపాలని తాపత్రయం. ప్రభా వాళ్ళ ఇంటికెళ్ళి కాళ్ళా వేళ్లా పడి ప్రభ తండ్రిని ఒప్పించగలిగే సరికి ఆ తండ్రి మరణం. ఎలాగోలా ప్రభని చదివించడానికి ఊరి వాళ్ళ సహాయం తీసుకుంటూ వెళుతున్నా అడుగడుగునా గండాలే.. ఇదీ కథ ..ఇంక చదువరులకి యాస అడ్డం రాదని భావిస్తున్నాను. 
http://magazine.maalika.org/

http://magazine.maalika.org/2015/06/09/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF/

2 వ్యాఖ్యలు:

శ్రీ said...

చాల బాగా రాసారు .. ఆ యాస బాగ పట్టారనె అనిపించింది..
Very very nice attempt.

Ennela said...

ధన్యవాదాలు శ్రీ గారు, పుట్టి పెరిగిన భాష కదండీ.. నేను పట్టక్కరలేదండీ అదే నన్ను పట్టేసి వదలనంటుంది. అందుకే ఆ యాస వ్రాయాలనే ఈ తపన ..ధన్యవాదాలండీ