క్లినిక్ ....మీరు పొరపాటున హాస్పిటల్ అంటారేమో...కొంపలు అంటుకున్నాయని అనుకుంటారందరూ. ....పొరపాటున హాస్పిటల్ కెళ్ళాం అని చెప్పగానే ఎవరయినా చావు బతుకుల్లో ఉన్నారా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ...అందుకని క్లినిక్ అని మాత్రం ఉపయోగించాలి సరేనా...అందులోను ఫ్యామిలీ క్లినిక్...మా ఊళ్ళో మా ఫ్యామిలీ డాక్టరు గారికి మా ఇంట్లో అందరి పేర్లు ,జాతకాలు అన్నీ తెలుసు...ఎవరమయినా వెళితే అందరి గురించీ అడిగి తెలుసుకుంటారు...పిల్లలని తీసుకురా చూసి చాలా రోజులయింది అంటారు...ఇక్కడకు వచ్చిన కొత్తల్లో మేము పెట్టుకున్న ఫ్యామిలీ డాక్టరు..కుడా ఇదే డైలాగ్ ..ఎంత మురిసిపోయానో చెప్పలేను...ఇంటికి ఫోన్ చేసి మరీ చెప్పాను..తర్వాత్తర్వాత తెలిసింది అదేమీ పిల్లల పైన కాదు కార్డ్ గీకింగ్ మీద అని.......ఆగండి దీని గురించి..కొంచెం క్లియర్ గా చెప్పాలి. రెసిడెంట్స్ కి అందరికీ గవర్నమెంట్ హెల్త్ కార్డ్ ఇస్తుంది దీన్ని ప్రతి సారి క్లినిక్ కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్‌కి మల్లే గీకాలి...ఆ గీకుడుకి క్లినిక్ అక్కౌంట్లో డబ్బులు పడతాయన్న మాట.ఇక్కడ ఎప్పుడయినా డాక్టరు తొ మాట్లాడడాలూ అవీ చెయ్యల్సి వచ్చినా, కార్డ్ గీకాల్సిందే. ఇక్కడ కార్డ్ గీకాక ఒక గంట వెయిటింగ్...అక్కడ నుంచి ఒక రూమ్‌లో కి పంపిస్తారు...అక్కడ ఇంకో గంట వెయిటింగ్....అక్కడ గోడల మీద ఉన్నవి చదివాను సరదాగా...ఒక సారి ఒక ప్రాబ్లం మాత్రమె డిస్కస్ చెయ్యండి....అవురా ...ఒకవేళ నాకు తల నెప్పీ, ఇంకా అల్లప్పుడు మా టాంబాయ్ గిల్లిన గిల్లుడికి వచ్చిన ర్యాష్ తిరగబెట్టింది అనుకోండి ...అప్పుడు ఏది డిస్కషన్ లో పెట్టాలా...అని ఆలోచించీ ఆలోచించీ గంటకి గానీ ఒక నిర్ణయానికి రాలేక పోతానా ...ఈ లోపు డాక్టర్ గారోచ్చి ...పది నిముశాలుండీ వెళ్ళిపోతారు మళ్ళీ మందుల షాప్‌లో ఒక గంట....ఇలాంటి గంటలు గంటలు కూచోవడం విసుగొచ్చి పిల్లలు అసలు రారు. ఆ నోటా ఈ నోటా విన్న విశేశాలేంటంటే ఎవరికో చిన్నా చితకా పనులు చెయ్యడం తో వెన్ను నొప్పి వచ్చి ఎం ఆర్ ఐ టెస్ట్ చేయించారు..ఆటెస్ట్ చెయ్యడానికి అపాయింట్మెంటు తొమ్మిది నెలల తర్వాత ఇస్తే రిసల్ట్స్ డిస్కస్ చెయ్యడానికి స్పెషలిస్ట్ అపాయింట్మెంటు ఇంకో ఆరు నెలలక్కానీ దొరకలేదుట. అలాగే ఇంకొకరికి స్కిన్ అలర్జీ వస్తే స్కిన్ స్పెషలిస్ట్ అపాయింట్మెంటు ఎనిమిది నెలల తర్వాత ఇచ్చారుట. ఈ లోపు పేషంట్ బానే ఉంటె ఫర్వాలేదు ..లేక పొతే 'శ్రీ మద్రమా రమణ గోవిందో హారి' ఏ మాటకామాటే చెప్పు కోవాలి, ఎమర్జెన్సీ కేసులు మాత్రం911కి కాల్ చెయ్యగానే ఇంటికొచ్చి మరీ తీసుకెళతారు..ఇంకా మంచి వైద్య సదుపాయాలూ ఉంటాయిట.
ఇంత వెయిటింగ్ మన వల్ల కాదులే అని క్లినిక్కులకి దూరంగా ఉన్నాము కొద్ది రోజులు, కానీ చిన్నాడికి హయ్ ఫీవర్ రావడంతో రాక తప్పలేదు...ఇలాంటి వెయిటింగ్లన్నీ అయ్యాక డాక్టరు గారోచ్చి..వాడి ఫయిల్ చెక్ చేస్తున్నారు...ఆవిడ మోహంలో ఏదో గందరగోళం కనిపిస్తోంది..తల అటు ఇటు కదుపుతూ'ఇంపాసిబుల్' అన్నారు....'ఏంటి డాక్టర్, ఎనీ ప్రాబ్లం 'అన్నాన్నేను ఖంగారుగా ..ఇంత చిన్న పిల్లాడికి 140/90ప్రెషర్ ఉండకూడదు...ఎక్కడో సం థింగ్ రాంగ్ అన్నారావిడ...నాకు లయిట్ వెలిగింది..ఒక్కసారి ఫయిల్ పయిన పేరు చెక్ చెయ్యొచ్చా అని అడిగాను....వెంకట కృష్ణ కార్తీక చచ్చీ చెడీ ఆ పీరుని అష్ట వంకర్లు...శత ఖూనీలు చేసి అరగంట టయిము తీసుకుని చదివారావిడ...ఇంకా మిగిలిన పేరు రాయడానికి దాని పయిన స్థలం లేదు..సారీ డాక్టర్...ఇది వీడి నాన్నగారి ఫయిల్ అయి ఉంటుంది అన్నాన్నేను ...ఉండండీ ఇప్పుడే వస్తాను అని ఆవిడ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి వచ్చారు. వాళ్ళని అడిగి ఫయిల్ వెతికించి దాని పయిన ఉన్న డేట్ ఆఫ్ బర్తు సరి చూసి, కొంచెం వాళ్ళని 'ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ్యండీ' అన్నట్టున్నారు కూడా (సరదాగా వ్రాసాను, ఇక్కడ అలా ఎవ్వరూ ఎవరినీ అనరని నా నమ్మకం..కానీ హు నోస్ ) మందులు వ్రాయిన్చుకుని బయటికి వచ్చాము ...అక్కడ రిసెప్షన్ లో పని చేస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఒకరు గుజరాతీ ఇంకొకరు పాకిస్తానీ. బయటికి రాగానే నేను మా వాళ్ళ ముగ్గురి ఫయిల్సు తీయించి దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళ పేరు మధ్యన ఒక అక్షరం పెట్టించాను.. వెంకట కృష్ణ కే కార్తీక...వెంకట కృష్ణ ఎస్ కార్తీక, వెంకట కృష్ణ జి కార్తీక అని.వెళ్ళబోతూ...కొంచెం అవతల పెట్టుకున్న మా గంగిరెద్దు సరంజామా తీసుకుంటున్నాను .వాళ్ళిద్దరూ నన్ను శ్రీలంకన్ అని డిసైడు చేసేసారు అందుకని హిందీలో మాట్లాడేసుకోవడం మొదలెట్టారు. 'ఏంటో ప్రపంచం లో పేర్లు లేనట్టు తండ్రికీ పిల్లలకీ ఒకటే పేరు....హు...అనవసరంగా మనకి తిట్లు పడ్డాయి.అని ..ఈ డయిలాగ్ ఎక్కడో విన్నట్టు ఉండే.....ఓ ఇది నా డయిలాగ్ కదూ! స్కేమ్బారిస్ ఫామిలీ గురించీ...ఓరి దేవుడో...నా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం పెట్టుకునీ ఎవర్నో విమర్శించానా ! దేవుడా నన్ను క్షమించేయి అని లెంపలేసుకుని ...నేను నవ్వుతు...'క్యా కరే మజబూరీ' అన్నాను. ఆ పిల్ల గతుక్కుమని..సారీ అండీ మీకు హిందీ ఎలా వచ్చు...అంది..నేను హిందుస్తానీనే తల్లీ, ఏంటో మనవాళ్ళని మన వాళ్ళు గుర్తు పట్టరు అన్నాను.'ఆహా బొట్టు పెట్టుకున్నరుగా అందుకు.. ...నసిగింది...'బొట్టు పెట్టుకోవడం మన జన్మ హక్కు' పైన ఒక క్లాసు పీకాను. ఇద్దరు కొంచెం ఫ్రెండ్లీ ఫేసు పెట్టి నవ్వుతు మాట్లాడారు ( కవరింగ్ అండీ ..అర్థమయ్యింది కదూ) ..చివరకి 'అవును అందరి పేర్లు ఒక్కటే ఉన్నాఏంటీ ' అని అడిగారు నవ్వులు చిందిస్తూ. ..నేను నవ్వాను చిన్నగా...చరిత్ర లోకి వెళితే...
మా వారి తాత గారు రావ్ బహద్దూర్ కార్తీక వెంకటకృష్ణ ప్రసాద్ . ఈయన నాగ పూర్ రాజా వారి ఆస్థానంలో దీవాన్ గా పని చేసేవారట.గత 400 ఏళ్ళుగా వారి ఇంట్లో ప్రతి రెండవ తరం పెద్ద కొడుకు పేరు ఇదే.వారి సోదరి వెంకట కృష్ణ కుమారి. కృష్ణ ప్రసాద్ గారి అక్కకు పిల్లలు లేరు....కృష్ణప్రసాద్ గారి పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఆవిడ తన పేరు పెట్టమని కోరారట ..ఆవిడ కోరిక మీద ఆ పిల్లవాని పేరు...వెంకట కృష్ణ కుమార్( మా మావగారు)అని పెట్టారు. మళ్ళీ వెంకట కృష్ణ కుమార్ గారి పెద్ద కొడుకు వెంకట కృష్ణ ప్రసాద్(మా వారు) . మిగిలిన నలుగురు పిల్లలకి ఆయనకి తోచిన పేర్లు పెట్టుకున్నారు... ఈ నలుగురు కొడుకుల్లో తలోకరికి ఇద్దరు మగ పిల్లలు జన్మించారు...మా పెద్ద బాబుకి మావయ్య గారి పేరు కలిపి శిరీష్ అని పేరు పెట్టేశాం. రెండవ వాడికి మ్యాచ్ అయ్యేట్లు వెంకట కృష్ణతో మొదలెట్టి గణేష్ అనీ పెట్టాము. మిగిలిన తమ్ముళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరికీ పెట్టాము కదా చాలు వేరే పేర్లు ఏవైనా పెడదాము అన్నారు మా వారు...నాన్న పేరు పెట్టాల్సిందే అని ప్రతి ఒక్క పిల్లవాడికీ మావయ్య గారి పేరు కలుపుకుని వెంకట కృష్ణ తో మొదల్లయ్యి ,, హరీష్, మహేష్ , ...గిరీష్,నరేష్, సురేష్, సతీష్ అని పేర్లు పెట్టారు...ఇంటి పేరు కార్తీక....సో వీళ్ళందరి పేర్లల్లో కామన్ గా ఉన్న కార్తీక వెంకట కృష్ణ అనే పదాలు కే వీ కే గా మారి పేర్ల ముందర నిలిచి పోయాయి . కే వీ కే శిరీష్, కే వీ కే హరీష్...అని పిలుచుకుంటారు స్కూల్ లో . అందరి పేర్లలోనూ మావయ్య గారి పేరున్నందుకు అందరికీ హ్యాప్పీ. మేము కెనడాకి వచ్చేంత వరకు అంతా ఒకే మరి ఇక్కడ కొచ్చాక అందరికీ మొదటి పేరు చివరి పేరు ఇంపార్టెంట్ .బయట మనం ఇష్టమొచ్చిన పేరు చెప్పుకోవచ్చు పిలుచుకోవడానికి( మన మెకంజీ, జంబో,లకీ లాగా) కానీ అన్నిగవర్నమెంటు డాకుమెంట్ల మీద అఫీషియల్ పేర్లు ఉంటాయి. సో, ఎటు తిప్పినా ఇక్కడ ముగ్గురి మొదటి పేరు వెంకట కృష్ణ మరియు ఇంటి పేరు కార్తీక...
ఇంత వరకు ఒక మోస్తరుగా ఒకే...తొందరలో మా వారి తమ్ముల్లిద్దరు ఇక్కడికి రాబోతున్నారు...మా వారి తో కలిపి ఏడు గురు వెంకట కృష్ణలు. ఇప్పటికే ఫోన్లోస్తే ఏ వెంకట్ కావాలి ఆరో గ్రేడ్ వెంకటా. ఎనిమిదో గ్రేడ్ వెంకటా, వాళ్ళ నాన్న వెంకటా అని అడగాల్సి వస్తోంది....ఇంకెంత గందరగోళం అవుతుందో ఊహించడానికే కష్టంగా ఉంది . మీరు నవ్వుతారేమో...'నో వయిఫ్, నో స్టమక్, సన్ను నేము సోమలింగం ' అని...కానీ మా ఎనిమిది మంది పిల్లల కి పుట్టబోయే పెద్ద కొడుకులందరి పేరు వంశ పారంపర్యంగా ; వెంకటకృష్ణ ప్రసాద్ . మాతో పాటు మీకు గందర గోళం గా అనిపిస్తోందా? అందుకే నెక్స్ట్ జెనరేషన్ కి పేర్లు మార్చాలని మేము అనుకుంటూ ఉంటాము..మా వారు అత్తయ్య గారికి ప్రత్యక్షం గాను, పరోక్షం గాను ఈ విషయం తెలియ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తరవాత మాట అనుకోండీ. మరి మా రాబోయే కోడళ్ళు....వంశ పారంపర్యం ఎలా మారుస్తాం అత్తయ్య అందరిలో మావయ్య గారు ఉండ వద్దూ అంటారేమో...మీరేమంటారు?
అందర్లో మావయ్య-II
Saturday, January 1, 2011
Posted by
Ennela
at
Saturday, January 01, 2011
Email This
BlogThis!
Share to Twitter
Share to Facebook

వ్యాఖ్యలు
జోరుగా హుషారుగా ..
Subscribe to:
Post Comments (Atom)
10 వ్యాఖ్యలు:
హమ్మ . . . హమ్మా నవ్వి నవ్వీ కళ్ళళ్ళో నీళ్ళోచ్చేసాయండీ బాబూ :)
బయటవాళ్ళు కంఫ్యూజ్ అయితే పర్లేదండీ..పాపం ఆ వచ్చే కోడళ్ళు కంఫ్యూజ్ అయితే కష్టమేనేమో మరి..:)
జార్జి ది సిక్స్త్ అన్న పద్ధతిలో పేర్లు పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. అయినా పాపం అంత మంచి పేరు ని సీతయ్య గారు గా మార్చేసారుగా మీరు. వచ్చే కోడళ్ళు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. -:)
అదా...అందరిలో మావయ్య అంటే ఏమిటో అనుకున్నా, ఇదా...ఇప్పుడర్థమయింది.
హహహ్హ బావుంది...మా ఇంట్లోనూ ఇలాంటిదే ఓ కథ ఉంది.
మా ముత్తాతగారి తాత గారి పేరు వెంకట రమణమూర్తి (ఇంతకి ముందు తరం సంగతి నాకు తెలీదు), ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటాచలం. ఆ వెంకటాచలం గారి పెద్దబ్బాయి పేరు వెంకట రమణమూర్తి. ఆయనే మా ముత్తాతగారు. మా తాతగారి పేరు వె.చ, మా పెద్దనాన్నగారి పేరు వె.ర, మా పేద్దన్నయ్య పేరు మళ్ళీ వె.చ.....ఇంక ఇలా ప్రతీ తరంలోనూ పుట్టే పెద్ద కొడుకు పేరు వెంకట రమణ మూర్తి, వెంకటాచలం పేర్లు alternative గా వస్తూ ఉన్నయన్నమాట. ఎవరైనా వెంకటాచలం తాతగారనో, వెనకటరమణమూర్తి తాతగారనో అంటే మేమంతా ఏ వె.చ? ఏ వె.ర? అని అడిగేవాళ్ళం. ఇహ చాలు ఈ గోల అని చెప్పి మా దొడ్డమ్మ, మా అన్నయ్య కొడుకుకి వేరే పేరు పెట్టమన్నారు. కాబట్టి నా మేనల్లుడికి పేరు మారింది. హమ్మయ్య అని అందరం ఊపిరి పీల్చుకున్నాం.
కాకపోతే ఈ వెంకట అన్నది మాత్రం మారలేదు. మా ఇంట్లో ప్రతీ అబ్బాయికి, ఆడపిల్లకి (నాతో సహా) వెంకట తగిలించేస్తారు. మా అందరికి "ఆలమూరు వెంకట" కామన్ అన్నమాట. మొన్ననే ఇంకో అన్నయ్యకి కొడుకు పుట్టాడు. వాడికీ వెంకట తగిలించేసారు....ఇక ఈ పేరుకి విడుదల ఎప్పుడో తెలీదు!
హ్హహ్హహ్హా! నిజమేనండీ అంత అందమైన పేరుని 'సీతయ్యా గా మార్చారు.దీన్ని మేము ఖండిస్తున్నాం :)) ఇకపోతే మీ ఇంట్లో సంగతి తలుచుకుంటే నాకు నవ్వొస్తోందీ...'సిక్స్త్ గ్రెడ్ వెంకటా? ఏయిత్ గ్రెడ్ వెంకటా?' హ్హహ్హహా! పాపం కదా మీరు!
నాకు ఆ గంగిరెద్దులు అంటే భలే నవ్వొస్తుందండీ ఏం పేరు పెట్టారు దానికి!! వహ్వా..వహ్వా!
>>'నో వయిఫ్, నో స్టమక్, సన్ను నేము సోమలింగం 'ఆహా! ఏం చెప్పారు! ముందు అర్ధం కాలా! ఏటబా నో వైఫ్..నో స్టమక్ ఏంతీ అనుకున్నా...నో సోమలింగం అన్నప్పుడు అర్ధమయింది :))
మొత్తానికి మీ అందర్లో మావయ్య భలే ఉందండీ :))
మాలా గారు, కృతజ్ఞతలండీ.మీకు నచ్చినందుకు నేను బోల్డు హాప్పీ
తృష్ణ గారు,కృతజ్ఞతలండీ. అవునండీ,గుడ్ పాఇంట్..మీరు ఈ పాఇంట్ చెప్పాక మార్చెయ్యాలని తపన మరీ పెరిగింది మరి..హహహ
సుబ్రహ్మణ్యం గారు, కృతజ్ఞతలండీ.మంచి సలహా...పాటించ ఉపయుక్తముగా నున్నది.ఫీసు గట్రా కలెక్టు చెయ్యరు కదా!.
ఎంత మంచి పేరుండీ యేం లాభమండీ, మాట వినని వాళ్ళని సీతయ్యనే అంటారు మరి...
సౌమ్య గారు, కృతజ్ఞతలండీ."ఎవరైనా వెంకటాచలం తాతగారనో, వెనకటరమణమూర్తి తాతగారనో అంటే మేమంతా ఏ వె.చ? ఏ వె.ర? అని అడిగేవాళ్ళం "ఇది మాత్రం సూపరు. ఇప్పుడు నాకొక ఔడియ వచ్చిందండీ, మనకి కావల్సిన పేరు ముందు పెట్టి..వెంకట , సుర్య, కృష్ణ, హనుమంత..అన్నీ మధ్యన పెట్టుకుంటే బెటర్ గా ఉంటుందేమో...ఛ, కొన్నేళ్ళ క్రితం రాలేదే యీ థాటూ
ఇందు గారు, కృతజ్ఞతలండీ..అవునండీ పాపం నేను..ఇంకా ఇంఫెంట్ వెంకటా..యు కే జీ వెంకటా, ఇలా అడగాలేమో, మీరు కెనడా వచ్చినప్పుడు చూస్తారుగా ఆ గంగిరెద్దుల చొద్యం,వింటరు లో రావాలి మరి..అయ్యొ అవునా,సొమ లింగం పెట్టక పోతే తెలిసేది కాదా? సీతయ్య గారి పేరు ఇప్పట్లో మారదండీ...కనీసం ఇప్పటికిప్పుడు యెవరింటికయినా తీసుకెళ్ళినా చాలు, మార్చెయ్యొచ్చు...కానీ చాన్సు ఇవ్వరే!
:)))))))))
చాల హస్యం పండించారండి చాల నవ్వు తెప్పించారు. మీరు ఇలాగే రాసుకుంటూ వెళ్లాండి.మీ బ్లాగ్ లో ఎన్నెల కాంతులను విరజిమ్మి చికటిలేని సామ్రాజ్యన్ని అవరోధించండి..హ్హహ్హహ్హా
ఎన్నెల గారు కొంచెం బిజీ ఉండటం వల్ల (అంటే మీరు బిజీ లేరు అని కాదు అర్ధం )ఫాలో అవ్వలేక లేకపోయాను మీ పోస్ట్ లు ..ఇకపోతే మీకు కొన్ని విషయాలు చెప్పాలి
1.మీ బ్లాగ్ పేరు ..... బాగుంది
2. మీ టెంప్లెట్ .......... బాగుంది
2. మీ శైలి ........ బాగుంది
3. మీ పోస్ట్ ...బాగుంది ........
తెగ తెగ నచ్చేసాయి ( మగధీర సినిమాలో పాట ని ఊహించుకుని చదువుకోండేం ఈ కామెంట్ )
అశోక్ గారు మీ ఎన్నెల కామెంటుకి ఎక్కడికో వెళ్ళిపోయానండీ కృతజ్ఞతలు..
శివ రంజని గారు....ఆ పాట యేంటా తెలియ లేదు...మొత్తానికి" నా కోసం నువు జుట్టు పీక్కుంటె..బాగుందీ" పాటన్నమాట...మంచి పాట వినిపించారు అండ్ మంచి కామెంటేసారు కృతజ్ఞతలండీ..అడిగానని అనుకోవద్దు కానీ...టపాలేవండీ...అభిమానులు వెయిటింగ్ కదా?
Post a Comment